ముంబై: డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ రూపాయి ఒక్కసారిగా బలహీనపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి 18 పైసలు నీరసించి 66.88ను తాకింది. ప్రస్తుతం కాస్త కోలుకుని 0.12 పైసల(0.22 శాతం) నష్టంతో 66.83 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకులు, దిగుమతిదారులు డాలర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం వంటి అంశాలు రూపాయిని బలహీనపరచినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఫెడ్ వడ్డీరేట్టు పెరగనున్నాయనే అంచనాలతో ఆసియన్ మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. రియల్టీ, సావరీన్ గోల్డ్ బాండ్స్ నష్టాల్లో ఉండగా, డాలర్‌విలువ పుంజుకుంది.
విదేశీ ఫెడరల్ రిజర్వ్ ఈ నెల తరువాత వడ్డీ రేట్లు పెంచుతుందున్న అంచనాలతో ఇతర కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ బలం రూపాయి సెంటిమెంట్ కూడా బలహీనపర్చిందని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఈక్విటీ మార్కెట్లు నష్టాలుకూడా ప్రభావితం చేస్తున్నట్టు చెప్పారు.
కాగా, గురువారం డాలరుతో మారకంలో రూపాయి 12 పైసలు బలపడి 66.70 వద్ద ముగిసింది. అటు ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో వరుసగా రెండు రోజు కూడా దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల వైపు మళ్లాయి. మరోవైపు అమెరికా స్టాక్ మార్కెట్లలో గురువారం భారీ నష్టాల్లో చవిచూస్తున్నాయి.
రుపీకి డాలర్ దెబ్బ
Published Fri, Mar 3 2017 10:47 AM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM
Advertisement