సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ఈ వారంలో వరుసగా మూడో రోజుకూడా లాభాలతో ఆరంభమైన సూచీలు అనంతరం మరింత పుంజుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 260 పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 12వేల మార్క్‌ను టచ్ చేసింది. ప్రస్తుతం సెన్సెక్స్ 168 పాయింట్లు ఎగిసి 40631 వద్ద, నిఫ్టీ 44 పాయింట్ల లాభంతో 11983 వద్ద కొనసాగుతున్నాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కీలక సూచీలు రెండూ గరిష్టాల వద్ద జోరుగా సాగుతున్నాయి. టెలికం, అయిల్ అండ్ గ్యాస్, ప్రభుత్వ బ్యాంకింగ్ సెక్టార్ తో పాటు, దాదాపు అన్ని రంగాలు లాభపడుతున్నాయి మరోవైపు టాప్ విన్నర్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ వైపు దూసుకుపోతోంది. ఆరంభంలోనే రూ. 9.5లక్షల కోట్లను టచ్ చేసింది.
రిలయన్స్, భారతిఎయిర్టెల్, ఇండస్‌ఇండ్, కోల్ ఇండియా,లార్సెన్, ఓఎన్‌జీఈసీ, సన్‌ఫార్మా లాభపడుతుండగా బ్రిటానియా, యస్‌బ్యాంకు, ఐటీసీ, బజాజ్‌ఆటో, నెస్లే,గెయిల్, ఐషర్‌మోటార్స్,ఎన్‌టీపీసీ నష్ట పోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment