కారు ఆపమన్నారని..ట్రాఫిక్‌ పోలీసును 10 కి.మీ ఈడ్చుకెళ్లి.. | Man Drags Traffic Cop On Cars Windshield For 10 km In Maharashtra | Sakshi
Sakshi News home page

కారు ఆపమన్నారని..ట్రాఫిక్‌ పోలీసును 10 కి.మీ ఈడ్చుకెళ్లి..

Published Sun, Apr 16 2023 6:04 PM | Last Updated on Sun, Apr 16 2023 8:00 PM

Man Drags Traffic Cop On Cars Windshield For 10 km In Maharashtra - Sakshi

ఓ వ్యక్తి డ్రగ్స్‌ మత్తులో బీభత్సం సృష్టించాడు. ట్రాఫిక్‌ పోలీసు కారు ఆపమన్న ఆపకపోగా, ఆపాలని యత్నించినందకు పోలీసునే విండోషీల్డ్‌పై ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ట్రాఫిక్‌ పోలీసులు ఏదో అనుమానంతో అతడి కారుని ఆపారు.

ఐతే అతను డ్రగ్స్‌ మత్తులో కారు ఆపకుండా అలానే పోనిచ్చాడు. దీంతో ట్రాఫిక్‌ పోలీసు అతన్ని బైక్‌పై వెంబడించి ఆపేందుకు యత్నించాడు. ఆ క్రమంలో పోలీసు కారు విండోషీల్డ్‌పై వేలాడాడు. అయినా కూడా సదరు డ్రైవర్‌ ఆపకుండా అలానే నిర్లక్ష్యంగా 10 కి.మీ ఈడ్చకెళ్లాడు. చివరకు ఉరాన్‌ నాకా వద్ద గవాన్‌ ఫాటా సమీపంలో పోలీసు వాహనంతో ఆ వెళ్తున్న కారుని ఆపి నిందితుడు ఆదిత్య బెంబాడేను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

నిందితుడు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సిద్ధేశ్వర్‌ మాలీని కారుపై అలానే దాదాపు 10 కిలోమీటర్లు అంతే వేగంగా ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ని చంపేందుకు యత్నించినందుకుగానూ అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు పోలీసులు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.  

(చదవండి: యూపీలో మరో వ్యక్తి కొంగ స్నేహం..ఏం జరుగుతుందో చూడాలి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement