Drag
-
పట్టపగలు బైక్‌కు తాడుతో కట్టేసి.. యువకుడిని కిలోమీటర్ ఈడ్చుకెళ్లి..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో అమానుష ఘటన వెలుగుచూసింది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ఓ యువకుడిని రోడ్డుపై విచక్షణారహితంగా లాక్కెళ్లారు. యువకుడిని తాళ్లతో కట్టేసి బైక్‌పై కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లారు. జూలై 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో స్కూటీపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు యువకుడిని తాడుతో కట్టి లాక్కెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. పట్టపగలే నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఈ దారుణం జరగడం మరింత విచారకరం. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. అయితే దుండగులు ఇలా దుర్మార్గంగా ప్రవర్తించడానికి గల కారణాలు తెలియరాలేదు. వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బరాదరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ నగర్లో ఘటన జరిగినట్లు గుర్తించారు. ఈ చర్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. నిందితులెవరైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: ‘మహాభారతంలోనూ లవ్ జిహాద్’.. కాంగ్రెస్ చీఫ్ క్షమాపణలు बरेली में दबंगों ने युवक को स्कूटी के पीछे बांधकर घसीटा ◆ सीसीटीवी में कैद हुई घटना #Bareilly | CCTV Video Bareilly #CrimeNews pic.twitter.com/NhZnCdI9lQ — News24 (@news24tvchannel) July 28, 2023 -
కారు ఆపమన్నారని..ట్రాఫిక్ పోలీసును 10 కి.మీ ఈడ్చుకెళ్లి..
ఓ వ్యక్తి డ్రగ్స్ మత్తులో బీభత్సం సృష్టించాడు. ట్రాఫిక్ పోలీసు కారు ఆపమన్న ఆపకపోగా, ఆపాలని యత్నించినందకు పోలీసునే విండోషీల్డ్‌పై ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ట్రాఫిక్ పోలీసులు ఏదో అనుమానంతో అతడి కారుని ఆపారు. ఐతే అతను డ్రగ్స్ మత్తులో కారు ఆపకుండా అలానే పోనిచ్చాడు. దీంతో ట్రాఫిక్ పోలీసు అతన్ని బైక్‌పై వెంబడించి ఆపేందుకు యత్నించాడు. ఆ క్రమంలో పోలీసు కారు విండోషీల్డ్‌పై వేలాడాడు. అయినా కూడా సదరు డ్రైవర్ ఆపకుండా అలానే నిర్లక్ష్యంగా 10 కి.మీ ఈడ్చకెళ్లాడు. చివరకు ఉరాన్ నాకా వద్ద గవాన్ ఫాటా సమీపంలో పోలీసు వాహనంతో ఆ వెళ్తున్న కారుని ఆపి నిందితుడు ఆదిత్య బెంబాడేను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ సిద్ధేశ్వర్ మాలీని కారుపై అలానే దాదాపు 10 కిలోమీటర్లు అంతే వేగంగా ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ని చంపేందుకు యత్నించినందుకుగానూ అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు పోలీసులు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Watch: High On Drugs, Man Drags Traffic Cop On Car's Windshield For 10 km In Maharashtra Read here: https://t.co/1vEbl6k80l pic.twitter.com/WDtVzq6gc5 — NDTV Videos (@ndtvvideos) April 16, 2023 (చదవండి: యూపీలో మరో వ్యక్తి కొంగ స్నేహం..ఏం జరుగుతుందో చూడాలి..) -
మార్కెట్లకు ఫెడ్ ఫీవర్
ముంబై: హిల్లరీ ఆధిక్యాన్ని కోల్పోయారన్న వార్తలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యం, ఫెడ్ ఫీవర్ నేపథ్యంలో సెన్సెక్స్ 349 పాయింట్లు పతనమై 27,527 వద్ద, నిఫ్టీ 112 పాయింట్ల నష్టంతో 8,514 వద్ద ముగిసింది. ఆరంభంనుంచీ భారీ నష్టాల్లో ట్రేడ్ అయిన మార్కెట్లు అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో చివరికి భారీ నష్టాల్లో కీలక మద్దతు స్థాయిలకు దిగువనే క్లోజ్ అయ్యాయి. దాదాపు అన్ని రంగాలు ప్రభావితం కాగా ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్ అధికంగా, రియల్టీ, ఫార్మా, ఐటీ, ఆటో నష్టపోయాయి. ఓఎన్జీసీ, టాటా మోటార్స్, బీవోబీ, భెల్, యస్‌బ్యాంక్, స్టేట్‌బ్యాంక్, ఐడియా, గ్రాసిమ్, బాష్ రెడ్ లోను ఎంఅండ్ఎం, ఇన్ఫ్రాటెల్ ఇండస్ఇండ్, హెచ్‌యూఎల్, ఎన్టీపీసీ గ్రీన్ లోనూ ట్రేడ్ అయ్యాయి. అయితే ఈ వారమంతా మార్కెట్లు బలహీనంగా కొనసాగే అవకాశాలున్నాయని మార్కట్ ఎనలిస్టులు భావిస్తున్నారు. అయితే బంగారం ధరలు మాత్రం దూకుడు మీద ఉన్నాయి. ఒక నెల గరిష్టాన్నినమోదు చేసి. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రాముల పుత్తడి 154 రూపాయల లాభంతో రూ. 30439వద్ద బలంగా ఉంది. డాలర్ మారకపు విలువలో రూపాయి 5 పైసల నష్టంతో రూ.66.77 వద్ద ఉంది. -
నిద్రస్తున్న బాలికను ఎత్తుకెళ్లిన చిరుత!
ఉదయ్ పూర్: ఇంటిపైన తల్లిదండ్రులతో కలిసి నిద్రపోతున్న 12 ఏళ్ల బాలికను ఓ చిరుతపులి ఎత్తుకు పోవడంతో రాజస్థాన్ లోని చీతర్ కా బాదల్ గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం రాత్రి తమతో పాటు కలిసి నిద్రపోయిన రవీనా తెల్లవారేసరికి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెతుకులాట ప్రారంభించారు. కొంతసేపటి తర్వాత ఇంటి వెనుక భాగంలో బాలిక శరీర భాగాలు కనిపించడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. రవీనా శరీరంపై చిరుత గోళ్లు, పంటి గాట్లు కనిపించాయి. కాగా, ఇళ్లలో నిద్రపోతున్న వారిని చిరుత ఎత్తుకుపోవడం ఈ నెలలో ఇది రెండోసారి. దీంతో కోపోద్రేకులైన గ్రామస్థులు ... అటవీ శాఖ అధికారులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. చిరుత సంచరిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలిక శరీరాన్ని పోస్టుమార్టంకు తరలించారు. గ్రామంలోకి తరచుగా చిరుతలు వస్తున్నాయని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోయారు. కాగా, పోలీసులు, అటవీ శాఖ అధికారులు చిరుత కోసం వెతుకులాటను ప్రారంభించారు. -
బైక్‌కు కట్టి వందమీటర్లు ఈడ్చుకెళ్లారు
-
బైక్‌కు కట్టి వందమీటర్లు ఈడ్చుకెళ్లారు
పిలిభిత్: దేశంలో జర్నలిస్టులపై దాడులు ఎక్కువవుతున్నాయి. తమ అరాచకాలను బయటపెడుతున్న విలేకరులకు రక్షణ లేకుండా పోతోంది. డబ్బు అధికార బలం అండచూసుకుని రెచ్చిపోతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో పిలిభిత్ జిల్లాలో ఓ జర్నలిస్టును పిలిచిమరీ దారుణంగా కొట్టారు. బైక్‌కు తాడుతో కట్టి 100 మీటర్లు ఈడ్చుకెళ్లారు. అచ్చం సినిమాల్లో రౌడీల మాదిరిగా వారు ఈ ఘటనకు పాల్పడ్డారు. దీంతో బాధితుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం హైదర్ ఖాన్ అనే విలేకరి సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఆనంద్ అనే వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నాడు. ఓ దొంగతనానికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని అతడిని రక్షించేందుకు రావాలని ఫోన్ లో కోరాడు. దీంతో అతడు ఒక్కసారిగా అక్కడికి వెళ్లడంతో నలుగురుకు పైగా అతడిపై దాడి చేసి కారులోంచి బయటకు లాగి.. బైక్ కట్టి వంద మీటర్లు ఈడ్చుకెళ్లారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మేరకు నలుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గతంలో ఇదే జిల్లాలో జగేంద్ర సింగ్ అనే జర్నలిస్టుకు నిప్పు పెట్టిన విషయం తెలిసిందే.