కేంద్ర ప్రభుత్వం ముడి చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పన్ను తొలగింపు నిర్ణయిం ఈరోజు నుంచే అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం టన్ను ముడి చమురుపై రూ.1,850 వరకు విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను వసూలు చేస్తున్నారు.
కేంద్రం జులై 19, 2022 నుంచి విండ్‌ఫాల్ పన్నును విధించింది. ఈ ట్యాక్స్ అమల్లోకి వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా తొలగించడం ఇది రెండోసారి. చివరిసారి ఏప్రిల్ 4, 2023న ఈ ట్యాక్స్‌ను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రైవేట్ రిఫైనర్‌లు స్థానికంగా చమురు ఉత్పత్తులను విక్రయించడానికి బదులు అధిక మార్జిన్‌ల కోసం విదేశాల్లోని రిఫైనరీలకు అమ్ముతుంటారు. దాన్ని అరికట్టడానికి ప్రభుత్వం విండ్‌ఫాల్ ట్యాక్స్ విధిస్తుంది. 2022 నుంచి గ్యాసోలిన్, డీజిల్, విమాన ఇంధనాల ఎగుమతులపై పన్నును పొడిగిస్తూ వచ్చారు. ప్రస్తుతం దాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇదీ చదవండి: నాలుగేళ్లుగా ఉన్న ఆంక్షలు ఎత్తివేత!
కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 31న దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై టన్నుకు రూ.2,100గా ఉండే విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను రూ.1,850కి తగ్గించింది. పెట్రోలియం ఉత్పత్తులపై రూ.2,400గా ఉన్న లెవీని రూ.2,100కి చేర్చింది. ప్రభుత్వం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఈ పన్నుకు సంబంధించి సమీక్ష నిర్వహిస్తోంది. గ్లోబల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర ఏప్రిల్‌లో బ్యారెల్‌కు 92 యూఎస్ డాలర్లుగా ఉండేది. ప్రస్తుతం అది 75 డాలర్లకు పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment