Edible Oil Imports up by 25PC in First 9 Months of 2022 23 Season - Sakshi
Sakshi News home page

వంట నూనెల ధరలు తగ్గాయి.. దిగుమతులు భారీగా పెరిగాయి!

Published Tue, Aug 15 2023 8:33 AM | Last Updated on Tue, Aug 15 2023 10:09 AM

Edible oil imports up by 25pc in first 9 months of 2022 23 season - Sakshi

న్యూఢిల్లీ: వెజిటబుల్‌ నూనెల దిగుమతులు జూలై నెలలో భారీగా పెరిగిపోయాయి. 17.71 లక్షల టన్నుల మేర దిగుమతులు నమోదైనట్టు సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఈఏ) ప్రకటించింది. 2022 జూలై నెలలో నమోదైన 12.14 లక్షల టన్నుల దిగుమతులతో పోలిస్తే 46 శాతం పెరిగినట్టు తెలిపింది. 2022–23లో తొలి తొమ్మిది నెలల సీజన్‌లో (నవంబర్‌–అక్టోబర్‌) దిగుమతులు 23 శాతం పెరిగి 122.54 లక్షల టన్నులుగా ఉన్నట్టు పేర్కొంది.

వెజిటబుల్‌ నూనెల్లో వంటకు వినియోగించేవే కాకుండా, వంటకు వినియోగించనివి (ఆహార పదార్థాల్లో వినియోగానికి) కూడా ఉంటాయి. ఇక ఈ ఏడాది జూలైలో వంట నూనెల దిగుమతుల వరకే చూస్తే 46 శాతం పెరిగి 17.55 లక్షల టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఇవి 12.05 లక్షల టన్నుల మేర దిగుమతి అయ్యాయి. ఇతర నూనెల దిగుమతులు 9,069 టన్నుల నుంచి 15,999 టన్నులకు పెరిగాయి.

దేశీయంగా వంట నూనెల ధరలు గణనీయంగా తగ్గడంతో డిమాండ్‌ తిరిగి పెరిగినట్టు ఎస్‌ఈఏ తెలిపింది. దేశంలో 45 రోజుల వినియోగానికి సరిపడా వంట నూనెల నిల్వలు ఉన్నాయని, పండుగల రోజుల్లో నూనెల సరఫరా మెరుగ్గా ఉంటుందని పేర్కొంది. పామాయిల్‌ను ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటుండగా, అర్జెంటీనా నుంచి సోయాబీన్‌ ఆయిల్‌ దిగుమతి అవుతోంది. సన్‌ఫ్లవర్‌ నూనె ప్రధానంగా రష్యా, ఉక్రెయిన్‌ నుంచి వస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement