Windfall Tax on Crude oil భారతదేశంలోని చమురు ఉత్పత్తిదారులకు భారీ షాక్ తగిలింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురుపై విండ్‌ఫాల్ టాక్స్‌ను భారీగా పెంచింది. టన్నుకు రూ.6,700 నుంచి రూ.10,000కు కేంద్ర ప్రభుత్వం పెంచింది. సవరించిన ధరలు నేటి (సెప్టెంబర్ 16)నుంచే అమల్లో ఉంటాయి. తాజా నిర్ణయంతో ఇప్పటికే పెట్రో భారంతో అతలాకుతమవుతున్న సామాన్యులపై మరింత భారం పెరగనుంది.
ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF)పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (SAED) లీటర్‌కు 4 రూపాయల నుండి 3.50 రూపాయలకు ప్రభుత్వం తగ్గించింది. అలాగే డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను లీటరుకు రూ.6 నుంచి రూ.5.5కు తగ్గిస్తున్నట్లుకేంద్రం ప్రకటించింది. పెట్రోల్ ఎగుమతిపై SAED సున్నాగా కొనసాగుతుంది. గత రెండు వారాల సగటు చమురు ధరల ఆధారంగా ప్రతి పక్షం రోజులకు ఒకసారి పన్ను రేట్లు సమీక్ష ఉంటుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 2న జరిగిన పక్షంవారీ సమీక్షలో ప్రభుత్వం ముడి పెట్రోలియంపై టన్నుకు రూ.7,100 నుంచి రూ.6,700కి తగ్గించింది.
భారతదేశంలోని చమురు ఉత్పత్తిదారులపై విండ్‌ఫాల్ పన్నును గత ఏడాది జూలైలో మొదటిసారిగా విధించారు. అలాగే సెప్టెంబర్ 1న ప్రభుత్వం పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను టన్నుకు రూ.7,100 నుంచి రూ.6,700కి తగ్గించిన సంగతి తెలిసిందే.మరోవైపు చమురు ధరలు 10 నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment