weak
-
ఆస్టియోపోరోసిస్: 40 ఏళ్లు దాటాక.. ఈ జాగ్రత్తలు తప్పవు లేదంటే రిస్కే!
మామూలుగానే భారతీయుల్లో ఆస్టియో పోరోసిస్ కేసులు ఎక్కువ. ఇక మహిళల్లో ఈ రుగ్మత ముప్పు మరింత ఎక్కువ. యాభై ఏళ్లు దాటాక మహిళల్లో దాదాపు 40% నుంచి 50% మందిలో ఆస్టియోపోరోసిస్ కనిపించడం చాలా సాధారణంగా జరిగేదే. అలాగే మెనోపాజ్ దాటిన మహిళల్లో కనీసం 40% మందిలో ఇది కనిపిస్తుందంటే దీని విస్తృతి అర్థం చేసుకోవచ్చు. ఇక ఆస్టియోపోరోసిస్ వచ్చిన మహిళల్లో మూడింట ఒక వంతు మందికి ఏదో ఒక దశలో తుంటి ఎముక ఫ్రాక్చర్ కేసులు తప్పక కనిపిస్తాయి. వారికి ముప్పుగా పరిణమిస్తూ, వారిలో ఇంత విస్తృతంగా కనిపించే ఆస్టియోపోరోసిస్ గురించి తెలుసుకుందాం. మానవులందరిలోనూ 20 ఏళ్లు వచ్చే వరకు ఎముకల పెరుగుదల సంభవిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత ఆగిపోతుంది. కానీ దాదాపు 40 ఏళ్లు వచ్చేవరకు ఇవి బలంగానే ఉంటూ, ఆ తర్వాత క్రమంగా తమ బలాన్ని కోల్పోతూ పెళుసుగా మారి΄ోతుంటాయి. కానీ మహిళల్లో మాత్రం వాళ్ల ఓవరీల నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్– ఈస్ట్రోజెన్ తగ్గడం మొదలుకాగానే ఎముకలు బలహీనం కావడం ప్రారంభమవుతుంది. ఇక రుతుక్రమం ఆగిపోయాక ఈస్ట్రోజెన్ ఉత్పత్తి కూడా తగ్గిపోవడంతో ఈ అంశమే వాళ్లలో ఎముకలు బలహీనంగా, పెళుసుగా మారిపోయి, తేలిగ్గా విరిగిపోయే కండిషన్ అయిన ఆస్టియోపోరోసిస్‌కు కారణమవుతుంది. మహిళల్లోనూ ఈ ముప్పు ఎవరెవరిలో... వయసు పెరుగుతున్న కొద్దీ ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు అందరికీ ఉన్నప్పటికీ, కొందరిలో మాత్రం ఈ రిస్క్ మరీ ఎక్కువ పోషకాహార లోపాలున్నవారికి... మన దేశంలో మహిళలు పాలు, విటమిన్ డి ఉన్న పదార్థాలు తీసుకోవడం చాలా తక్కువ. అన్ని పోషకాలూ ఉన్న ఆహారాలు తీసుకోవడమూ వాళ్లలో తక్కువే. కాబట్టి మహిళల్లో ఈ రిస్క్ మరింత ఎక్కువ రుతుక్రమం ఆగిన మహిళల్లోనూ, గర్భసంచితో పాటు ఒకటి లేదా రెండు ఓవరీస్ తీయించుకున్న వాళ్లల్లో. చాలాకాలం పాటు స్టెరాయిడ్స్ వాడేవారిలో వ్యాయామం చేయని వారిలో (మన దేశంలో మహిళల్లో వ్యాయామం చాలా తక్కువ) పొగతాగే అలవాటు ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి స్మోకింగ్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరే టమద్యం తీసుకోవడం వల్ల శరీర కణాల (ప్రధానంగా ఎముక కణాల) అభివృద్ధి, పెరుగుదల ప్రభావితం అవుతాయి. ఫలితంగా మద్యం అలవాటు ఉన్నవాళ్లలో ఆస్టియోపోరోసిస్ రిస్క్ పెరుగుతుంది టకుటుంబ చరిత్ర... కుటుంబంలో ఎవరికైనా ఆస్టియో పోరోసిస్ ఉంటే ఆ కుటుంబ సభ్యులకు దీని రిస్క్ ఎక్కువ. ఆస్టియోపోరోసిస్ – నిర్ధారణ...రక్తపరీక్ష, ఎక్స్–రే, బీఎమ్‌డీ (బోన్ మాస్, డెన్సిటీ – అంటే ఎముక సాంద్రత నిర్ధారణ చేసే పరీక్షల ద్వారా రోగిలో దీన్ని నిర్ధారణ చేయవచ్చు)చికిత్స ఇలా...ప్రాథమిక నివారణ చర్యలు ఆస్టియోపోరోసిస్ కండిషన్‌ను ఆలస్యం చేస్తాయి. ఫలితంగా వయసు రిస్క్ తగ్గుతుంది. క్యాల్షియమ్, విటమిన్ ‘డి’...డాక్టర్లు ప్రాథమిక చికిత్సగా క్యాల్షియమ్, విటమిన్ ‘డి’ ఇస్తారు. అంటే... 60 ఏళ్లు దాటిన వారికి ప్రతిరోజూ 1500 ఎంజీ క్యాల్షియమ్నూ, విటమిన్–డిని రోజూ 10 నుంచి 15 ఎంజీ ఇస్తారు. బిస్ఫాస్ఫోనేట్స్...ఇవి ఒక రకం మందులు. వీటినే బిస్ఫాస్ఫోనేట్స్ అని కూడా అంటారు. ఎముక తనలోని పదార్థాన్ని కోల్పోయే ప్రక్రియను ఇవి ఆలస్యం చేస్తాయి. ఫలితంగా ఎముక సాంద్రత తగ్గే వేగం మందగిస్తుంది. దానివల్ల ఎముక మరింత కాలం దృఢంగా ఉంటుంది. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ రుతుక్రమం ఆగిన మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను తిరిగి భర్తీ చేసే ఈ చికిత్స ప్రక్రియను కూడా అవసరాన్ని బట్టి డాక్టర్లు చేస్తుంటారు. అయితే ఈ హెచ్ఆర్టీ వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా కనిపిస్తాయి. అంటే... రొమ్ముల సలపరం, మళ్లీ రుతుస్రావం మొదలుకావడం, బరువు పెరగడం, మూడ్స్ మాటిమాటికీ మారి΄ోవడం, మైగ్రేన్ తలనొప్పి రావడం వంటివన్నమాట. కాబట్టి రోగి కండిషన్ ను బట్టి హెచ్ఆర్టీ అవసరమా కాదా అన్నది డాక్టర్లే నిర్ధారిస్తారు. క్యాల్సిటోనిన్: ఈ మందులు ముక్కు ద్వారా పీల్చే మందుగా లభిస్తాయి. అయితే ఇవి తప్పనిసరిగా డాక్టర్ల సలహా మేరకే తీసుకోవాల్సి ఉంటుంది. టెరీపారటైడ్: ఇది ఆస్టియోపోరోసిస్ చికిత్స ప్రక్రియలో ఇది కూడా ఒక మందు. ఇది ఎముకలో పెళుసుబారిన చోట కొత్త కణజాలం ఉత్పత్తి అయ్యేలా దోహదపడుతుంది. ఫలితంగా ఎముక ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి. ఈ మందును కడుపు ప్రాంతంలోగాని, తొడల ప్రాంతంలోగాని ఇంజెక్షన్ చేయడం ద్వారా శరీరంలోకి పంపుతారు. దాదాపు ఏడాదిన్నరపాటు ఉపయోగించాల్సి ఉంటుంది. మంచి ప్రభావకారి అయినప్పటికీ ప్రస్తుతం దీని ఖరీదు ఎక్కువ. వికారం (నాసియా), తలనొప్పి, కాళ్లూచేతుల నొప్పి వంటి కొన్ని సైడ్ఎఫెక్ట్స్ కూడా కనిపించే ఈ మందుల దీర్ఘకాల ప్రభావాలు ఇంకా తెలియదు.డోనోసుమాబ్స్: ఇది సరికొత్త మందు. చాలా వేగంగా పనిచేస్తుంది. చవకగా కూడా లభిస్తుంది. తీసుకోవడమూ సులభం.లక్షణాలు... ఎముకలు దేహం లోపల ఉంటాయి కాబట్టి ఆస్టియోపోరోసిస్ వచ్చే సూచనలు ముందే కనిపించేందుకు అవకాశం లేదు. ఇది చాప కింద నీరులా వచ్చే పరిణామం. ఎముకలు పలచబారడం దీర్ఘకాలం జరుగుతూ పోతే చిన్న గాయలకే ఎముకలు విరిగే ముప్పు పెరుగుతుంది. చిన్నపాటి ప్రమాదానికే ఎముక తేలిగ్గా విరిగిపోతుంటే దాన్ని ఆస్టియో పోరోసిస్గా గుర్తించవచ్చు. ఇక సాధారణంగా కనిపించే కొన్ని లక్షణాలు... ఒళ్లు నొప్పులు (జనరలైజ్డ్ బాడీ పెయిన్స్) టఎముకలు, కీళ్ల నొప్పులు (బోన్ అండ్ జాయింట్ పెయిన్స్) అలసట (ఫ్యాటిగ్నెస్)చిన్న ప్రమాదానికే ఎముక విరగడం విపరీతమైన వెన్ను నొప్పి, కాస్తంత వెన్ను ఒంగినట్లయి శరీరం ఎత్తు తగ్గడంసీ, డీ, ఈ, ఎఫ్, జీ, ఎస్.. ఎముకలు వీక్ ఆస్టియోపోరోసిస్ నివారణ కోసం ఉపయోగపడే అంశాలను చాలా తేలిగ్గా గుర్తు పెట్టుకోవచ్చు. ఇంగ్లిష్ అక్షరాలు వరుసగా సీ, డీ, ఈ, ఎఫ్, జీ గుర్తు పెట్టుకుంటే చాలు. ‘సి’ ఫర్ క్యాల్షియమ్– అంటే అది ఎక్కువగా తీసుకోవాలి. ‘డి’ ఫర్ విటమిన్ డి – అంటే శరీరానికి తగినంత అందేలా చూసుకోవాలి. ‘ఈ’ ఫర్ ఎక్సర్సైజ్ – అంటే శరీరాన్ని కాస్తంత శ్రమపెట్టి ఎక్సర్సైజ్ చేయించాలి. ‘ఎఫ్’ ఫర్ ‘ఫాల్స్’ – అంటే ఇంగ్లిష్‌లో పడిపోవడం. కాస్తంత వయసు పైబడ్డాక బాత్రూమ్ల వంటి చోట్ల, ఇతరత్రా కింద పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ‘జి’ ఫర్ గెయిన్ వెయిట్ – అంటే శరీరం బరువు కాస్తంత పెరగాలి. అది ఎత్తుకు తగినట్లుగా ఉండాలి. -
బలహీనంగానే సెంటిమెంట్
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలోనూ బలహీనంగానే కదలాడొచ్చని నిపుణులు భావిస్తున్నారు. పరిమిత శ్రేణిలో తీవ్ర ఒడిదుడుకుల ట్రేడింగ్ ఉండొచ్చంటున్నారు. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన నిర్ణయాలు, ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధ పరిణామాలు, దేశీయ కార్పొరేట్ క్యూ2 ఆరి్థక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి ట్రేడింగ్, క్రూడాయిల్ ధరల కదిలికలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చంటున్నారు. పశి్చమాసియా ఉద్రిక్తతలు, బాండ్లపై రాబడులు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, మిశ్రమ కార్పొరేట్ ఆరి్థక ఫలితాల వెల్లడి తదితర పరిణామాల నేపథ్యంలో క్రితం వారం సూచీలు రెండున్నరశాతం నష్టపోయాయి. ట్రేడింగ్ నాలుగురోజులు జరిగిన గతవారంలో సెన్సెక్స్ 1,615 పాయింట్లు, నిఫ్టీ 495 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి. ‘‘వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ఆస్థిరత కొనసాగవచ్చు. ఈ పరిణామం దేశీయ ఈక్విటీ రికవరీని ఆలస్యం చేయోచ్చు. ఇటీవల వరుస విక్రయాలతో నెలకొన్న ఓవర్‌సోల్డ్ ట్రెండ్‌తో నిఫ్టీ పతనం తాత్కాలికంగా ఆగింది. నిఫ్టీకి సాంకేతికంగా కీలకమైన మద్దతు 19,250 స్థాయి కోల్పోయింది. తిరిగి ఈ స్థాయిపైకి చేరుకుంటేనే ముందుకు వెళ్లే అవకాశం ఉంది’’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సాంకేతిక నిపుణుడు రూపక్ తెలిపారు. క్యూ2 కార్పొరేట్ ఫలితాలు గత వారాంతంలో ఎన్టీపీసీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, యూపీఎల్‌లు వెల్లడించిన ఆరి్థక ఫలితాలకు స్టాక్ మార్కెట్ ముందుగా స్పందించాల్సి ఉంటుంది. ఇక నిఫ్టీ సూచీలో లిస్టైన టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, సన్ ఫార్మా, హీరో మోటోకార్ప్, టైటాన్, యూపీఎల్, టాటా కన్జూమర్ ప్రొడెక్టŠస్, అదానీ ఎంటర్ప్రైజెస్, బ్రిటానియాతో పాటు ఇరు ఎక్సే్చంజీల్లో దాదాపు 700 కంపెనీలు వచ్చే వారం తమ క్యూ2 ఆరి్థక ఫలితాలను వెల్లడించనున్నాయి. గెయిల్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా, మనోజ్ వైభవ్ జెమ్స్, యధార్థ్ హాస్పిటల్స్, గ్లాండ్ ఫార్మా, ఐఓసీ, అంజుజా సిమెంట్స్, టీవీఎస్, ఇండిగో, జొమోటో, డెల్హవరీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, డీఎల్ఎఫ్ తదితర కంపెనీలు ఇందులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్ జరగొచ్చు. ఫలితాల ప్రకటన సందర్భంగా యాజమాన్యం వెల్లడించే అవుట్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం సెపె్టంబర్ ద్రవ్యలోటు, ఎనిమిది కీలక రంగాల వృద్ధి డేటా మంగళవారం(అక్టోబర్ 31న), అక్టోబర్ తయారీ రంగ పీఎంఐ, ఇదే నెల ఆటో అమ్మకాలు బుధవారం, సేవా రంగ పీఎంఐ డేటా, పారెక్స్ నిల్వలు శుక్రవారం విడుదల అవుతాయి. అమెరికా తయారీ, సేవా రంగ పీఎంఐ, ఉద్యోగ గణాంకాలు, యూరోజోన్ ఎకానామిక్ కాని్ఫడెన్స్, కన్జూమర్ కాని్ఫడెన్స్, సీపీఐ, జీడీపీ, తయారీ రంగ గణాంకాలు ఇదే వారంలో విడుదల కానున్నాయి. చైనా తయారీ, నాన్ మాన్యూఫ్యాక్చరింగ్, సేవారంగ పీఎంఐ డేటా ఈ వారంలోనే వెల్లడి కానున్నాయి. ఆయా దేశాల ఆరి్థక స్థితిగతులను ప్రతిబింబింజేసే కీలక స్థూల ఆరి్థక గణాంకాల వెల్లడికి ముందు మార్కెట్లలో అప్రమత్తత చోటు చేసుకోనే వీలుంది. అక్టోబర్‌లో రూ.20 వేల కోట్లు వెనక్కి ► విదేశీ ఇన్వెస్టర్లు అక్టోబర్‌లో రూ.20,300 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్ల రాబడులు పెరగడం, ఇజ్రాయెల్– హమాస్ వంటి భౌగోళిక రాజకీయ అనిశి్చతులు ఇందుకు కారణమయ్యాయి. ఇదే కాలంలో డెట్ మార్కెట్లో రూ.6,080 కోట్ల పెట్టుబడులు పెట్టడం విశేషం. ఫెడ్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడి తర్వాత భారత మార్కెట్‌పై విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి ఏమిటనేది స్పష్టమవుతుంది. కాగా ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు భారత ఈక్విటీల్లో రూ.1.74 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫైనాన్షియల్స్, పవర్, ఐటీ రంగాల్లో ఎఫ్‌పీఐలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు. క్యాపిటల్ గూడ్స్ ఆటోమొబైల్స్ రంగాల్లో కొనుగోళ్లను కొనసాగించారు. రేపు ఎఫ్ఓఎంసీ సమావేశం ప్రారంభం ► ద్రవ్య విధాన నిర్ణయాలు, వడ్డీ రేట్లను సమీక్షించేందుకు అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ మంగళ, బుధవారాల్లో సమావేశం కానుంది. ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 5.25 – 5.50% వద్ద యథాతథంగా ఉంచొచ్చని ఆరి్థకవేత్తల అంచనా. ద్రవ్య పాలసీ వెల్లడి సందర్భంగా చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలను ఈక్విటీ మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. ఇదే మంగళ, బుధవారాల్లో బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లు సైతం ద్రవ్య సమీక్ష నిర్వహించనున్నాయి. -
అంతర్జాతీయ అనిశ్చితి ఉన్నా.. భారత్ భేష్
న్యూఢిల్లీ: రాజకీయ, ఆర్థిక అస్థిరతల మధ్య వచ్చే సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని చాలా మంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే 90 శాతం కంటే ఎక్కువ మంది దక్షిణాసియా, ముఖ్యంగా భారతదేశంలో మధ్య తరహా లేదా బలమైన వృద్ధి నమోదవుతుందని విశ్వసిస్తున్నారు. ఈ మేరకు తమ అధ్యయనంలో అభిప్రాయాలు వ్యక్తం అయినట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తాజా ‘చీఫ్ ఎకనమిస్ట్ ఔట్లుక్’ నివేదిక పేర్కొంది. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో తీవ్ర ప్రతికూలతల నేపథ్యంలో చైనా అవుట్‌లుక్ మసకబారింది. ► ప్రపంచం రాజకీయ, ఆర్థిక అస్థిరతతో పోరాడుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి నిర్దేశిస్తున్న సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) చేరుకోవడంలో పురోగతి బలహీనంగా ఉంటుందని దాదాపు 10 మందిలో ఆరుగురు విశ్వస్తున్నారు. ► ప్రత్యేకించి ఆహార భద్రత, వాతావరణ పరిరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణతో సహా ఎస్డీజీకి సంబంధించి పలు లక్ష్యాల్లో మందగమనం ఉంటుంది. 2030లో అర బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు తీవ్ర పేదరికంలో జీవిస్తారు. ► ఇటీవల అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినప్పటికీ కఠిన ఫైనాన్షియల్ పరిస్థితులు కొనసాగుతాయని మెజారిటీ (86 శాతం) అంచనా. ఆయా అంశాల నేపథ్యంలో వ్యాపార రుణాలపై ఒత్తిడి, కార్పొరేట్ రుణ ఎగవేతలలో పెరుగుదల, ఆస్తి–ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర దిద్దుబాట్లు తప్పదు. ► 74 శాతం మంది భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరికొన్ని సంవత్సరాలు తప్పదని భావిస్తున్నారు. ► అమెరికాలో మే నుండి అవుట్‌లుక్ బలపడింది. ప్రతి 10 మందిలో ఎనిమిది మంది 2023, 2024 అమెరికా ఒక మోస్తరు లేదా లేదా బలమైన వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నారు. ► యూరోప్ విషయంలో ఎకానమీ బలహీనం లేదా మరీ బలహీన పరిస్థితులు ఈ ఏడాది ఉంటాయని 77 శాతం మంది భావిస్తున్నారు. 2024లో పరిస్థితులు కొంత మెరుగుపడవచ్చని అంచనా. -
బలహీనపడిన బిపర్జోయ్.. గుజరాత్ నుంచి రాజస్తాన్ వైపు పయనం
జైపూర్/అహ్మదాబాద్/న్యూఢిల్లీ: గుజరాత్ తీర ప్రాంతాన్ని వణికించిన బిపర్జోయ్ తుపాను బలహీనపడింది. ఈశాన్య దిశగా ప్రయాణిస్తూ పొరుగు రాష్ట్రమైన రాజస్తాన్ వైపు మళ్లిందని అధికారులు వెల్లడించారు. తుఫాను ప్రభావం వల్ల రాజస్తాన్‌లోని జలోర్, బార్మర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. గురువారం సాయంత్రం దాదాపు 70 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ ప్రకటించింది. జలోర్‌లో శుక్రవారం ఉదయానికల్లా 69 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలియజేసింది. రెండు జిల్లాల్లో 200 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జోథ్‌పూర్, జైసల్మేర్, పాలీ, సిరోహీ వైపు తుపాను పయనిస్తోందని, అక్కడ సైతం భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. శుక్రవారం, శనివారం రాజ్‌సమంద్, దుంగార్పూర్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముందుజాగ్రత్త చర్యగా రాజస్తాన్ ప్రభుత్వం జైపూర్, కోట, భరత్పూర్, ఉదయ్‌పూర్, అజ్మీర్, జోద్పూర్, బికనేర్ తదితర ప్రాంతాలకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపించింది. అజ్మీర్ జిల్లాలోని కిషన్గఢ్కు ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకుంది. చదవండి: తుపాన్లు తలొంచుతున్నాయ్..! వారం రోజుల ముందే హెచ్చరికలతో.. గుజరాత్లో ప్రాణ నష్టం సున్నా గుజరాత్లో బిపర్జోయ్ తుఫాను వల్ల ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అతుల్ కార్వాల్ శుక్రవారం చెప్పారు. వివిధ ప్రాంతాల్లో 23 మంది గాయపడ్డారని, దాదాపు 1,000 గ్రామాల్లో విద్యుత్ సరఫరాను ఇంకా పునరుద్ధరించలేదని ప్రకటించారు. గుజరాత్లో తుపాను కంటే ముందే ఇద్దరు చనిపోయారని వెల్లడించారు. తుపాను హెచ్చరికలపై ప్రభుత్వ యంత్రాంగం వేగంగా స్పందించి, చేపట్టిన చర్యల వల్లే ప్రాణనష్టం సంభవించలేదని అన్నారు. కచ్ ప్రాంతంలో 40 శాతం గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. 500 ఇళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. పక్కా ఇళ్లకు పెద్దగా నష్టం వాటిల్లలేదన్నారు. 800 చెట్లు కూలిపోయాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, ఇందుకోసం గుజరాత్ ఎస్డీఆర్ఎఫ్తో కలిసి పని చేస్తున్నామని వివరించారు. రహదారుల వ్యవస్థకు నష్టం జరగలేదన్నారు. సెల్‌ఫోన్ నెట్వర్క్ యథాతథంగా పని చేస్తోందన్నారు. విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు గుజరాత్లో 8 జిల్లాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు 1,000కి పైగా బృందాలను రంగంలోకి దించినట్లు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కచ్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్, మోర్బీ, జునాగఢ్, గిర్ సోమనాథ్, రాజ్‌కోట్, పోర్బందర్ తదితర జిల్లాల్లో తుపాను వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముందస్తు చర్యలు చేపట్టడం, లక్ష మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్ల తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ చెప్పారు. తుపాను సహాయక చర్యల్లో సహకారం అందించిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 707 మంది శిశువుల జననం గుజరాత్లో మంగళవారం సాయంత్రం నుంచి తుపాను కల్లోలం మొదలైంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి లక్షల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీర ప్రాంతంలోని 8 జిల్లాల్లో 1,171 మంది గర్భిణులు ఉండగా, వీరిలో 1,152 మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు. గత నాలుగు రోజుల్లో వీరిలో 707 మంది గర్భిణులకు వివిధ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో సురక్షితంగా ప్రసవం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. 707 మంది శిశువులు జన్మించారని పేర్కొంది. ► బిపర్జోయ్ అత్యంత తీవ్ర నుంచి తీవ్ర తుపానుగా బలహీనపడింది. రాజస్తాన్‌లోకి ప్రవేశించింది. ► తుపాను ధాటికి గుజరాత్‌లోని కచ్–సౌరాష్ట్ర ప్రాంతంలో గురువారం సాయంత్రం నాటికి 5,120 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. 4,600 గ్రామాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఇప్పటిదాకా 3,580 గ్రామాలకు సరఫరా పునరుద్ధరించారు. మరో 1,000కిపైగా గ్రామాలకు పునరుద్ధరించాల్సి ఉంది. ► దాదాపు 800 చెట్లు నేలమట్టమయ్యాయి. ఫలితంగా పలు రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ► గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ► ప్రజలను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు ప్రాణనష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగాన్ని గుజరాత్ ప్రభుత్వం అభినందించింది. ► ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు ఫోన్ చేసి పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, అటవీ జంతువుల రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ► ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలకు స్వచ్ఛంద సంస్థలు, మీడి యా సంస్థలు కూడా సహకారం అందించాయి. ► మరో 3 రోజులపాటు 23 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ► సీఎం భూపేంద్ర పటేల్ తరచుగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ► పాకిస్తాన్‌లోనూ తీర ప్రాంతాల్లో అక్కడి ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. దక్షిణ సింధూ ప్రావిన్స్ నుంచి 82,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
చమురు ధరలు తగ్గడం ఓఎంసీలకు అనుకూలం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మొత్తం మీద బలహీన ఆర్థిక ఫలితాలనే నమోదు చేస్తాయని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినప్పటికీ.. విక్రయ ధరలను చాలా కాలంగా నిలిపి ఉంచడం ఇందుకు కారణంగా పేర్కొంది. ఆర్థిక మందగమనం ఆందోళనలతో చమురు ధరలు అంతర్జాతీయంగా తగ్గడం వల్ల మూడు ప్రభుత్వరంగ సంస్థలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో తిరిగి లాభాల బాట పడతాయని అంచనా వేసింది. ‘‘2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో నష్టాలు వచ్చినందున, పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఫలితాలు బలహీనంగానే ఉంటాయి. చమురు విక్రయ ధరలపై పరిమితి పెట్టినందున మొదటి ఆరు నెలల్లో, అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అవి రేట్లను సవరించలేదు’’అని మూడీస్ పేర్కొంది. ఈ మూడు కంపెనీలు 2022 ఏప్రిల్ 6 నుంచి చమురు విక్రయ ధరలను సవరించకుండా, అవే ధరలను కొనసాగిస్తుండడం గమనార్హం. 2022 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా అవి ధరలను సవరించకపోవడం వల్ల, మొదటి ఆరు నెలలకు రూ.21,000 నష్టాలను ప్రకటించాయి. గోరుచుట్టుపై రోకటిపోటులా.. డాలర్ మారకంలో రూపాయి విలువ క్షీణించడం వీటి నష్టాలను మరింత పెంచిందని చెప్పుకోవాలి. ఇవి ముడి చమురును డాలర్ మారకంలోనే కొనుగోలు చేస్తుంటాయని మూడీస్ తెలిపింది. లాభాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలతో పోలిస్తే చమురు ధరలు తగ్గినందున, కొనుగోళ్ల వ్య యాలు తగ్గి లాభదాయక వచ్చే కొన్ని నెలల్లో మెరుగుపడుతుందని మూడీస్ అంచనా వేసింది. రష్యా నుంచి చౌకగా ముడి చమురు కొనుగోలు చేయడం ఈ మూడు ప్రభుత్వరంగ సంస్థలకు కలిసొస్తుందని పేర్కొంది. బ్రెంట్ క్రూడ్ కంటే రష్యా చమురు త క్కువ ధరకు వస్తుండడాన్ని ప్రస్తావించింది. అయినప్పటికీ వచ్చే 12నెలల్లో చమురు ధరలు అస్థిరతల మధ్యే చలించే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధం తీవ్రతరమైనా లేక చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నా అది అంతర్జాతీయంగా ధరల పెరుగుదలకు దారితీస్తుందని, అదే జరిగితే ఆయిల్ కంపెనీల లాభాలు పరిమితం కావొచ్చని పేర్కొంది. రుణ పరిస్థితుల్లో మెరుగు.. ‘‘లాభాలు పెరిగితే రుణ భారం తగ్గుతుంది. మూ లధన అవసరాలకు నిధుల వెసులుబాటు లభిస్తుంది. 2022 మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య నష్టాలను అదనపు రుణాలు తీసుకుని ఇవి సర్దుబాటు చేసుకున్నాయి. దీంతో వాటి రుణ భారం పెరిగింది’’అని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ పే ర్కొంది. పెరిగే ధరలకు అనుగుణంగా మూలధన అవసరాలు కూడా పెరుగుతాయని, ఫలితంగా కంపెనీల రుణ కొలమానాలు బలహీనంగా ఉంటా యని పేర్కొంది. నియంత్రణపరమైన అనిశ్చితి కూ డా వాటి రుణ నాణ్యతను ప్రభావితం చేస్తుందని తెలిపింది. ‘‘భారత్‌లో చమురు ధరల పరంగా స్ప ష్టత లోపించింది. రిఫైనింగ్, మార్కెటింగ్ కంపెనీలకు ఇది క్రెడిట్ నెగెటివ్. చమురు ధరలపై నియంత్రణలతో కంపెనీల నష్టాలు కొనసాగుతా యి. వాటిని ప్రభుత్వం సకాలంలో సర్దుబాటు చే యకపోతే వాటి క్రెడిట్ నాణ్యత కూడా బలహీనపడుతుంది’’ ఈని మూడిస్ నివేదిక హెచ్చరించింది. కాకపోతే ప్రభుత్వం నుంచి మద్దతు దృష్ట్యా ఈ కంపెనీల తుది రేటింగ్‌ల్లో ఏ మాత్రం మార్పు ఉండదని స్పష్టం చేసింది. రేట్లపై స్వేచ్ఛ లభిస్తేనే.. చమురు రిఫైనింగ్, మార్కెటింగ్ కంపెనీలు అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ విక్రయ రేట్లను సవరించుకునే స్వేచ్ఛ కల్పించినప్పుడే వాటి మార్జిన్లు తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయని మూడీస్ తెలిపింది. అయితే ఇది 2024 సాధారణ ఎన్నికల తర్వాతే సాధ్యపడుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలతో పోలిస్తే ఇటీవల అంతర్జాతీయంగా రేట్లు తగ్గడం కంపెనీలకు సానుకూలిస్తుందని పేర్కొంది. ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగతే వచ్చే కొన్ని నెలల్లో కంపెనీల లాభదాయకత పెరుగుతుందని మూడీస్ తెలిపింది. ‘‘2022–23లో సెప్టెంబర్ 30 నాటికి సగటున చమురు ధర బ్యారెల్ 105 డాలర్లుగా ఉంది. అక్కడి నుంచి డిసెంబర్ 31 నాటికి 16 శాతం తగ్గి బ్యారెల్ 89 డాలర్లకు దిగొచ్చింది’’ అని పేర్కొంది. -
పైపులు వీక్.. గ్యాస్ లీక్
ఒకే చోట ఏడు బావులు ధర్నాకు దిగిన గ్రామస్తులు అంతర్వేదికర (సఖినేటిపల్లి) : గ్రామంలోని రక్షణలేని ఓఎన్జీసీ బావులతోను, తుప్పుపట్టిన పైపులైన్లు, పైపుల జాయింట్‌లతోను ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బావులు వద్ద శాశ్వత రక్షణ చర్యలు చేపట్టకపోవడం, తుప్పు పట్టిన జాయింట్లను తొలగించకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. గ్యాస్ లీక్ అవుతున్న సందర్భాల్లో సంస్థ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి, అటుపై వీటి గురించి పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా గ్యాస్ లీకేజీ .. గ్రామంలోని దిండమెరక, బెల్లంకొండ గ్రూపులకు సమీపంలో మంగళవారం ఉదయం కేవీ 10 బావి నుంచి లీకయిన గ్యాస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఇక్కడ ఈ బావితో పాటు మరో ఆరు బావుల్లో ఓఎన్జీసీ కార్యకలాపాలు సాగిస్తోంది. బావి ముఖ ద్వారం పైపు జాయింట్ నట్లు తుప్పు పట్టి ఊడిపోయి, గ్యాస్ బావి వద్ద నుంచి లీకవ్వడం గ్రామస్తులు బెంబేలెత్తి పోయారు. సుమారు 45 నిమిషాల పాటు లీకయిన ఈ గ్యాస్ బావులన్నింటినీ కమ్మేసింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో మోరి గ్యాస్ కలెక్షన్ స్టేషన్ సిబ్బంది బావి వద్దకు వచ్చి గ్యాస్ లీకేజీని అరికట్టారు. బావి వద్ద, మోరి జీసీఎస్ వద్ద గొట్టాలను మూసివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ధర్నాకు దిగిన గ్రామస్తులు.. తరుచూ గ్రామంలోని బావులు వద్ద, పొలాల్లోని వెళ్లిన పైపుల నుంచి లీకవుతున్న గ్యాస్ వల్ల తమకు భద్రత లేకుండా పోయిందని గ్రామస్తులు ఏడు బావులున్న ఓఎన్జీసీ సైటులో ధర్నాకు దిగారు. గ్యాస్ లీకేజీలను ముందుగా పసిగట్టే ఆధునికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని, గ్యాస్ లీకేజీల వల్ల దెబ్బతింటున్న పంటలకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. బెల్లంకొండ నాని, రావి ఆంజనేయులు, చొప్పల బాబూరావు, చెన్నంశెట్టి సుబ్బారావు, బీ వెంకటేశ్వరరావు, బి.రాజు, తోట వెంకటేశ్వర్లు, రావి వాసు, శ్రీను, విష్ణు, బి. పద్మాజీరావు పాల్గొన్నారు. -
హెచ్1బీ వీసాల సంక్షోభం:మరోసారి ఐటీ డీలా
ముంబై: హెచ్1బీ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం మరో బాంబు పేల్చడంతో దేశీయ ఐటీ రంగాన్ని భారీగా తాకుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసాలపై తాజా కొత్త బిల్లు ప్రతిపాదన నేపథ్యంలో ఐటీ కౌంటర్ మరోసారి డీలాపడింది. మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతినడంతో మార్కెట్లో భారీ అమ్మకాలకుదిగారు. దీంతో ప్రధాన ఐటీ షేర్లు నష్టాలు చవి చూస్తున్నాయి. ముఖ్యంగా టీసీఎస్, ఇన్ఫోసిస్ ఒక శాతానికిపైగా, మైండ్ ట్రీ 2శాతం నష్టపోయాయి. విప్రో, టెక్ మహీంద్రా, కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. లాభాల డబుల్ సెంచరీ సాధించిన మార్కెట్లలో దాదాపు అన్ని సెక్టార్లలోను కొనుగోళ్ళ ధోరణి నెలకొనగా ఐటీ, ఫార్మాసెక్టార్లో సెల్లింగ్ ప్రెజర్ భారీగా కనిపిస్తోంది. కాగా హెచ్1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ను ఆరు నెలలపాటు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వెల్లడించింది. ఏప్రిల్ 3 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. 2018 ఆర్థిక సంవత్సరానికి (అక్టోబర్ 1, 2017 నుంచి ప్రారంభం)గాను సాధారణ హెచ్1బీ వీసాల దరఖాస్తులను కూడా ఏప్రిల్ 3 నుంచి స్వీకరించనున్నట్లు తెలిపింది. ప్రత్యేక ఫీజుతో హెచ్–1బీ వీసాల ఆమోద ప్రక్రియ త్వరగా పూర్తి చేసుకునేందుకు వీలు కల్పించే ప్రీమియం ప్రాసెసింగ్ పై తాత్కాలికంగా నిషేధించిన సంగతి తెలిసిందే. -
రుపీకి డాలర్ దెబ్బ
ముంబై: డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ రూపాయి ఒక్కసారిగా బలహీనపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి 18 పైసలు నీరసించి 66.88ను తాకింది. ప్రస్తుతం కాస్త కోలుకుని 0.12 పైసల(0.22 శాతం) నష్టంతో 66.83 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకులు, దిగుమతిదారులు డాలర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం వంటి అంశాలు రూపాయిని బలహీనపరచినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఫెడ్ వడ్డీరేట్టు పెరగనున్నాయనే అంచనాలతో ఆసియన్ మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. రియల్టీ, సావరీన్ గోల్డ్ బాండ్స్ నష్టాల్లో ఉండగా, డాలర్విలువ పుంజుకుంది. విదేశీ ఫెడరల్ రిజర్వ్ ఈ నెల తరువాత వడ్డీ రేట్లు పెంచుతుందున్న అంచనాలతో ఇతర కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ బలం రూపాయి సెంటిమెంట్ కూడా బలహీనపర్చిందని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఈక్విటీ మార్కెట్లు నష్టాలుకూడా ప్రభావితం చేస్తున్నట్టు చెప్పారు. కాగా, గురువారం డాలరుతో మారకంలో రూపాయి 12 పైసలు బలపడి 66.70 వద్ద ముగిసింది. అటు ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో వరుసగా రెండు రోజు కూడా దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల వైపు మళ్లాయి. మరోవైపు అమెరికా స్టాక్ మార్కెట్లలో గురువారం భారీ నష్టాల్లో చవిచూస్తున్నాయి. -
బడ్జెట్ ముందు నష్టాల్లో పయనం
ముంబై : బడ్జెట్ గడియలు ప్రారంభం కాబోతున్న తరుణంలో మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో 93 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ మరింత నష్టాల దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం 137.09 పాయింట్ల నష్టంలో 27,712 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం 47.10 పాయింట్లు దిగజారి 8585గా ట్రేడవుతోంది. ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, లుపిన్, హెచ్‌యూఎల్‌లు టాప్ గెయినర్లుగా ఉండగా... గెయిల్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటోలు నష్టాలు గడిస్తున్నాయి. 2017కు సంబంధించిన ఆర్థిక సర్వేను ప్రభుత్వం నేడు పార్లమెంట్ ముందుకు తీసుకురాబోతుంది. ఈ నేపథ్యంలో ఎకనామిక్ గ్రోత్‌పై ఎలాంటి అంచనాలు వెలువడతాయోనని విశ్లేషకులు, పెట్టుబడిదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ స్కీమ్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని పలువురు అంచనావేస్తున్నారు. గ్రామీణ మౌలిక సదుపాయాలు, తాగు, సాగు నీరు, సామాజిక సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఎక్కువగా వెచ్చించనుందని ఇప్పటికే పలు సంకేతాలు వెలువడ్డాయి. మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు పెరిగి 67.84 వద్ద నమోదైంది. మరోవైపు బంగారం ధరలు 158 రూపాయలు పుంజుకుని 28,511వద్ద ట్రేడవుతున్నాయి. -
ఐటీ రంగానికి వీసా షాక్!
ముంబై: ముస్లిం దేశాలనుంచి వలసలను నివారించే క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నకఠిన నిర్ణయాల నేపథ్యంలో ఐటీ షేర్లు డీలా పడ్డాయి. సుమారు ఏడు ముస్లిం దేశాల నుంచి వలసలను అరికట్టేందుకు వీసాలపై ఆంక్షలు విధించడంతో ఐటీ షేర్లు నష్టాలనెదుర్కొంటున్నాయి. మదుపర్ల సెంటిమెంట్ బలహీనపడ్డంతో ఐటీ సెక్టార్ లో అమ్మకాల ధోరణి నెలకొంది. దీంతో ఎన్ఎస్ఈలో ఐటీ ఇండెక్స్ దాదాపు 1 శాతం క్షీణించింది. ఐటీ బ్లూచిప్స్ షేర్లు ఇన్ఫోసిస్ 0.77 శాతం, టీసీఎస్ 1శాతం, విప్రో 1.65 శాతం నష్టపోతున్నాయి. ఇదే బాటలో హెచ్‌సీఎల్ టెక్ తదితర షేర్లు నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. అటు బుధవారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలైనా. వెంటనే లాభాల్లోకి మళ్లాయి. ఇన్వెస్టర్ల అప్రమత్తత కారణంగా ఊగిసలాటల మధ్య కొనసాగుతున్నాయి. బడ్జెట్ అంచనాలతో ట్రేడర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు ట్రంప్ ఎఫెక్ట్‌తో పసిడి ధరలు మళ్ళీ ధగధగ లాడుతున్నాయి. గత వారం రెండు వారాల కనిష్టానికి చేరిన పసిడికి డిమాండ్ బాగా పుంజుకుంది. ఏడు ముస్లిం దేశాల ప్రయాణికులకు వీసాలను నిషేధిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా నిరసనలకు తెరలేవగా... సంక్షోభ పరిస్థితుల్లో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడిలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. -
లాకులకు నీళ్లొదిలేశారు
ఆచంట : ఆచంట మండలం కోడేరు వద్ద బ్యాంక్ కెనాల్‌పై వందేళ్ల క్రితం నిర్మించిన లాకులివి. శిథిలావస్థకు చేరడంతో వీటి దిగువన గల 6 వేల ఎకరాల ఆయకట్టులో వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఏటా పంటల్ని నష్టపోతున్న రైతుల పోరాటంతో ఎట్టకేలకు లాకులను ఆధునికీకరించే పనులు మొదలుపెట్టినా పూర్తిచేసే విషయంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. డెల్టా ఆధునికీకరణ పనుల్లో భాగంగా బ్యాంక్ కెనాల్‌పై లాకుల పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.30 లక్షలు విడుదల చేసింది. పనులు ప్రారంభించినప్పటికీ.. రెండు నెలలుగా ముందుకు సాగడం లేదు. కొత్త లాకులను అమర్చేందుకు అవసరమైన సామగ్రిని తీసుకొచ్చినా.. ఆరుబయటే వదిలేశారు. సార్వా పనులు పూర్తయిన వెంటనే కొత్త లాకులు అమర్చి నీటి సమస్యను పరిష్కరిస్తామని అధికారులు ప్రకటించారు. సార్వా పనులు పూర్తయినా.. దాళ్వా పనులు మొదలవుతున్నా పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ముందుకు కదలడం లేదు. నిర్మాణం పూర్తయితే కోడేరు ఎగువ ప్రాంతంలోని 6 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి ఇబ్బందులు తొలగిపోతాయి. దాళ్వా సీజన్ మొదలైనా పనులు పూర్తికాకపోవడం, సాగునీటి సమస్య తలెత్తనుండటంతో రైతులు కలవరపడుతున్నారు. బ్రిటిష్ కాలం నాటి లాకులు బ్యాంకు కెనాల్‌పై పెనుగొండ మండలం సిద్ధాంతం, ఆచంట మండలం కోడేరు గ్రామాల్లో బ్రిటిష్ హయాంలో లాకులు నిర్మించారు. వీటికి కాలదోషం పట్టడంతో శిథిలావస్థకు చేరాయి. లాకు తలుపులకు పగుళ్లు ఏర్పడి చిల్లులు పడటంతో నీరు దిగువ ప్రాంతాలకు వెళ్లిపోతోంది. సార్వా, దాళ్వా సీజన్లలో సుమారు 60 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతాలకు వృథాగా పోతోంది. దీంతోఅధికారులు కోడేరు లాకుల వద్ద నీటి మట్టాలను నిలబెట్టలేకపోతున్నారు. ఫలితంగా కోడేరు ఎగువ ప్రాంతంలోని రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ఏడాది సార్వా సీజన్లోనూ సాగునీటి కొరతతో అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం విదితమే. దాళ్వాలో పరిస్థితి చెప్పనలవి కాదు. లాకుల నిర్మాణం పూర్తయితే జగ్గరాజు చానల్‌పై ఉన్న పెనుమంచిలి, ఆచంట వేమవరం, కొడమంచిలి చానల్‌పై ఉన్న కరుగోరుమిల్లి, కందరవల్లి గ్రామాలతోపాటు, పోడూరు మండలం వద్దిపర్రు, యలమంచిలి మండలం కాంభొట్లపాలెం గ్రామాల పరిధిలోని సుమారు ఆరు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి ఇబ్బందులు తొలగుతాయి. ఉన్నతాధికారులు స్పందించి లాకుల నిర్మాణంపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. ఎన్నాళ్లకు పూర్తి చేస్తారో దెబ్బతిన్న బ్యాంక్ కెనాల్ లాకు తలుపుల్ని మార్చాలని ఎప్పటినుంచో కోరుతున్నాం. ఇన్నాళ్లకు ప్రభుత్వం స్పందించింది. కొత్త తలుపులు తెచ్చి రెండు నెలలు దాటింది. నేటివరకూ బిగించలేదు. పాత లాకులు దెబ్బతినడంతో సాగునీరు దిగువ ప్రాంతాలకు వెళ్లిపోతోంది. ఎగువ ప్రాంతాల రైతులకు నీటి ఇబ్బందులు తప్పడం లేదు. దాళ్వాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ఈ ఏడాది సార్వాలోనే సాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. అధికారులు వెంటనే స్పందించి.. లాకు పనుల్ని పూర్తి చేసి ఇబ్బందుల్ని తొలగించాలి. – కుంపట్ల సత్యనారాయణ, రైతు, కోడేరు త్వరలో పూర్తి చేస్తాం లాకుల నిర్మాణానికి రూ.30 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే కొత్త లాకులు కొనుగోలు చేసి పని జరిగే ప్రాంతానికి చేర్చాం. బ్యాంక్ కెనాల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పనులు పూర్తికాలేదు. త్వరలో అడ్డుకట్ట వేసి నీటిని మళ్లించి.. పనులు పూర్తి చేస్తాం. – సీహెచ్ వెంకటనారాయణ, డీఈ, నీటి పారుదల శాఖ -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
గత ఏడు సెషన్‌లోని పతనానికి బ్రేక్ పడి వారాంతంలో కోలుకున్న స్టాక్‌మార్కెట్లు, మళ్లీ భారీ నష్టాల బాట పట్టాయి. ఈక్విటీ బెంచ్ మార్కు సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా కిందకి దిగజారింది. నిఫ్టీ తన కీలకమార్కు 7950నుంచి పడిపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 237.70 పాయింట్ల నష్టంలో 25,803 వద్ద, నిఫ్టీ 76.05 పాయింట్ల నష్టంలో 7,909 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకు, అదానీ పోర్ట్స్, సిప్లా, ఎస్బీఐ, టాటా మోటార్స్ల్లో నెలకొన్న నష్టాలతో సెన్సెక్స్ నష్టాల్లో కొనసాగుతోందని విశ్లేషకులు చెప్పారు. నిఫ్టీ సైతం రియాల్టీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, కన్సూమర్ డ్యూరెబుల్స్లో ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ ఫ్లాట్‌గా 67.82 వద్ద ప్రారంభమైంది. ఆయిల్ ధరలపై మార్కెట్లు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయని తెలిసింది. లిబియా ఉత్పత్తిని పెంచాలన్న నేపథ్యంలో ఒపెక్ అవుట్‌పుట్‌లో కోతకు ఎలా ప్లాన్ చేయబోతుందోనని మార్కెట్లు దృష్టిసారించినట్టు విశ్లేషకులు చెప్పారు. 10 నెలల కనిష్టానికి వచ్చిన బంగారం ధరలపై కొనుగోలుదారులు లబ్ది పొందాలని కొనుగోళ్లు చేపట్టడంతో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 37 రూపాయల లాభంతో 27,005 వద్ద కొనసాగుతోంది. -
మార్కెట్లకు ఫెడ్ ఫీవర్
ముంబై: హిల్లరీ ఆధిక్యాన్ని కోల్పోయారన్న వార్తలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యం, ఫెడ్ ఫీవర్ నేపథ్యంలో సెన్సెక్స్ 349 పాయింట్లు పతనమై 27,527 వద్ద, నిఫ్టీ 112 పాయింట్ల నష్టంతో 8,514 వద్ద ముగిసింది. ఆరంభంనుంచీ భారీ నష్టాల్లో ట్రేడ్ అయిన మార్కెట్లు అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో చివరికి భారీ నష్టాల్లో కీలక మద్దతు స్థాయిలకు దిగువనే క్లోజ్ అయ్యాయి. దాదాపు అన్ని రంగాలు ప్రభావితం కాగా ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్ అధికంగా, రియల్టీ, ఫార్మా, ఐటీ, ఆటో నష్టపోయాయి. ఓఎన్జీసీ, టాటా మోటార్స్, బీవోబీ, భెల్, యస్‌బ్యాంక్, స్టేట్‌బ్యాంక్, ఐడియా, గ్రాసిమ్, బాష్ రెడ్ లోను ఎంఅండ్ఎం, ఇన్ఫ్రాటెల్ ఇండస్ఇండ్, హెచ్‌యూఎల్, ఎన్టీపీసీ గ్రీన్ లోనూ ట్రేడ్ అయ్యాయి. అయితే ఈ వారమంతా మార్కెట్లు బలహీనంగా కొనసాగే అవకాశాలున్నాయని మార్కట్ ఎనలిస్టులు భావిస్తున్నారు. అయితే బంగారం ధరలు మాత్రం దూకుడు మీద ఉన్నాయి. ఒక నెల గరిష్టాన్నినమోదు చేసి. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రాముల పుత్తడి 154 రూపాయల లాభంతో రూ. 30439వద్ద బలంగా ఉంది. డాలర్ మారకపు విలువలో రూపాయి 5 పైసల నష్టంతో రూ.66.77 వద్ద ఉంది. -
అధినేతపై ఆశలు
వరుస పరాజయాలతో కుదేలైన బీజేపీ నేతల తీరుతోనే జిల్లాలో ఈ దుస్థితి అమిత్ షా పర్యటనతో పార్టీ బలపడుతుందంటున్న నాయకులుl సాక్షిప్రతినిధి, వరంగల్ : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పరిస్థితి జిల్లాలో దయనీయంగా ఉంది. బీజేపీకి ఒకప్పుడు జిల్లాలో ఘనమైన చరిత్ర ఉంది. ఇప్పుడు పూర్తిగా విరుద్ధ పరిస్థితి ఏర్పడింది. వరుస దారుణ పరాజయాలతో పూర్తిగా కుదేలైంది. సాధరణ ఎన్నికల సంగతి సరేసరి... వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక, గ్రేటర్ వరంగల్ ఎన్నిక ఇలా ప్రతి పోరులోనూ బీజేపీ దారుణంగా ఓటమిపాలైంది. వరుస పరాజయాలతో నిస్తేజమైన బీజేపీ జిల్లాలో ఇప్పట్లో కోలుకునే అకాశాలు కనిపించడం లేదని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. పేరుకు జాతీయ పార్టీ అయినా జిల్లాలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ బీజేపీ ఉనికి కనిపించలేదు. జిల్లా నుంచి బీజేపీ తరఫున చట్టసభకు ఎన్నికైన వారు లేకపోవడం, స్థానిక ప్రజాప్రతినిధులు చాలా తక్కువ మంది ఉండడంతో పార్టీ విస్తరణ సాధ్యం కావడం లేదు. దశాబ్దాలుగా ఇద్దరు ముగ్గరు నేతలే జిల్లాలో పెత్తనం చెలాయిస్తున్నారని, వీరి వల్ల పార్టీకి కొత్త నాయకత్వం రావడం లేదని కమలం పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు కొత్త నాయకత్వాన్ని గుర్తించి పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్న బీజేపీ.. జిల్లాలో ఆ పని చేయకపోవడం వల్లే పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014 ఎన్నికల నుంచి మిత్రపక్షంగా కొనసాగుతూ వస్తున్న టీడీపీ పరిస్థితి జిల్లాలో దయనీయంగా మారింది. ఇప్పుడు బీజేపీది కూడా ఇదే తీరుగా ఉంది. జిల్లాలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీఏ) ప్రభావం ఎంతమాత్రమూ లేదని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్డీయే కూటమి తరఫున ఎవరో ఒకరు పోటీ చేస్తుండడం సాధారణ ఎన్నికల నుంచి జరుగుతోంది. 2014 సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ రెండు పార్టీల అభ్యర్థులు పోటీ చేశారు. గత ఏడాది మార్చిలో జరిగిన వరంగల్–నల్లగొండ–ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ తరుపున అభ్యర్థి పోటీ చేశారు. అధికార పార్టీతో జరిగిన పోరులో బీజేపీ అభ్యర్థి ఓటమిపాలయ్యారు. వరంగల్ లోక్‌సభకు గత ఏడాది చివరలో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ దక్కలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసినా బీజేపీకి కనీస స్థాయిలోనూ ఓట్లు దక్కలేదు. 2014 స్థానిక సంస్థల ఎన్నికలో బీజేపీ కేవలం 21 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఇలా గెలిచిన వారిలో 12 మంది మాత్రమే ప్రస్తుతం బీజేపీలో ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో బీజేపీని విస్తరించడం లక్ష్యంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం వరంగల్‌కు వస్తున్నారు. ఎన్నిక రాజకీయంలో తిరుగులేని వ్యూహకర్తగా పేరున్న అమిత్ షా రాకతో జిల్లాలో బీజేపీకి మంచి రోజులు వస్తాయని ఆ పార్టీ శ్రేణులు ఆశిస్తున్నాయి. -
జుట్టుకు గట్టి పోషణ
బ్యూటిప్స్ దుమ్ము, ధూళి పోషకాహార లోపాలు శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా వెంట్రుకల కుదుళ్లు బలహీనంగా మారి జుట్టు రాలడం, చండ్రు ఏర్పడటం, వెంట్రుకలు నిర్జీవంగా కనిపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటికి పరిష్కారంగా..! తలలో చుండ్రు సమస్య ఉంటే విరుగుడుగా ఆలివ్ ఆయిల్ ప్యాక్ వేసుకోవాలి. ఇందుకు టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, నాలుగైదు చుక్కల నిమ్మరసం, టీ స్పూన్ నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, మృదువుగా మర్దనా చేయాలి. 20 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి 2-3 సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తగ్గుతుంది. వెంట్రుకలకు సరైన మాయిశ్చరైజర్ అందకపోతేనే పొడిబారడం, జీవం లేనట్టుగా ఉండటం, చిట్లడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వేళ్లకు కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను అద్దుకుంటూ వెంట్రుకలకు నూనె పట్టించాలి. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 రోజులు చేస్తూ ఉంటే వెంట్రుకలు మృదుత్వాన్ని కోల్పోవు. చిట్లడం వంటి సమస్యలు తలెత్తవు. వెంట్రుకలు రాలడం వంటి సమస్యలను నివారించడమే కాదు, వాటి పెరుగుదలకూ దోహదం చేస్తుంది ఆలివ్ ఆయిల్. వెంట్రుక కుదురు బలంగా అవాలంటే దానికి తగిన పోషకాలు అందాలి. ఈ సుగుణాలు ఆలివ్ ఆయిల్లో ఉండటం వల్ల వారానికి ఒక్కసారైనా ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించాలి. దీని వల్ల వెంట్రుకల పెరుగుదల బాగుంటుంది. రాలడం సమస్య దరిచేరదు. ఆలివ్ ఆయిల్-కొబ్బరినూనె సమపాళ్లలో కలిపి వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ జాగ్రత్త వల్ల వెంట్రుకల మృదుత్వం దెబ్బతినదు. రాలడం వంటి సమస్య ఉత్పన్నం కాదు. ఆలివ్ ఆయిల్‌ను పెట్టిన తర్వాత వేడి నీళ్లలో ముంచి, పిండిన టవల్‌ను (టర్కీటవల్) తలకు చుట్టాలి. దీని ద్వారా వెంట్రుక కుదుళ్లలో ఉన్న మురికి, మృతకణాలు తొలగిపోయి, రక్తప్రసరణ మెరుగై వెంట్రుకలు రాలడం అనే సమస్య దరిచేరదు. -
జోరుగా పసిడి, హుషారుగా కరెన్సీ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ కు డిమాండ్ తగ్గుతుండడంతో భారతీయ కరెన్సీ రూపాయి పుంజుకుంటోంది. సోమవారం నాటి మార్కెట్ లో డాలర్ 24 పైసల నష్టంతో ప్రారంభమైంది. దీంతో నష్టాలనుంచి తేరుకున్న రూపాయి మళ్ళీ 67రూ. మార్క్ దగ్గర స్థిరంగా ఉంది. 0.43 శాతం లాభంతో 67.05 దగ్గర కొనసాగుతోంది. దిగుమతిదారులు, బ్యాంకర్లు నుంచి డిమాండ్ తగ్గడంతో అమెరికన్ కరెన్సీ బలహీనంగా ట్రేడవుతోంది. దీనికి తోడు బలహీనమైన దేశీయ ఈక్విటీ మార్కెట్ ప్రభావంతో రూపాయి పుంజుకుంది. ఈ నేపథ్యంలో డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ మళ్లీ 67రూ. మార్కును తాకింది. శుక్రవారం రోజు 5 పైసల నష్టంతో 66,76 దగ్గర ముగిసిన రూపాయి విలువ క్రమేపి బలపడి స్థిరంగా కొనసాగడం శుభసూచకమని విశ్లేషకుల అంచనా . బ్యాంకులు , దిగుమతిదారులునుంచి డిమాండ్ తగ్గడం, బలహీనమైన దేశీయ ఈక్విటీ మార్కెట్ ప్రభావంతో డాలర్ నిరంతర జోరుకు బ్రేక్ పడి, రూపాయి పుంజుకుంటోంది. మరోవైపు సోమవారం ఉదయం స్టాక్ మార్కెట్లు పతనం దిశగా మళ్లాయి. బీఎస్ఈ సెన్సెక్స్ , నిఫ్టీ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో 332 పాయింట్ల నష్టంతో 26,229 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 8 వేల వందకు దిగువన .. నష్టాల్లో కొనసాగుతోంది. మిగిలిన అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలహీనంగాఉండడం కూడా రూపాయి విలువ పెరగడానికికారణమని డీలర్లు చెప్పారు. అటు డాలర్ బలహీనతతో పసిడి కూడా జోరుమీద ఉంది. ఫెడ్ వడ్డీ రేట్లు పెరగనున్నాయనే అంచనాలతో ఇటీవల వెలవెలబోయిన పసిడి తిరిగి బలపడుతోంది. ఒకవైపు డాలర్ క్షీణత, మరోవైపు ఫెడ్ వడ్డన ఉండదన్న అంచనాల నేపథ్యంలో పసిడి ధర తిరిగి పుంజుకుని..10 గ్రా. బంగారం ధర 30 వేల మార్క్ ను దాటగా..వెండి 41 వేల దగ్గర స్థిరంగా ఉంది. -
చెత్త పాస్వర్డ్స్ లో వాళ్లే ముందు!
కంప్యూటర్ల కాలం వచ్చాక పాస్ వర్డ్స్ ప్రాధాన్యం ఎంతో పెరిగిపోయింది. ఆన్ లైన్లో తమ స్వంత వివరాలను భద్రపరచుకొనేందుకు, బ్యాంకులు వగైరా కార్యకలాపాలు నిర్వహించేందుకు ఎవ్వరూ కనిపెట్టలేని పాస్ వర్డ్స్ పెట్టుకోవాలంటూ ఎప్పటికప్పుడు హెచ్చరికలు వస్తూనే ఉంటాయి. అయితే అలా పాస్ వర్డ్స్ ను మెయింటెన్ చేయడంలో సింగపూర్ వాసులు పరమ వీక్ అని రుజువైంది. ఒకే పాస్ వర్డ్ ను.. అదీ అందరికీ తెలిసే పాస్ వర్డ్స్ ను పదే పదే అన్ని సైట్లకూ వాడుతూ ఇప్పుడు ప్రపంచంలోనే వరస్ట్ పాస్ వర్డ్ వినియోగదారులుగా వారు ముందున్నరని తాజా నివేదికలు చెప్తున్నాయి. వివిధ వెబ్ సైట్లలో ఒకే పాస్ వర్డ్స్ వాడటం మంచిది కాదన్న విషయం తెలిసినా పట్టించుకోనివారు ఎక్కువమందే ఉంటారు. 2015 లో సింగపూర్ వాసులు అదే తప్పును చేసి.. భారీగా సైబర్ క్రిమినల్స్ వల్లో చిక్కుకుపోయారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు వెల్లడించారు. ప్రైవేటు సమాచారం దొంగిలించాలని చూసే అటువంటి సైబర్ నేరగాళ్ళకు... సింగపూర్ వాసులు లక్ష్యం కావచ్చునని భద్రతాధికారులు హెచ్చరిస్తున్నారు. గతవారం 300 మంది ఖాతాదారుల పాస్ వర్డ్స్ ను చోరీచేసి, సింగపూర్ వీసా అప్లికేషన్లు ఉత్పత్తి చేసే చైనా ఆధారిత సిండికేట్ కు అమ్మకం పెట్టిన ఓ మాజీ నిర్వహణాధికారి పట్టుబడ్డంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అనేక మంది తమ ఎన్ ఆర్ ఐసీ నెంబర్ నే యూజర్ ఐడీ, పాస్ వర్డ్ గా వాడుతున్నారని... అంచనా వేసిన 39 ఏళ్ళ జేమ్స్ సిమ్ గాన్ లియాంగ్... తన ప్రయత్నం ఫలించడంతో వేలాది పాస్ వర్డస్ ను సునాయాసంగా తెలుసుకోగలిగాడు. ముఖ్యంగా తమ వ్యక్తిగత సమాచారంలోని పదాలను పాస్ వర్డ్స్ గా పెట్టుకోవడంతో సామాజిక మాధ్యమాల ఆధారంగా వాటిని చోరాసురులు టార్గెట్ చేస్తారు. రీసెట్ పాస్ వర్డ్స్ లో కూడ కొన్నిసార్లు ప్రశ్నలకు సులభమైన సమాధానాలు ఇవ్వడంద్వారా కూడా వ్యక్తిగత డేటాను చోరీ చేయగల్గుతారని.. పాలో ఆల్టో నెట్వర్క్స్ భద్రతా సంస్థ నిఘా విశ్లేషకుడు విక్కీ రే చెప్తున్నారు. పాఠశాల పేరు, స్వంత ఊరిపేరు వంటి సమాధానాలను లింక్డ్ ఇన్, ఫేస్ బుక్ వంటి వాటినుంచీ పొందే అవకాశం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. పాస్వర్డ్స్ ను హ్యాక్ చేయడంలో ఇదో పద్ధతి అని, అలాగే అతి సులభమైన పదాలను, నెంబర్లను పాస్ వర్డ్స్ గా పెట్టుకోవడం వల్ల కూడ హాక్ చేయగల్గుతారని చెప్తున్నారు. అతి తేలికైన పదాలు, అందరికీ అలవాటుగా ఉండే పదాలు వాడే వారిపైనే ధ్యాసపెట్టే హాకర్లు ఇటువంటి పాస్ వర్డ్స్ ను సులభంగా హ్యాక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అటువంటి 20 మిలియన్ల అతి చెత్త పాస్ వర్డ్స్ లిస్టును పాస్ వర్డ్స్ మేనేజ్ మెంట్ సంస్థ స్ల్పాష్ డేటా తాజాగా విడుదల చేసింది. ఈ లిస్టులో కీబోర్డుపై మొదటి అక్షరాలు (123456) qwerty వంటి పదాలు.. వరుసగా ఐదో సంవత్సరం కూడ అగ్రస్థానంలో ఉండగా.. పాప్ సంస్కృతికి సూచనగా తాజాగా విడుదలైన చిత్రాల పేర్లు... స్టార్ వార్స్, సోలో, యువరాణి వంటి పాస్ వర్డ్స్ కూడ ఈ లిస్టులో ఉండటం విశేషం. బ్రూట్ ఫోర్స్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి ఇటువంటి బలహీనమైన, రహస్య పదాలను హ్యాకర్లు ఊహిస్తుంటారు. సాధారణంగా అన్నీ చిన్న అక్షరాలు కలిగి ఉన్న ఆరు నుంచి పది అక్షరాలు ఉండే పాస్ వర్డ్స్ ట్రాక్ చేసేందుకు సైబర్ సెక్యూరిటీ టూల్స్ కు పది నిమిషాలు పడుతుందని సింగపూర్ సెక్యూరిటీ ట్రెండ్ మైక్రో జనరల్ మేనేజర్ డేవిడ్ షా చెప్తున్నారు. అయితే వాటిలో ఓ పెద్ద అక్షరం కలపడం, సింబల్స్ వంటివి కలపడం వల్ల హ్యాక్ చేసేందుకు కనీసం రెండున్నర రోజులు పడుతుందంటున్నారు. అలాగే ఆయా సంస్థలు బలమైన డేటాబేస్ వ్యవస్థను కలిగి ఉండటం కూడ చోరీ కాకుండే ఉండేందుకు సహకరిస్తుందంటున్నారు మరో నిపుణుడు ఛార్లెస్ లిమ్. ముఖ్యంగా పాస్ వర్డ్స్ కనీసం ఎనిమిది క్యారెక్టర్లు ఉండి, లోయర్, క్యాపిటల్ లెటర్లతోపాటు నెంబర్లను, సింబల్స్ ను కలిపి క్రియేట్ చేసుకోవడం ఎంతో అవసరం అని ఆయన యూజర్లకు సలహా ఇస్తున్నారు. అలాగే తరచుగా పాస్ వర్డ్స్ మార్చుకుంటూ ఉండటం వల్ల కూడ హ్యాక్ చేసే అవకాశం ఉండదని, ఒకే పాస్ వర్డ్ ను అన్ని వెబ్ సైట్లలో వాడటం కూడ మానుకోవాలని సూచిస్తున్నారు. -
ఆమె కన్నా అతడే ‘వీక్’!
ఆమె కన్నా అతడే ‘వీక్’! మనోస్థైర్యం కోల్పోతున్న పురుషులు ఆత్మహత్య కేసుల్లో మగవారిదే అధికం దేశంలో పదో వంతు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే స్పష్టం చేస్తున్న ఎన్సీఆర్బీ గణాంకాలు హైదరాబాద్: మహిళలపై అకృత్యాల్లో ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి రాష్ట్రం) ప్రథమ స్థానంలో ఉన్నట్లు స్పష్టం చేస్తోన్న నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) 2013 గణాంకాలు మరో విషయాన్నీ బయటపెట్టాయి. రాష్ట్రంలో నమోదవుతున్న ఆత్మహత్య కేసుల్లో మహిళల కంటే పురుషులవే ఎక్కువ ఉంటున్నాయని పేర్కొంటున్నాయి. మనోస్థైర్యం విషయంలో స్త్రీల కంటే పురుషులే బలహీనంగా ఉండటం దీనికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సగటున రోజుకు 40 ఉదంతాలతో గత ఏడాదికి సంబంధించి ఆత్మహత్యల సంఖ్యలో రాష్ట్రం మూడో స్థానంలో ఉండగా.. దేశంలో నమోదవుతున్న వాటిలో పదో వంతు ఇక్కడివే కావడం ఆందోళన కలిగించే అంశం. అన్నింటా స్త్రీలపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించే పురుషులు కష్టాలు ఎదురవగానే మాత్రం డీలాపడిపోతున్నారని.. అర్ధంతరంగా జీవితాలు ముగించడానికే మొగ్గు చూపుతున్నారని ఈ గణాంకాలు చెప్తున్నాయి. గత ఏడాది దేశ వ్యాప్తంగా 1,34,799 ఆత్మహత్యలు రికార్డుల్లోకి ఎక్కగా.. వీటిలో 14,607 రాష్ట్రానికి సంబంధించినవే. ప్రథమ స్థానంలో తమిళనాడు (16,927), ద్వితీయ స్థానంలో మహారాష్ట్ర (16,112) ఉండగా.. తరవాతి స్థానం ఏపీదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఆత్మహత్య ఉదంతాల్లో 9,902 మంది పురుషులు, 4,705 మంది స్త్రీలు అసువులు బాశారు. 2013లో దేశ వ్యాప్తంగా 1,34,799 మంది ఆత్యహత్యలకు పాల్పడ్డారు. వీరిలో పురుషులు 90,543 మంది ఉండగా.. స్త్రీలు 44,256 మంది ఉన్నారు. అంటే మహిళల కంటే పురుషులు రెట్టింపు సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్నట్లు స్పష్టమౌతోంది. వీరిలోనూ 30 - 44 ఏళ్ల మధ్య ఉన్న నడివయస్కులే 32,099 మంది వరకు ఉన్నారు. ఈ బలవన్మరణాలకు కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం వంటి అనేక సమస్యలు దోహదం చేస్తున్నాయని ఎన్సీఆర్బీ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా బలవన్మరణాలకు పాల్పడటానికి కుటుంబ కలహాలే ఎక్కువగా దోహదం చేస్తున్నాయని.. రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో 24 శాతం ఈ కారణాల వల్లే జరుగుతున్నాయని గణాంకాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో 2012లో 14,238 ఆత్మహత్యలు జరగ్గా.. గత ఏడాదికి ఆ సంఖ్య 2.6 శాతం పెరిగి 14,607కు చేరింది. 2013లో రాష్ట్రంలో 14 ఏళ్ల లోపు వయస్సున్న పసివాళ్లు కూడా 149 మంది బలవన్మరణానికి పాల్పడటం ఆందోళన కలిగించే అంశం. ఆత్మహత్యలకు సంబంధించి 2011లో 11.1 శాతం వాటాతో నాలుగో స్థానంలో ఉన్న రాష్ట్రం 2013 నాటికి మూడో స్థానానికి ఎగబాకింది. కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడిన ఉదంతాలకు సంబంధించి రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది. విజయవాడ, విశాఖపట్నంలలో చోటు చేసుకున్న బలవన్మరణాల్లో ఆర్థిక పరిస్థితుల్లో ఒక్కసారిగా మార్పు రావడంతో జరిగిన ఉదంతాలే ఎక్కువ.వివాహం కావట్లేదనే కారణంతో ఉమ్మడి రాష్ట్రంలో 134 మంది (56 మంది యువకులు, 78 మంది యువతులు), సంతానం కలగట్లేదనే ఉద్దేశంతో 105 మంది (38 మంది పురుషులు, 67 మంది మహిళలు) బలవన్మరణానికి పాల్పడ్డారు. దీర్ఘకాలిక, నివారణ సాధ్యం కాని రోగాల కారణంగా మరో 210 మంది ఆత్మహత్య చేసుకోగా.. వీరిలోనూ మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉన్నారు.రాష్ట్రంలో జరిగిన మొత్తం ఆత్మహత్యల్లో 0.7 శాతం మాత్రమే వరకట్న వేధింపుల వల్ల జరిగాయి. మాదకద్రవ్యాలకు బానిసై 282 మంది, పరీక్ష తప్పామనే కారణంగా మరో 235 మంది బలవన్మరణాలకు ఒడిగట్టారు. -
సద్విమర్శను స్వీకరిస్తేనే స్వర్గానికి సోపానం
తెలిసో, తెలియకో యాదృచ్ఛికంగా ఏదైనా పొరపాటు దొర్లిపోతే వెంటనే సరిదిద్దుకోవాలి. పశ్చాత్తాపం, క్షమాపణ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ఎందుంకటే, ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఆచరణకు అవకాశాలు ఎప్పుడు మూసుకుపోతాయో ఎవరికీ తెలియదు. రానున్న క్షణం మనుగడకు హామీనిస్తుందో, మృత్యువునే వెంట తెస్తుందో మనకు తెలియదు. మనిషి ఎంత బలవంతుడో, అంత బలహీనుడు కూడా! అతని ద్వారా ఏదో ఒక తప్పు జరిగిపోతూనే ఉంటుంది. పొరపాటునో, గ్రహపాటునో ఏదో ఒక తప్పిదం దొర్లిపోవడం మానవ సహజం. మానవమాత్రులెవరూ దీనికి అతీతులు కాదు. అయితే, కావాలని కాకుండా కాకతాళీయంగా జరిగే చిన్న చిన్న తప్పుల్ని అల్లాహ్ క్షమిస్తాడు. కాని తెలిసీ, కావాలని బుద్ధిపూర్వకంగా మాటిమాటికీ చేసే పాపాలను మాత్రం క్షమించడు. కొంతమంది తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడి, దాన్ని సరిదిద్దుకుంటే, మరికొంతమంది తప్పును అసలే అంగీకరించరు. ఒక తప్పును సమర్థించుకోవడానికి మళ్లీ మళ్లీ తప్పులు చేస్తారు. ఎవరైనా తప్పును తమ దృష్టికి తీసుకు వస్తే దాన్ని కప్పి పుచ్చుకోవడానికి వితండవాదం చేస్తారు తప్ప, తమ తప్పును సంస్కరించుకోవడానికి సుతరామూ ప్రయత్నించరు. కొద్దిమంది మాత్రమే విమర్శను స్వీకరించి సరిదిద్దుకుంటారు. సద్విమర్శను స్వీకరించడం వల్ల తప్పును తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. తద్వారా మళ్లీ ఆ తప్పు పునరావృతం కాకుండా చూసుకునే వీలు కలుగుతుంది. ఈ విధంగా తప్పును ఒప్పుకుని, పశ్చాత్తాప పడేవారు నిజమైన విశ్వాసులు. ఇలాంటి వారిని గురించి పవిత్ర ఖురాన్ ఇలా అంటోంది... వారివల్ల ఏదైనా నీతిమాలిన పనిగాని, పాపకార్యంగాని, జరిగిపోతే, వెంటనే వారు అల్లాహ్‌ను స్మరించి క్షమాపణ వేడుకుంటారు. అంతేగాని తాము చేసిన దానిపై వారు మంకుపట్టు పట్టరు. (3-135). పవిత్ర ఖురాన్లో మరోచోట ఇలా ఉంది. ‘‘దైవభీతిపరుల మదిలో ఎప్పుడైనా షైతాన్ ప్రేరణ వల్ల దురాలోచన జనిస్తే వెంటనే వారు అప్రమత్తులైపోతారు. ఆ తరువాత అనుసరించాల్సిన విధానం ఏమిటో వారికి స్పష్టంగా తెలిసిపోతుంది (7-201). ‘‘మీరు దైవాన్ని క్షమాపణ కోరుకుని ఆయన వైపు మరలండి. నిస్సందేహంగా మీ ప్రభువు అమిత దయాళువు. ఆయనకు తన దాసుల పట్ల అపారమైన ప్రేమానురాగాలు ఉన్నాయి’’ (11-90)మరొకచోట ఇలా ఉంది: ‘‘ఆత్మలకు అన్యాయం చేసుకున్న నా దాసులారా! దైవకారుణ్యం పట్ల నిరాశ చెందకండి. దైవం తప్పకుండా మీ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. ఆయన గొప్ప క్షమాశీలి, అమిత దదాళువు. కనుక మీపై దైవశిక్షవచ్చి, మీకు ఎలాంటి సహాయం లభించని స్థితి రాకుముందే పశ్చాత్తాపంతో మీ ప్రభువు వైపు మరలండి. ఆయనకు పూర్తిగా విధేయులైపొండి (39-54).జ పవిత్ర ఖురాన్‌లోని ఈ దివ్య వాక్యాల ద్వారా మనకు తెలిసేదేమంటే, సాధ్యమైనంత వరకూ ఏ చిన్న తప్పూ జరగకుండా ఉండటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేయాలి. ఒకవేళ తెలిసో, తెలియకో యాదృచ్ఛికంగా ఏదైనా పొరపాటు దొర్లిపోతే వెంటనే సరిదిద్దుకోవాలి. పశ్చాత్తాపం, క్షమాపణ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే, ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఆచరణకు అవకాశాలు ఎప్పుడు మూసుకుపోతాయో ఎవరికీ తెలియదు. రానున్న క్షణం మనుగడకు హామీనిస్తుందో, మృత్యువునే వెంట తెస్తుందో మనకు తెలియదు. అందుకని, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లుగా, శ్వాస ఉండగానే ఆశతో సాగిలపడి దైవకారుణ్యాన్ని అన్వేషించాలి. జరిగిన తప్పుల పట్ల మనస్పూర్తిగా పశ్చాత్తాప పడాలి. సిగ్గుపడాలి. ఇకముందు అలాంటివి జరగని విధంగా దృఢనిర్ణయం తీసుకుని, దానిపై స్థిరంగా ఉండాలి. భావిజీవితాన్ని సంస్కరించుకుంటూ, అడుగడుగునా సింహావలోకనం చేసుకుంటూ, సాధ్యమైనంత మేర సత్కార్యాల్లో లీనమవ్వాలి. దైవకారుణ్యంపట్ల సదా ఆశ కలిగి ఉండాలి. ఈవిధంగా మనసా, వాచా, కర్మణా, ఆశావహ దృక్పథంతో, ధర్మబద్ధమైన జీవితం గడిపితే ఇహలోకంలోనూ, పరలోకంలోనూ దైవప్రసన్నత పొంది, శాశ్వత అమర సుఖాలకు పాత్రులు కావచ్చు. - యండీ ఉస్మాన్ ఖాన్