అంతర్జాతీయ అనిశ్చితి ఉన్నా.. భారత్‌ భేష్‌ | Global economy to weaken in coming year but economists confident of India growth | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ అనిశ్చితి ఉన్నా.. భారత్‌ భేష్‌

Published Sat, Sep 16 2023 3:59 AM | Last Updated on Sat, Sep 16 2023 3:59 AM

Global economy to weaken in coming year but economists confident of India growth - Sakshi

న్యూఢిల్లీ: రాజకీయ, ఆర్థిక అస్థిరతల మధ్య వచ్చే సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని చాలా మంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే 90 శాతం కంటే ఎక్కువ మంది దక్షిణాసియా, ముఖ్యంగా భారతదేశంలో మధ్య తరహా లేదా బలమైన వృద్ధి నమోదవుతుందని విశ్వసిస్తున్నారు. ఈ మేరకు తమ అధ్యయనంలో అభిప్రాయాలు వ్యక్తం అయినట్లు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ తాజా ‘చీఫ్‌ ఎకనమిస్ట్‌ ఔట్‌లుక్‌’ నివేదిక పేర్కొంది. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..

► దేశ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో తీవ్ర ప్రతికూలతల నేపథ్యంలో చైనా అవుట్‌లుక్‌ మసకబారింది.  
► ప్రపంచం రాజకీయ, ఆర్థిక అస్థిరతతో పోరాడుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి నిర్దేశిస్తున్న సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (ఎస్‌డీజీ) చేరుకోవడంలో పురోగతి బలహీనంగా ఉంటుందని  దాదాపు 10 మందిలో ఆరుగురు విశ్వస్తున్నారు.  
► ప్రత్యేకించి ఆహార భద్రత, వాతావరణ పరిరక్షణ,  జీవవైవిధ్య పరిరక్షణతో సహా ఎస్‌డీజీకి సంబంధించి పలు లక్ష్యాల్లో  మందగమనం ఉంటుంది. 2030లో అర బిలియన్‌ కంటే ఎక్కువ మంది ప్రజలు  తీవ్ర పేదరికంలో జీవిస్తారు.  
► ఇటీవల అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినప్పటికీ కఠిన ఫైనాన్షియల్‌ పరిస్థితులు కొనసాగుతాయని మెజారిటీ (86 శాతం) అంచనా.  ఆయా అంశాల నేపథ్యంలో వ్యాపార రుణాలపై ఒత్తిడి, కార్పొరేట్‌ రుణ ఎగవేతలలో పెరుగుదల, ఆస్తి–ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర దిద్దుబాట్లు తప్పదు.  
► 74 శాతం మంది భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరికొన్ని సంవత్సరాలు తప్పదని భావిస్తున్నారు.  
► అమెరికాలో మే నుండి అవుట్‌లుక్‌ బలపడింది. ప్రతి 10 మందిలో ఎనిమిది మంది 2023, 2024 అమెరికా  ఒక మోస్తరు లేదా లేదా బలమైన వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నారు.  
► యూరోప్‌ విషయంలో ఎకానమీ బలహీనం లేదా మరీ బలహీన పరిస్థితులు ఈ ఏడాది ఉంటాయని 77 శాతం మంది భావిస్తున్నారు. 2024లో పరిస్థితులు కొంత మెరుగుపడవచ్చని అంచనా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement