Cross 30
-
ఆల్ టైం హైలో స్టాక్‌మార్కెట్లు
ముంబై:దేశీయ స్టాక్‌మార్కెట్లు అంచనాలకనుగుణంగానే ఇవి చరిత్రాత్మక గరిష్టాల వద్ద మొదలయ్యాయి. ఆరంభంలోనే 30వేల మైలురాయిని అధిగమించిన సెన్సెక్స్ స్థిరంగా కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు బుల్ దూకుడుతో ప్రస్తుతం సెన్సెక్స్ 109 పాయింట్లు ఎగిసి 30,042, వద్ద, నిఫ్టీ పాయింట్ల లాభంతో9,331 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని ప్రధాన రంగాలూ లాభపడుతున్నాయి. మెటల్, బ్యాంక్ నిఫ్టీ, ఎఫ్ఎంసీజీ లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా బోనస్ షేర్ల ప్రతిపాదనతో విప్రో 2.2 శాతం ఎగసింది. హిందాల్కో, ఎంఅండ్ఎం, బీవోబీ, యాక్సిస్ బ్యాంక్ లాభాల్లో కొనసాగుతుండగా, ఇన్ఫ్రాటెల్ టాప్ లూజర్‌గా ఉంది. టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, జీ, సిప్లా స్వల్పంగా నష్టపోతున్నాయి. అటు ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల తొలి రౌండ్లో సెంట్రిస్ట్ అభ్యర్థి మాక్రన్ విజయం సాధించడంతో సోమవారం ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు జోష్‌వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అటు అమెరికాసహా ఇటు ఆసియా వరకూ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. అటు డాలర్ మారకంలో రూపాయి కూడా బలంగా ఉంది. 0.48పైసల లాభంతో రూ.63.96 వద్ద రికార్డ్ స్థాయిని నమోదు చేసింది. రూ. 64 స్థాయిని తొలిసారి బ్రేక్ చేసి 20 నెలల గరిష్టాన్ని తాకింది. అయితే బంగారం మాత్రం మరింత బలహీనపడింది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. రూ. 305 నష్టపోయిన పుత్తడి రూ. 28,826 వద్ద వుంది. -
సెన్సెక్స్ 30వేలు దాటేస్తుందా?
ముంబై: మంగళవారం నాటి హవానుకొనసాగిస్తూ నేడు (బుధవారం) దేశీయ స్టాక్ మార్కెట్లు తమహవాను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆల్ టైం గరిష్టం వద్ద నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ముగియడం, సెన్సెక్స్ 30 వేల స్థాయికి చేరువగా పటిష్టంగా ముగిశాయి. అటు అంతర్జాతీయ సంకేతాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేటి సెషన్లో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ తన కీలకమైన మానసిక స్థాయి 30,000 అధిగిమించే అవకాశాలు మెండుగా కనిపిస్తాయి. నిన్నటి సెషన్లో సెన్సెక్స్ 287 పాయింట్లు పెరిగి 29,943 వద్ద ముగియగా, నిఫ్టీ 89 పాయింట్లు పెరిగి 9,306 వద్ద స్థిరపడింది. ఇదిలా ఉండగా మంగళవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు 179 కోట్ల రూపాయల షేర్లను కొనుగోలు చేశారు. మరోవైపు ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 21 పాయింట్లు పెరిగి 9,316 వద్ద ట్రేడవుతోంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ లాభాలు ఆర్జించడంతో ఆర్ఐఎల్ షేరు రికార్డ్ స్థాయిలో దూసుకుపోతోంది. మంగళవారం మార్కెట్ ముగిసిన తర్వాత దేశీయ మూడవ పెద్ద సంస్థ ఇటీ సంస్థ విప్రో ఫలితాలను ప్రకటించింది. ఇది కూడా మార్కెట్‌కు సానుకూలంగా మారనుంది. విప్రో వాటాదారులకు 1: 1 బోనస్ ప్రకటించింది. ఇది స్టాక్‌కు ప్రతికూలం. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగే అవకాశం ఉంది. యాక్సిస్ బ్యాంక్, టాటా స్పిన్, కెపిఐటీ టెక్నాలజీస్, స్టెర్లైట్ టెక్నాలజీస్, జిఐసి హౌసింగ్ తదితర సంస్థలు మార్చి త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి.