ముంబై: ప్రపంచ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల నేపథ్యంలో గురువారం నాటి దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. బీఎస్సీ సెన్సెక్స్ సెన్సెక్స్ 236 పాయింట్ల లాభంతో 27,002దగ్గర, నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో8270 దగ్గర క్లోజయ్యాయి. బ్రెగ్జిట్ రెఫరండం ఫలితాలకోసం ప్రపంచ మార్కెట్లు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న క్రమంలో ఉదయం ఫ్లాట్ గా మొదలయ్యాయి. యూరోపియన్ మార్కెట్లు బలంగా మొదలుకావడంతో మన మార్కెట్లు కూడా కోలుకొన్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన మద్దతు స్థాయిలకు పైన స్థిరంగా ముగిసాయి. బ్యాంకింగ్, అటో మొబైల్, హెల్త్ కేర్ రంగంలో కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపారు.
మరోవైపు రూపాయి బలంగా ఉండడం, ఇటీవలి ప్రభుత్వ ఆర్థిక నిర్ణయాలు ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేశాయని ఎనలిస్టులు అంచనావేశారు. బ్యాంకింగ్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించిందనీ, ఐటీ, ఫార్మా షేర్లు మిశ్రమంగా స్పందించాయని ట్రేడ్ బుల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ధృవ్ దేశాయ్ చెప్పారు.
అటు అమెరికా కరెన్సీ డాలర్ తో పోలిస్తే రూపాయ మరింత బలపడింది. 24 పైసల కోలుకొని 67.24 దగ్గర ఉండగా, బులియన్ మార్కెట్ ట్రెండ్ మరింత నెగిటివ్ గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రా. పుత్తడి 30 వేల కింది పడిపోయింది. 192. రూపాయల నష్టంతో రూ. 29,930 దగ్గర ఉంది.