ముంబై: స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ తీవ్ర ఒడిదుడుకులను ఫేస్ చేశాయి. బ్రెగ్జిట్ పరిణామాల అనంతరం తొలిసారి ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో.. నష్టాలతో బెంబేలెత్తిన దేశీయ మార్కెట్లు మంగళవారం గా కోలుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 122 పాయింట్ల లాభంతో 26,524 దగ్గర, నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 8,127 దగ్గర ముగిసాయి.
గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల ప్రభావం దేశీయ మార్కెట్లను లాభాలపైపు మళ్ళించింది.. భారతీయ కరెన్సీ రూపాయి గత వారం యొక్క బ్రెగ్జిట్ హ్యాంగోవర్ నుంచి గణనీయంగా కోలుకుంటూ ఉండడం కూడా భారత ఈక్విటీ సూచీలకు సానుకూలంగా మారింది. అటు బులియన్ ధరలు ఈరోజు నష్టాలను నమోదు చేశాయి. దాదాపు 350 రూ.పైగా నష్టపోయింది. రూపాయి 0.03 మూడుపైసల లాభంతో 67.91 దగ్గర ఉంది.
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
Published Tue, Jun 28 2016 4:17 PM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM
Advertisement