ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, ఆర్ బీఐ రివ్యూ పాలసీ అంచనాలతో దలాల్ స్ట్రీట్ పాజిటివ్ గా స్పందిస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 45 పాయింట్లు బలపడి 26438వద్ద, , నిఫ్టీ 19 పాయింట్లు పెరిగి 8162 వద్ద ట్రేడవుతోంది. ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్, ఆటో, మెటల్ రంగాలు లాభాల్లోనూ. ఫార్మా బలహీనంగాను కొనసాగుతున్నాయి. అంబుజా సిమెంట్ టాప్ గెయినర్ గా ఉంది. బీపీసీఎల్, హీరోమోటో, లుపిన్, అదానీ పోర్ట్స్, మారుతి, బాష్ లాభాల్లో, సన్ ఫార్మా , అరబిందో ఫార్మా, జీ, టీసీఎస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ నష్టాల్లోను ఉన్నాయి.
మరోవైపు దేశీ సూచీల్లో ఎఫ్‌ఐఐలు అమ్మకాల జోరుకు మంగళవారం బ్రేక్ పడింది. దాదాపు రూ. 162 కోట్ల మేర కొనుగోళ్లు నమోదయ్యాయి. అటు డాలర్ మారకపు విలువలో రూపాయి బాగా బలంగా కొనసాగుతోంది. ద్రవ్యపరపతి విధానం సమీక్ష అంచనాల నేపథ్యంలో 36పైసలు పైకి ఎగబాకింది. దీంతో రూ. 68 స్థాయి నుంచి ఎగిసి 67.86 వద్ద కొనసాగుతోంది.
లాభాల్లో మార్కెట్లు
Published Wed, Dec 7 2016 10:15 AM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM
Advertisement