బడ్జెట్ ముందు నష్టాల్లో పయనం
Published Tue, Jan 31 2017 9:46 AM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM
ముంబై : బడ్జెట్ గడియలు ప్రారంభం కాబోతున్న తరుణంలో మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో 93 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ మరింత నష్టాల దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం 137.09 పాయింట్ల నష్టంలో 27,712 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం 47.10 పాయింట్లు దిగజారి 8585గా ట్రేడవుతోంది. ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, లుపిన్, హెచ్యూఎల్లు టాప్ గెయినర్లుగా ఉండగా... గెయిల్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటోలు నష్టాలు గడిస్తున్నాయి.
2017కు సంబంధించిన ఆర్థిక సర్వేను ప్రభుత్వం నేడు పార్లమెంట్ ముందుకు తీసుకురాబోతుంది. ఈ నేపథ్యంలో ఎకనామిక్ గ్రోత్పై ఎలాంటి అంచనాలు వెలువడతాయోనని విశ్లేషకులు, పెట్టుబడిదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ స్కీమ్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని పలువురు అంచనావేస్తున్నారు. గ్రామీణ మౌలిక సదుపాయాలు, తాగు, సాగు నీరు, సామాజిక సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఎక్కువగా వెచ్చించనుందని ఇప్పటికే పలు సంకేతాలు వెలువడ్డాయి. మంగళవారం ప్రారంభ ట్రేడింగ్లో అటు డాలర్తో రూపాయి మారకం విలువ 11 పైసలు పెరిగి 67.84 వద్ద నమోదైంది. మరోవైపు బంగారం ధరలు 158 రూపాయలు పుంజుకుని 28,511వద్ద ట్రేడవుతున్నాయి.
Advertisement