Strong decision
-
అంతర్జాతీయ అనిశ్చితి ఉన్నా.. భారత్ భేష్
న్యూఢిల్లీ: రాజకీయ, ఆర్థిక అస్థిరతల మధ్య వచ్చే సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని చాలా మంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే 90 శాతం కంటే ఎక్కువ మంది దక్షిణాసియా, ముఖ్యంగా భారతదేశంలో మధ్య తరహా లేదా బలమైన వృద్ధి నమోదవుతుందని విశ్వసిస్తున్నారు. ఈ మేరకు తమ అధ్యయనంలో అభిప్రాయాలు వ్యక్తం అయినట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తాజా ‘చీఫ్ ఎకనమిస్ట్ ఔట్లుక్’ నివేదిక పేర్కొంది. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో తీవ్ర ప్రతికూలతల నేపథ్యంలో చైనా అవుట్‌లుక్ మసకబారింది. ► ప్రపంచం రాజకీయ, ఆర్థిక అస్థిరతతో పోరాడుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి నిర్దేశిస్తున్న సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) చేరుకోవడంలో పురోగతి బలహీనంగా ఉంటుందని దాదాపు 10 మందిలో ఆరుగురు విశ్వస్తున్నారు. ► ప్రత్యేకించి ఆహార భద్రత, వాతావరణ పరిరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణతో సహా ఎస్డీజీకి సంబంధించి పలు లక్ష్యాల్లో మందగమనం ఉంటుంది. 2030లో అర బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు తీవ్ర పేదరికంలో జీవిస్తారు. ► ఇటీవల అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినప్పటికీ కఠిన ఫైనాన్షియల్ పరిస్థితులు కొనసాగుతాయని మెజారిటీ (86 శాతం) అంచనా. ఆయా అంశాల నేపథ్యంలో వ్యాపార రుణాలపై ఒత్తిడి, కార్పొరేట్ రుణ ఎగవేతలలో పెరుగుదల, ఆస్తి–ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర దిద్దుబాట్లు తప్పదు. ► 74 శాతం మంది భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరికొన్ని సంవత్సరాలు తప్పదని భావిస్తున్నారు. ► అమెరికాలో మే నుండి అవుట్‌లుక్ బలపడింది. ప్రతి 10 మందిలో ఎనిమిది మంది 2023, 2024 అమెరికా ఒక మోస్తరు లేదా లేదా బలమైన వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నారు. ► యూరోప్ విషయంలో ఎకానమీ బలహీనం లేదా మరీ బలహీన పరిస్థితులు ఈ ఏడాది ఉంటాయని 77 శాతం మంది భావిస్తున్నారు. 2024లో పరిస్థితులు కొంత మెరుగుపడవచ్చని అంచనా. -
కొత్త సంవత్సరంలో బలమైన నిర్ణయం
‘‘ఈ ఏడాది నూతన దర్శకులతో సినిమాలు చేయాలనుకుంటున్నా. అలాగే ‘చమేలీ’, ‘దేవ్’లాంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాలనుకుంటున్నా. నాకు జోయా అక్తర్ సినిమాలంటే ఇష్టం. ఆమె దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఉంది. ఈ మధ్యకాలంలో హిందీలో విడుదలైన సినిమాలేవీ నేను చూడలేదు. అవన్నీ వరస పెట్టి చూడాలనుకుంటున్నా’’ అని కరీనా కపూర్ చెప్పారు. కొత్త సంవత్సరం సందర్భంగా కరీనా తీసుకున్న నిర్ణయాలివి. అలాగే, మరో బలమైన నిర్ణయం కూడా తీసుకున్నారామె. అదేంటంటే, ఇప్పటివరకు యాభై చిత్రాలకు పైగా చేసినా, కరీనా పూర్తి స్క్రిప్ట్ చదవలేదట. జస్ట్ అలా అలా పైపైన చదివేసేదాన్నని కరీనా పేర్కొన్నారు. అందుకే, ఇక నుంచి ప్రతి పేజీ చదివిన తర్వాతే ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నారామె. కొత్త సంవత్సరం సందర్భంగా నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే కాదు... ఎక్కడ జరుపుకోవాలో కూడా నిర్ణయించేసుకున్నారు కరీనా. ఈ బ్యూటీకి స్విట్జర్లాండ్ అంటే చాలా ఇష్టం. ఈసారి స్విస్‌లోనే తన భర్త సైఫ్‌తో కలిసి న్యూ ఇయర్‌ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. స్విస్‌లోని స్టాడ్ అనే ప్లేస్ అంటే ఈ జంటకు చాలా ఇష్టం. స్టాడ్లో ప్రతి ఏడాదీ ఒకే హోటల్లో, ఒకే నంబర్ గదిలో ఈ జంట బస చేస్తుంటారు. ఈసారి కూడా అలానే చేయబోతున్నారు. భవిష్యత్తులో స్టాడ్లో ఓ ఇల్లు కూడా కొనుక్కోవాలనుకుంటున్నారు. కరీనాకు కొత్త సంవత్సరంలో ఓ కొత్త కాంట్రాక్ట్ దక్కింది. అత్యధిక పారితోషికంతో ఓ పాకిస్తానీ వాణిజ్య ప్రకటన కాంట్రాక్ట్ ఆమెను వరించింది. పాకిస్థాన్‌లో అత్యధికంగా అమ్ముడుపోయే క్యూ మొబైల్ ఫోన్‌కు ప్రచారకర్తగా కరీనా వ్యవహరించనున్నారు. ఈ విధంగా కరీనా పాపులార్టీ దేశం దాటి పక్క దేశాలకు కూడా వ్యాపించడం సైఫ్ అలీఖాన్‌కు ఎంతో సంబరాన్ని కలిగిస్తోంది.