Windfall Tax
-
విండ్‌ఫాల్ ట్యాక్స్ రద్దు
కేంద్ర ప్రభుత్వం ముడి చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పన్ను తొలగింపు నిర్ణయిం ఈరోజు నుంచే అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం టన్ను ముడి చమురుపై రూ.1,850 వరకు విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను వసూలు చేస్తున్నారు.కేంద్రం జులై 19, 2022 నుంచి విండ్‌ఫాల్ పన్నును విధించింది. ఈ ట్యాక్స్ అమల్లోకి వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా తొలగించడం ఇది రెండోసారి. చివరిసారి ఏప్రిల్ 4, 2023న ఈ ట్యాక్స్‌ను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రైవేట్ రిఫైనర్లు స్థానికంగా చమురు ఉత్పత్తులను విక్రయించడానికి బదులు అధిక మార్జిన్ల కోసం విదేశాల్లోని రిఫైనరీలకు అమ్ముతుంటారు. దాన్ని అరికట్టడానికి ప్రభుత్వం విండ్‌ఫాల్ ట్యాక్స్ విధిస్తుంది. 2022 నుంచి గ్యాసోలిన్, డీజిల్, విమాన ఇంధనాల ఎగుమతులపై పన్నును పొడిగిస్తూ వచ్చారు. ప్రస్తుతం దాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.ఇదీ చదవండి: నాలుగేళ్లుగా ఉన్న ఆంక్షలు ఎత్తివేత!కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 31న దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై టన్నుకు రూ.2,100గా ఉండే విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను రూ.1,850కి తగ్గించింది. పెట్రోలియం ఉత్పత్తులపై రూ.2,400గా ఉన్న లెవీని రూ.2,100కి చేర్చింది. ప్రభుత్వం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఈ పన్నుకు సంబంధించి సమీక్ష నిర్వహిస్తోంది. గ్లోబల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర ఏప్రిల్‌లో బ్యారెల్‌కు 92 యూఎస్ డాలర్లుగా ఉండేది. ప్రస్తుతం అది 75 డాలర్లకు పడిపోయింది. -
‘విండ్‌ఫాల్’ బాదుడు!
దేశీయంగా ఉత్పత్తయ్యే ముడి చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను కేంద్రం పెంచింది. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దేశీయంగా వెలికి తీస్తున్న ముడి చమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్‌ను టన్నుకు రూ.3,300 నుంచి రూ.4,600కు పెంచారు. ఈ పన్నును ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (ఎస్ఏఈడీ) రూపంలో వసూలు చేస్తారు. డీజిల్ ఎగుమతులపై ఎస్ఏఈడీ లీటరుకు రూ.1.50 ఉండగా, పూర్తిగా తొలగించారు. ఇదీ చదవండి: రూ.209 కోట్ల 'రోల్స్ రాయిస్' కారు - వివరాలు పెట్రోలు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయెల్(విమాన ఇంధనం)పై సుంకం లేదు. కొత్త రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అదాటు లాభాలపై పన్నును తొలిసారిగా 2022 జులై 1న ప్రభుత్వం విధించింది. -
క్రూడాయిల్‌పై పన్ను పెంపు.. ఎంతో తెలుసా..
ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న తరుణంలో దేశీయంగా ఉత్పత్తయ్యే క్రూడాయిల్‌పై కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ప్రపంచ మార్కెట్లో తాజాగా ముడి చమురు ధర 80 డాలర్లు దాటిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తయ్యే క్రూడాయిల్‌పై విండ్‌ఫాల్ టాక్స్‌ను స్వల్పంగా పెంచింది. పదిహేను రోజులకోసారి సవరించే ఈ పన్నును టన్ను క్రూడాయిల్‌పై రూ.3,300కు చేర్చింది. ఫిబ్రవరి 16 నుంచి ఈ కొత్త రేట్లు అమలులోకి వస్తాయని తెలిపింది. రెండు వారాల క్రితం ఇది రూ.3,200 ఉంది. అలాగే తాజాగా డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు సుంకాన్ని లీటరుకు రూ.1.50కు పెంచింది. గతంలో దీనిపై పన్నును పూర్తిగా తొలగించి జీరో చేసింది. ఇదీ చదవండి: ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన ప్రముఖ కంపెనీ పెట్రోల్, విమానయాన ఇంధనం ఎగుమతులపై సుంకాన్ని జీరో శాతం వద్దే నిలిపిఉంచింది. ఇంధన కంపెనీలు అధికంగా ఆర్జించే లాభాలపై కేంద్రం విండ్‌ఫాల్ టాక్స్ విధింపును 2022 జూలై 1 నుంచి ప్రారంభించింది. ప్రపంచ మార్కెట్లో రెండు వారాల సగటు ఆయిల్ ధరల ఆధారంగా ప్రతి 15 రోజులకోసారి పన్ను రేట్లను సవరిస్తుంది. -
పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ పన్ను పెంపు
దేశీయంగా ఉత్పత్తయ్యే పెట్రోలియం ముడి చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను కేంద్రం పెంచింది. డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయెల్(ఏటీఎఫ్)పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తగ్గించింది. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బుధవారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ పన్నును టన్నుకు రూ.9,050 నుంచి రూ.9,800కి పెంచింది. ఈ ధరలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయెల్(ఏటీఎఫ్)పై లీటరుపై రూ.1గా ఉన్న విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తొలగించినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వం డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ని లీటర్‌కు రూ.4 నుంచి రూ.2కు తగ్గించింది. అయితే కేంద్రం అక్టోబర్ 18న పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ పన్నును టన్నుకు రూ.12,100 నుంచి రూ.9,050కి తగ్గించింది. గత ఏడాది జూలైలో ముడి చమురు ఉత్పత్తిదారులపై విండ్‌ఫాల్ పన్ను విధించింది. గ్యాసోలిన్, డీజిల్, విమానయాన ఇంధనాల ఎగుమతులపై పన్నును పొడిగించింది. -
సామాన్యులపై మరో పిడుగు: ముడిచమురుపై భారీగా టాక్స్ పెంపు
Windfall Tax on Crude oil భారతదేశంలోని చమురు ఉత్పత్తిదారులకు భారీ షాక్ తగిలింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురుపై విండ్‌ఫాల్ టాక్స్‌ను భారీగా పెంచింది. టన్నుకు రూ.6,700 నుంచి రూ.10,000కు కేంద్ర ప్రభుత్వం పెంచింది. సవరించిన ధరలు నేటి (సెప్టెంబర్ 16)నుంచే అమల్లో ఉంటాయి. తాజా నిర్ణయంతో ఇప్పటికే పెట్రో భారంతో అతలాకుతమవుతున్న సామాన్యులపై మరింత భారం పెరగనుంది. ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF)పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (SAED) లీటర్‌కు 4 రూపాయల నుండి 3.50 రూపాయలకు ప్రభుత్వం తగ్గించింది. అలాగే డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను లీటరుకు రూ.6 నుంచి రూ.5.5కు తగ్గిస్తున్నట్లుకేంద్రం ప్రకటించింది. పెట్రోల్ ఎగుమతిపై SAED సున్నాగా కొనసాగుతుంది. గత రెండు వారాల సగటు చమురు ధరల ఆధారంగా ప్రతి పక్షం రోజులకు ఒకసారి పన్ను రేట్లు సమీక్ష ఉంటుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 2న జరిగిన పక్షంవారీ సమీక్షలో ప్రభుత్వం ముడి పెట్రోలియంపై టన్నుకు రూ.7,100 నుంచి రూ.6,700కి తగ్గించింది. భారతదేశంలోని చమురు ఉత్పత్తిదారులపై విండ్‌ఫాల్ పన్నును గత ఏడాది జూలైలో మొదటిసారిగా విధించారు. అలాగే సెప్టెంబర్ 1న ప్రభుత్వం పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను టన్నుకు రూ.7,100 నుంచి రూ.6,700కి తగ్గించిన సంగతి తెలిసిందే.మరోవైపు చమురు ధరలు 10 నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. -
కేంద్రం మరో కీలక నిర్ణయం: విండ్‌ఫాల్ ట్యాక్స్ కట్
దేశీయంగా క్రూడ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను భారీగా తగ్గించింది. అలాగే డీజిల్, ఎటిఎఫ్ ఎగుమతులకు చెక్ పెట్టేలా లెవీనీ కూడా పెంచింది. ముడి చమురు అమ్మకంపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని టన్నుకు రూ.6,700కి తగ్గించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.. ఇది సెప్టెంబర్ 2 నుండి అమలుల్లోఉంటుందని తెలిపింది. క్రూడ్ పెట్రోలియంపై సాడ్ టన్నుకు రూ.7100 నుంచి రూ.6700కి తగ్గుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.ఆగస్టు 14న జరిగిన సమీక్షలో ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై టన్నుకు రూ.7,100గా విండ్ ఫాల్ ట్యాక్స్ విధించింది. ( డయానాతో ప్రమాదంలో మరణించిన డోడి తండ్రి, బిజినెస్ టైకూన్ కన్నుమూత) డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై లెవీ పెంపు మరోవైపు డీజిల్ ఎగుమతిపై SAED లేదా సుంకం లీటరుకు రూ.5.50 నుండి రూ.6కి పెంచింది. జెట్ ఇంధనం లేదా ఏటీఎఫ్‌పై సుంకం లీటరుకు రూ.2 నుంచి రూ.4కు రెట్టింపు అవుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. పెట్రోలియం ఎగుమతులపై సుంకం ఏమీఉండదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యా ఉక్రెయిన్‌పై దాడి తర్వాత ఉత్పత్తి కంపెనీలు భారీ లాభాల నేపథంయలో జూలై 1, 2022 నుండి స్థానికంగా ఉత్పత్తి చేయబడిన ముడి చమురు అమ్మకాలపై కేంద్రం మొదట విండ్‌ఫాల్ పన్నులను విధించింది. అంతేకాకుండా, దేశీయ మార్కెట్‌కు బదులుగా, ప్రైవేట్ రిఫైనర్లు మెరుగైన అంతర్జాతీయ ధరల మధ్య విదేశాల్లో ఎక్కువగా విక్రయిస్తున్నందున పెట్రోల్, డీజిల్ ,జెట్ ఇంధనాల ఎగుమతులపై అదనపు సుంకంవిధించిన సంగతి తెలిసిందే. (వర్క్ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్ అంటున్న ఐటీ దిగ్గజం) -
ముడిచమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపైన, డీజిల్ ఎగుమతులపైన కేంద్రం విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను పెంచింది. దీనితో క్రూడాయిల్‌పై ట్యాక్స్ టన్నుకు రూ. 7,100 మేర పెరిగింది. అలాగే, డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (ఎస్ఏఈడీ) లీటరుకు రూ. 1 చొప్పున కేంద్రం పెంచింది. దీంతో ఇది లీటరుకు రూ. 5.50కి చేరింది. అటు విమాన ఇంధనం (ఏటీఎఫ్)పై కూడా లీటరుకు రూ. 2 చొప్పున సుంకం విధించింది. ఇప్పటి వరకు ఏటీఎఫ్‌పై ఎస్ఏఈడీ లేదు. తాజా మార్పులు ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం తెలిపింది. క్రూడ్ రేట్ల కారణంగా చమురు కంపెనీలు అసాధారణంగా ఆర్జిస్తున్న లాభాలపై కేంద్రం 2022 జూలై 1 నుంచి విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను విధిస్తోంది. -
ఆయిల్ కంపెనీలకు భారీ ఉపశమనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
న్యూఢిల్లీ: డీజిల్, జెట్ ఫ్యూయెల్– ఏటీఎఫ్ ఎగుమతులపై జీరో రేటును కొనసాగిస్తూనే, దేశీయంగా ఉత్పత్తయిన ముడి చమురుపై కూడా ప్రభుత్వం విండ్‌ఫాల్ గెయిన్స్ ట్యాక్స్‌ను పూర్తిగా తొలగించింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) వంటి కంపెనీలు ఉత్పత్తి చేసే ముడి చమురుపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (ఎస్ఏఈడీ) ప్రభుత్వం మంగళవారం నుండి పూర్తిగా తొలగించినట్లు అధికారిక ఉత్తర్వులు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ పన్ను టన్నుకు రూ.4,100గా ఉంది. చమురు ఉత్పత్తిదారులు, ఇంధన ఎగుమతిదారుల భారీ లాభాలపై పన్ను విధించడానికి సంబంధించిన ఈ లెవీని గత ఏడాది జూన్‌లో ప్రవేశపెట్టిన తర్వాత పూర్తిగా తొలగించడం ఇది రెండవసారి. ఏప్రిల్ ప్రారంభంలో పన్నును సున్నాకి తగ్గించారు. అయితే అదే నెల ద్వితీయార్థంలో టన్నుకు రూ. 6,400 విధించడంతో తిరిగి విధించారు. అటు తర్వాత రూ.4,100కి తగ్గించడం జరిగింది. ప్రస్తుతం పన్ను పూర్తగా తీసివేస్తున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్4న డీజిట్ ఎగుమతులపై, మార్చి 4 నుంచి ఏటీఎఫ్ ఎగుమతులపై పూర్తిగా తొలగించిన పన్ను యథాతథంగా కొనసాగుతుందని కూడా తాజా ప్రకటన తెలిపింది. దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై విండ్‌ఫాల్ గెయిన్స్ ట్యాక్స్‌లో కోతకు ప్రధాన కారణం.. అంతర్జాతీయ చమురు ధరలు బ్యారల్‌కు 80 డాలర్ల నుంచి 75 డాలర్లకు తగ్గడమేనని అధికార వర్గాలు వెల్లడించాయి. చదవండి👉 అమ్మకాల్లో దూసుకెళ్తున్న మారుతి వేగన్ - ఆర్! భారీ ఆదాయాలు.. భారత్ 2022 జూలై 1వ తేదీన విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. చమురు ఉత్పత్తిదారులు ప్రతి బ్యారెల్‌కు 75 డాలర్ల కంటే ఎక్కువ ధరను పొందే సందర్భంలో వారు పొందే విండ్‌ఫాల్ లాభాలపై ప్రభుత్వం పన్ను విధింపు దీని లక్ష్యం. తద్వారా అంతర్జాతీయంగా ధరలు పెరుగుదల వల్ల ఇంధన కంపెనీలకు అనూహ్యంగా వచ్చే భారీ లాభాలపై పన్ను విధిస్తున్న పలు దేశాల సరసన చేరింది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఈ పన్ను మదింపు, నిర్ణయం జరుగుతోంది. అటువంటి లెవీ ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర పన్నులకు అదనం. దేశీయ చమురు అన్వేషణకు విఘాతం కలుగుతుందని పేర్కొంటూ ఈ పన్నును రద్దు చేయాలని ఫిక్కీ వంటి పారిశ్రామిక సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ప్రొడక్టుల ఎగుమతులపై విధించిన ఈ ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (ఎస్ఏఈడీ) వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఖజానాకు దాదాపు రూ.40,000 కోట్ల ఆదాయం లభించింది. దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ ద్వారా 2023–24లో దాదాపు రూ.15,000 కోట్ల ఆదాయం వస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? -
మళ్లీ ‘విండ్‌ఫాల్’ బాదుడు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను ప్రభుత్వం తిరిగి విధించింది. తాజా ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం... ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) వంటి కంపెనీలు ఉత్పత్తి చేసే ముడి చమురుపై టన్నుకు రూ.6,400 విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను విధించడం జరిగింది. బుధవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఏప్రిల్ 4న జరిగిన గత చివరి సమీక్షలో దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై విండ్‌ఫాల్ పన్నును పూర్తిగా (జీరో స్థాయి) తొలగించడం జరిగింది. అంతర్జాతీయ చమురు ధరలు బ్యారెల్‌కు 75 డాలర్లకంటే తక్కువకు పడిపోవడం దీని నేపథ్యం. అయితే ఉత్పత్తిదారుల ఒపెక్ గ్రూప్, రష్యా వంటి దాని మిత్రపక్షాలు అనూహ్యంగా ప్రకటించిన ఉత్పత్తి ‘కోత’ నిర్ణయంతో చమురు ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. దీనితో తిరిగి విండ్‌ఫాల్ ట్యాక్స్ విధిస్తూ, ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై జీరో.. కాగా, డీజిల్ ఎగుమతిపై విధించే లెవీని మాత్రం పూర్తిగా తొలగించింది. ఇప్పటి వరకూ లీటర్‌కు ఈ పన్ను 0.50గా అమలవుతోంది. విమాన ఇంధనం ఏటీఎఫ్ ఎగుమతులపై కూడా జీరో పన్ను విధానం కొనసాగుతోంది. భారత్ 2022 జూలై 1వ తేదీన విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. చమురు ఉత్పత్తిదారులు ప్రతి బ్యారెల్‌కు 75 డాలర్ల కంటే ఎక్కువ ధరను పొందే సందర్భంలో వారు పొందే విండ్‌ఫాల్ లాభాలపై ప్రభుత్వం పన్ను విధింపు దీని లక్ష్యం. తద్వారా అంతర్జాతీయంగా ధరలు పెరుగుదల వల్ల ఇంధన కంపెనీలకు అనూహ్యంగా వచ్చే భారీ లాభాలపై పన్ను విధిస్తున్న పలు దేశాల సరసన చేరింది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఈ పన్ను మదింపు, నిర్ణయం జరుగుతోంది. అటువంటి లెవీ ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర పన్నులకు అదనం. దేశీయ చమురు అన్వేషణకు విఘాతం కలుగుతుందని పేర్కొంటూ ఈ పన్నును రద్దు చేయాలని ఫిక్కీ వంటి పారిశ్రామిక సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ప్రొడక్టుల ఎగుమతులపై విధించిన ఈ ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (ఎస్ఏఈడీ) వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఖజానాకు దాదాపు రూ.40,000 కోట్ల ఆదాయం లభించింది. దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ ద్వారా 2023–24లో దాదాపు రూ.15,000 కోట్ల ఆదాయం వస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. -
ముడి చమురు ఉత్పత్తిపై ఇక జీరో విండ్‌ఫాల్ ట్యాక్స్
భారత ప్రభుత్వం ముడి చమురు ఉత్పత్తిపై విండ్‌ఫాల్ పన్నును పూర్తిగా తొలగించింది. టన్నుకు రూ. 3,500 (42.56 డాలర్లు) ఉన్న పన్నును సున్నాకు తగ్గించింది. అంటే దేశీయ ముడి చమురు ఉత్పత్తిపై ఎలాంటి విండ్‌ఫాల్ పన్ను ఉండదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. (వామ్మో రూ. 35 వేల కోట్లా.. బ్యాంకులు ఏం చేశాయో తెలుసా?) అలాగే డీజిల్‌పై గతంలో ఉన్న విండ్‌ఫాల్ పన్నును ప్రభుత్వం లీటరుకు రూపాయి నుంచి 50 పైసలకు తగ్గించింది. ఇక పెట్రోలియం, ఏటీఎఫ్‌పై ఎలాంటి విండ్‌ఫాల్ పన్ను లేదు. విండ్‌ఫాల్ టాక్స్ అనేది కొన్ని పరిశ్రమలు తమ సగటు ఆదాయం కంటే ఎక్కువ ఆర్జించినప్పుడు విధించే పన్ను. ఒక పరిశ్రమ ఊహించని విధంగా భారీ లాభాలను ఆర్జించినప్పుడు ప్రభుత్వానికి ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అధిక ఇంధన ధరలు చమురు ఉత్పత్తిదారులకు అధిక లాభాలను తెచ్చిపెట్టడంతో గత ఏడాది జూలైలో ప్రభుత్వం ఈ పన్నును ప్రవేశపెట్టింది. (పిట్ట పోయి కుక్క వచ్చె.. ట్విటర్ లోగోను మార్చిన మస్క్!) అప్పటి నుంచి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా 2022 జూలైలో ముడి చమురుపై విండ్‌ఫాల్ పన్నులు టన్నుకు రూ. 23,250 నుంచి 2023 మార్చి 21 నాటికి టన్నుకు రూ. 3,500కి తగ్గాయి. ఇటీవల పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి (ఒపెక్) ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ చర్య కారణంగా ఏప్రిల్ 3న బ్రెంట్ ధర దాదాపు 6 శాతం పెరిగి బ్యారెల్‌కు 84.58 డాలర్లకు చేరుకుంది. -
ప్రభుత్వానికి వేదాంత షాక్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గుంప గుత్త లాభాల పన్ను (విండ్‌ఫాల్ ట్యాక్స్)కు నిరసనగా వేదాంత లిమిటెడ్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తన గ్యాస్ క్షేత్రాల నుంచి ఆర్జించిన లాభంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 91 మిలియన్ డాలర్ల వాటాని (సుమారు రూ.773 కోట్లు) నిలిపివేసింది. జనవరి 31, ఫిబ్రవరి 20వ తేదీల్లో పెట్రోలియం, సహజవాయువు శాఖకు ఈ విషయమై వేదాంత సమాచారం కూడా ఇచ్చింది. స్థానికంగా (దేశీయంగా) ఉత్పత్తి అయ్యే చమురుపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఏఈడీ)ని కేంద్రం విధించింది. ఆరంభంలో టన్నుపై రూ.23,250 ప్రకటించగా (అంటే బ్యారెల్ చమురుపై 40 డాలర్లు).. ఆ తర్వాత టన్నుకు రూ.3,500కు తగ్గించింది. ఇది కాకుండా ఉత్పత్తి దారులు చమురు, గ్యాస్ రేటుపై ఆర్జించిన మొత్తంపైనా 10–20 శాతం రాయల్టీని చెల్లించాల్సి ఉంటుంది. వీటితోపాటు ఆదాయం నుంచి ఖర్చులను తీసివేసిన తర్వాత మిగిలిన లాభంలో ముందుగా నిర్ణయించిన మేరకు ప్రభుత్వం వాటా తీసుకోవచ్చు. ఇన్ని రకాలుగా ఉత్పత్తిదారులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వేదాంత రాజస్థాన్‌లోని బ్లాక్ ఉత్పత్తిపై ఈ ప్రత్యేక అదనపు ఎక్సైడ్ డ్యూటీ (ఎస్ఏఈడీ) చెల్లించేందుకు గాను 85.35 మిలియన్ డాలర్లు, కాంబే బేసిన్లో సీబీ–ఓఎస్/2 బ్లాక్‌కు సంబంధించి ఎస్ఏఈడీ కోసం 5.50 మిలియన్ డాలర్లను నిలిపివేసినట్టు పెట్రోలియం శాఖకు స్పష్టం చేసింది. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆర్థిక ప్రయోజనాలను పునరుద్ధరించేందుకే ఈ చర్య చేపట్టినట్టు వివరించింది. కేంద్రం విధించిన ఎస్ఏఈడీ, కాంట్రాక్టు ఒప్పందాలకు విరుద్ధమన్నది వేదాంత వాదనగా ఉంది. -
డీజిల్ ఎగుమతిపై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు
న్యూఢిల్లీ: డీజిల్ ఎగుమతిపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను లీటరుకు రూపాయి పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే దేశీయంగా ఉత్పత్తయిన ముడి చమురుపై పన్నును ఐదో వంతు తగ్గించినట్లు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వుల ప్రకారం చమురు, సహజ వాయువుల సంస్థ (ఓఎన్జీసీ) వంటి కంపెనీలు ఉత్పత్తి చేసే ముడి చమురుపై లెవీ టన్నుకు రూ.4,400 నుంచి రూ.3,500కి తగ్గింది. భారత్ 2022 జూలై 1వ తేదీన విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా అంతర్జాతీయంగా ధరలు పెరుగుదల వల్ల ఇంధన కంపెనీలకు అనూహ్యంగా వచ్చే భారీ లాభాలపై పన్ను విధిస్తున్న పలు దేశాల సరసన చేరింది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఈ పన్ను మదింపు, నిర్ణయం జరుగుతోంది. అటువంటి లెవీ ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర పన్నులకు అదనం. దేశీయ చమురు అన్వేషణకు విఘాతం కలుగుతుందని పేర్కొంటూ ఈ పన్నును రద్దు చేయాలని ఫిక్కీ వంటి పారిశ్రామిక సంస్థలు తమ ప్రీ–బడ్జెట్ మెమోరాండంలో ప్రభుత్వాన్ని కోరాయి. -
రూ.1.50 లక్షల కోట్ల జీఎస్టీ ఇక సాధారణం
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నెలవారీ జీఎస్టీ వసూళ్లు సగటున రూ.1.5 లక్షల కోట్లు అన్నది ఇక మీదట సర్వసాధారణమని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) చీఫ్ వివేక్ జోహ్రి పేర్కొన్నారు. పన్ను ఎగవేతల నిరోధానికి తీసుకున్న సమిష్టి చర్యలు, నూతన వ్యాపార సంస్థలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వసూళ్ల విస్తరణకు తోడ్పడినట్టు చెప్పారు. జీఎస్టీ, కస్టమ్స్ వసూళ్లకు సంబంధించి 2023–24 బడ్జెట్లో ప్రకటించిన గణాంకాలు వాస్తవికంగా ఉన్నట్టు పేర్కొన్నారు. సాధారణ జీడీపీ వృద్ధి, దిగుమతుల ధోరణుల ఆధారంగా వీటిని నిర్ణయించినట్టు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆదాయ లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రకటించారు. జీఎస్టీ ఆదాయం పెంచుకునేందుకు కఠిన ఆడిట్, పన్ను రిటర్నుల మదింపు, నకిలీ బిల్లులు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌పై చర్యలు అనే విధానాన్ని రూపొందించినట్టు చెప్పారు. ‘‘పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచడంపై దృష్టి పెట్టాం. జీఎస్టీ విధానం తీసుకొచ్చినప్పటి నుంచి పన్ను చెల్లింపుదారుల సంఖ్యలో పెరుగుదల మెరుగ్గా ఉన్నప్పటికీ, కొన్ని రంగాల్లో పన్ను చెల్లింపుదారుల సంఖ్య మరింత పెరిగేందుకు మెరుగైన అవకాశాలున్నాయి. కనుక జీఎస్టీ ఆదాయం విషయంలో మేమింకా సంతృప్త స్థాయికి చేరుకోలేదు. ఆదాయం పెంచుకునే అవకాశాలున్నాయి’’ అని చెప్పారు. జీఎస్టీ వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున నెలవారీగా రూ.1.45 లక్షల కోట్లు ఉండడం గమనార్హం. 2023 జనవరికి రూ.1.56 లక్షల కోట్లు వసూలైంది. జీఎస్టీ చరిత్రలో 2022 ఏప్రిల్‌లో వచ్చిన రూ.1.68 లక్షల కోట్ల తర్వాత నెలవారీగా అత్యధిక ఆదాయం రికార్డు ఇదే కావడం గమనించొచ్చు. 2022–23 సంవత్సరానికి జీఎస్టీ ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.9.56 లక్షల కోట్లుగా ఉంటుందని బడ్జెట్లో భాగంగా మంత్రి సీతారామన్ ప్రకటించారు. విండ్‌ఫాల్ ట్యాక్స్ ద్వారా 25,000 కోట్ల ఆదాయం: కేంద్రం విండ్‌ఫాల్ ప్రాఫిట్ టాక్స్ ద్వారా మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 25,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు. అంతర్జాతీయ చమురు ధరలు మళ్లీ పెరిగినందున పన్ను ప్రస్తుతానికి కొనసాగుతుందని సీబీఐసీ చైర్మన్ వివేక్ జోహ్రీ మరో ప్రకటనలో స్పష్టం చేశారు. భారతదేశం 2022 జూలై 1వ తేదీన విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా అంతర్జాతీయంగా ధరలు పెరుగుదల వల్ల ఇంధన కంపెనీలకు అనూహ్యంగా వచ్చే భారీ లాభాలపై పన్ను విధిస్తున్న పలు దేశాల సరసన చేరింది. తొలుత దేశీయ ముడి చమురు ఉత్పత్తిపై టన్నుకు రూ.23,250 (బ్యారెల్‌కు 40 డాలర్లు) విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధింపు జరిగింది. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై కూడా కొత్త పన్ను అమలు జరుగుతోంది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఈ పన్ను మదింపు, నిర్ణయం జరుగుతోంది. అటువంటి లెవీ ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర పన్నులకు అదనం. చమురు అన్వేషణ, ఉత్పత్తికి ఈ పన్ను విఘాతమని పేర్కొంటూ, దీనిని తక్షణం తొలగించలని పారిశ్రామిక వేదిక – ఫిక్కీ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం క్రూడాయిల్, డీజిల్ వంటి వాటిపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం దేశీయంగా ఉత్పత్తి చేసే క్రూడాయిల్‌పై ఈ పన్ను టన్నుకు రూ. 1,900 నుంచి రూ. 5,050కి పెరిగింది. అలాగే డీజిల్ ఎగుమతులపై లీటరుకు రూ. 5 నుంచి రూ. 7.50కి కేంద్రం ట్యాక్స్‌ను పెంచింది. ఇక విమాన ఇంధన (ఏటీఎఫ్) ఎగుమతులపై పన్నును లీటరుకు రూ. 3.5 నుంచి రూ. 6కి పెంచింది. ఈ కొత్త రేట్లు ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి వచ్చాయి. క్రూడాయిల్ అధిక రేట్లలో ట్రేడవుతున్నప్పుడు ఆయిల్ కంపెనీలకు ఆకస్మికంగా వచ్చే భారీ లాభాలపై విధించే పన్నును విండ్‌ఫాల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందుకోసం ముడిచమురు బ్యారెల్ రేటు పరిమితిని 75 డాలర్లుగా నిర్ణయించారు. ఇతర దేశాల బాటలోనే, భారత్ గతేడాది జూలై 1న దీన్ని తొలిసారిగా విధించింది. క్రితం రెండు వారాల్లో ఆయిల్ సగటు ధరల ప్రకారం ప్రతి పక్షం రోజులకోసారి ఈ ట్యాక్స్ రేట్లను సమీక్షిస్తుంది. -
విండ్‌ఫాల్ ట్యాక్స్ రద్దు చేయండి
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ టాక్స్‌ను 2023–24 వార్షిక బడ్జెట్లో రద్దు చేయాలని కేంద్రానికి పరిశ్రమల వేదిక– ఫిక్కీ తన ప్రీ–బడ్జెట్ కోర్కెల మెమోరాండంలో విజ్ఞప్తి చేసింది. ఈ పన్ను విధింపు చమురు, గ్యాస్ అన్వేషణకు సంబంధించిన పెట్టుబడులకు ప్రతికూలమని తన సిఫారసుల్లో పేర్కొంది. భారతదేశం 2022 జూలై 1వ తేదీన విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా అంతర్జాతీయంగా ధరల పెరుగుదల వల్ల ఇంధన కంపెనీలకు అనూహ్యంగా వచ్చే భారీ లాభాలపై పన్ను విధిస్తున్న పలు దేశాల సరసన చేరింది. తొలుత దేశీయ ముడిచమురు ఉత్పత్తిపై టన్నుకు రూ.23,250 (బ్యారెల్‌కు 40 డాలర్లు) విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధింపు జరిగింది. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై కూడా కొత్త పన్ను అమలు జరుగుతోంది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఈ పన్ను మదింపు, నిర్ణయం జరుగుతోంది. అటువంటి లెవీ ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర పన్నులకు అదనం. ఇంధన రంగానికి సంబంధించి ఫిక్కీ తాజా నివేదికలో ముఖ్యాంశాలు.. ► పెట్రోలియం క్రూడ్‌పై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఏఈడీ)ని కూడా రద్దు చేయాలి. లేదా అసాధారణ చర్యగా కొంత కాలం లెవీని కొనసాగించాల్సిన అవసరం ఉన్నట్లయితే, ఆ రేటును యాడ్–వాల్రెమ్ లెవీగా మార్చాలి. ఇది 100 డాలర్లపైన పెరిగే క్రూడ్ ధరలో 20 శాతంగా ఉండాలి. ► రాయల్టీ (ఆన్‌షోర్ ఫీల్డ్‌లకు చమురు ధరలో 20%, ఆఫ్‌షోర్ ప్రాంతాలకు 10%) అలాగే చమురు పరిశ్రమ అభివృద్ధి (ఓఐడీ) సెస్ (చమురు ధరలో 20%) ఇప్పటికే భారం అనుకుంటే, విండ్‌ఫాల్ పన్ను ఈ భారాన్ని మరింత పెంచుతోంది. ► విండ్‌ఫాల్ టాక్స్ వాస్తవ ధరపై కాకుండా, టన్ను ఉత్పత్తిపై మదింపు జరుగుతోంది. దీనివల్ల ధరలు తగ్గినప్పుడు ఉత్పత్తిదారులను దెబ్బతీస్తోంది. ప్రపంచ ప్రమాణాలు పాటించాలి.. ప్రస్తుతం దేశీయ ముడి చమురు ఉత్పత్తిదారులపై దాదాపు 70% పన్ను విధిస్తున్నారు. ప్రపంచ ప్రమాణాల ప్రకారం, 35–40% పన్ను మాత్రమే విధించాలి. ఈ రంగంలో కీలక పెట్టుబడులకు ఇది పన్ను దోహదపడుతుంది. ఇంధన రంగానికి మద్దతు ఇవ్వడానికి, అస్థిర ప్రపంచ ముడి మార్కెట్ల నుండి దేశాన్ని రక్షించడానికి కీలకమైన విధాన సంస్కరణలు తెచ్చేందుకు ఈ బడ్జెట్ మంచి అవకాశం. – సునీల్ దుగ్గల్, వేదాంత గ్రూప్ సీఈఓ -
విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురుతోపాటు, ఎగుమతి చేసే డీజిల్, విమానయాన ఇంధనం (ఏటీఎఫ్)పై విండ్‌ఫాల్ ప్రాఫిట్ (గుంపగుత్త లాభాలు) పన్నును కేంద్ర సర్కారు తగ్గించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మరింత దిగిరావడంతో అందుకు అనుగుణంగా పన్నులను తగ్గించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా తదితర సంస్థలు దేశీయంగా ఉత్పత్తి చేసే టన్ను ముడి చమురుపై రూ.2,100గా ఉన్న విండ్‌ఫాల్ ప్రాఫిట్ పన్ను రూ.1,900కు తగ్గింది. ఎగుమతి చేసే ప్రతి లీటర్ డీజిల్‌పై రూ.6.5గా ఉన్న పన్ను రూ.5కు తగ్గింది. ఏటీఎఫ్ లీటర్‌పై రూ. 4.5 నుంచి రూ.3.5కు తగ్గింది. కొత్త పన్ను రేట్లు ఈ నెల 17 నుంచి అమల్లోకి వచ్చాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం అనంతరం అంతర్జాతీయ మార్కెట్లో గతేడాది చమురు ధరలు భారీగా పెరిగిపోవడం తెలిసిందే. దీనివల్ల దేశీయంగా చమురు ఉత్పత్తి చేసే కంపెనీలకు అనూహ్య లాభాలు వచ్చిపడ్డాయి. ఇలా గుంపగుత్తగా వచ్చిన లాభాల నుంచి కొంత మొత్తాన్ని ప్రభుత్వం తీసుకునేందుకు విండ్‌ఫాల్ ప్రాఫిట్ పన్నును 2022 జూలై నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. నిజానికి జనవరి 3నాటి సమీక్షలో విండ్‌ఫాల్ ప్రాఫిట్ పన్నును కేంద్రం పెంచింది. అప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడంతో ఆ మేరకు తాజాగా ఉపశమనం కల్పించింది. అంతర్జాతీయ పరిణామాలు.. అంతర్జాతీయంగా చాలా దేశాలు విండ్‌ఫాల్ లాభా ల పన్నును అమల్లోకి తీసుకురావడం గమనార్హం. ఆరంభంలో కేంద్ర సర్కారు లీటర్ పెట్రోల్, ఏటీఎఫ్ ఎగుమతిపై రూ.6 చొప్పు,. లీటర్ డీజిల్ ఎగుమతిపై రూ.13 చొప్పున పన్ను విధించింది. దేశీయ ంగా ఉత్పత్తి చేసే టన్ను ముడి చమురుపై రూ. 23,250 పన్నును అమలు చేసింది. తదుపరి మొద టి సమీక్షలోనే పెట్రోల్‌పై ఈ పన్నును ఎత్తివేసింది. -
ముడిచమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు.. జనవరి 3 నుంచి అమలు
దేశీయంగా ఉత్పత్తయ్యే ముడి చమురు, ఎగుమతి చేసే డీజిల్, ఏటీఎఫ్‌లపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను కేంద్రం పెంచింది. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మంగళవారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం క్రూడాయిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను టన్నుకు రూ. 1,700 నుంచి రూ. 2,100కి పెంచింది. అలాగే ఎగుమతి చేసే డీజిల్‌పై లీటరుకు పన్నును రూ. 5 నుంచి రూ. 6.5కి, విమాన ఇంధనం (ఏటీఎఫ్)పై లీటరుకు రూ. 1.5 నుంచి రూ. 4.5కి పెంచింది. కొత్త ట్యాక్స్ రేట్లు జనవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తదితర సంస్థలు దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఆయిల్ రేట్ల పెరుగుదలతో చమురు కంపెనీలకు ఆకస్మికంగా వచ్చే భారీ లాభాలపై విధిస్తున్న పన్నును విండ్‌ఫాల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఇతర దేశాల బాటలోనే ఈ ఏడాది జూలై 1 నుంచి భారత్ కూడా దీన్ని అమలు చేయడం ప్రారంభించింది. ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు తగ్గడంతో డిసెంబర్ 16న చివరిసారిగా జరిపిన సమీక్షలో ట్యాక్స్ రేటును కొంత తగ్గించింది. పెట్రోల్ ఎగుమతులకు మాత్రం విండ్‌ఫాల్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటోంది. చదవండి: iPhone 14: వావ్ ఐఫోన్ పై మరో క్రేజీ ఆఫర్! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి! -
విండ్‌ఫాల్ టాక్స్ మూడు రెట్లు కోత: ఇక జాలీగా విమానాల్లో!
న్యూఢిల్లీ: కేంద్రం ఆయిల్ రంగ సంస్థలకు భారీ ఊరట కల్పించింది. పక్షం రోజుల సమీక్షలో భాగంగా దేశీయ రిఫైనరీలు, చమురు ఉత్పత్తి లాభాలపై విండ్‌ఫాల్ టాక్స్‌ను భారీగా తగ్గించింది. జెట్ ఇంధనం (ఏటీఎఫ్), డీజిల్ ఎగుమతులపై కూడా విండ్‌ఫాల్ టాక్స్‌ను తగ్గించింది. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురుపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ సెస్ టన్నుకు రూ. 4,900 నుంచి రూ.1,700కు తగ్గించింది. జెట్ ఇంధనం లేదా ఏవియేషన్ టర్బైన్ ఇంధనంపై విధించే విండ్‌ఫాల్ పన్నును మూడు రెట్లు తగ్గించి లీటరుకు రూ. 5 నుండి రూ. 1.5 కు కోత విధించింది. డీజిల్ ఎగుమతిపై సెస్ లీటర్‌కు రూ. 8 నుండి రూ. 5 కు తగ్గించింది. కేంద్రం పెట్రోల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని జీరో శాతం వద్దే ఉంచింది. సవరించిన రేట్లు అన్నీ డిసెంబర్ 16, 2022 నుండి అమల్లో ఉంటాయి. (వావ్..ఇంత తక్కువ ధరలో యాపిల్ ఐఫోన్!) భారతదేశంలో విమానయాన సంస్థ నిర్వహణ ఖర్చులో ఇంధన ఖర్చే 30-40 శాతం దాకా ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజా విండ్‌ఫాల్ టాక్స్ కోత వాటి లాభాల మార్జిన్లను పెంచుతుంది. దీంతో విమాన టిక్కెట్ ఛార్జీలు దిగి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. 2022 నవంబరు నుంచి దాదాపు 15 శాతం గ్లోబల్ క్రూడ్ ధరలు క్షీణిస్తున్న సమయంలో ఈ తగ్గింపు వచ్చింది. కాగా జూలై 1, 2022 నుంచి ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా పెరిగిన కారణంగా చమురు కంపెనీలు పొందిన లాభాలను దృష్టిలో ఉంచుకుని, చమురు ఉత్పత్తిపై, అలాగే గ్యాసోలిన్, డీజిల్ , విమాన ఇంధనాల ఎగుమతులపై విండ్‌ఫాల్ టాక్స్ ప్రారంభించింది. అప్పటి నుంచి దాదాపు రెండు వారాలకు ఒకసారి విండ్ ఫాల్ ట్యాక్స్ ను ప్రభుత్వం సవరిస్తోంది.