windshield crack
-
Vande Bharat: వడగళ్లు, పిడుగుపడి దెబ్బతిన్న వందేభారత్
భువనేశ్వర్: దేశంలో అత్యంత వేగంగా పేరున్న సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్. అయితే ఈ రైలు నాణ్యత విషయంలోనే పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాలు అందుకు కారణం. తాజాగా.. వడగండ్ల వానకు, పిడుగుపడి ఓ వందేభారత్ రైలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఒడిషాలో ఈమధ్యే ప్రారంభమైన పూరీ-హౌరా వందేభారత్ ఎక్స్‌ప్రెస్(22896) ఆదివారం మధ్యాహ్నం ముందు భాగం దెబ్బతింది. భద్రాక్ రైల్వే స్టేషన్‌కు 30 కిలోమీటర్ల దూరంలో.. పిడుగుపడి డ్రైవర్ క్యాబిన్ విండ్‌స్క్రీన్, సైడ్ విండోలు పగుళ్లు వచ్చాయి. అయితే ఎవరికీ ఏం కాలేదు. అలాగే వడగండ్ల వాన కురిసి.. పలు కోచ్‌ల సైడ్ విండోలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇదేకాదు.. ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ వైర్ తెగిపోవడంతో వైతరణి రోడ్డు రైల్వే బ్రిడ్జి వద్ద రెండు గంటలపాటు రైలు ఆగిపోయింది. రైలులో పవర్ సప్లై నిలిచిపోవడంతో చాలామంది ప్రయాణికులు.. సామాజిక మాధ్యమాల్లో ఆ ఫొటోలు, వీడియోలు పోస్టు చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక.. ఓ డీజిల్ ఇంజిన్‌ను పంపించి రైలును అక్కడి నుంచి తరలించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మరమ్మత్తుల నేపథ్యంలో.. ఇవాళ(సోమవారం) రైలును రద్దు చేశారు. ఒడిషా పూరీ నుంచి పశ్చిమ బెంగాల్ హౌరాను కనెక్ట్ చేస్తూ ఈ రైలును ప్రధాని మోదీ వర్చువల్‌గా గత గురువారం ప్రారంభించారు. వచ్చే నెల ముగింపు లోపు దేశంలోని అన్ని రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ వందేభారత్ రైళ్లను ప్రారంభించే యోచనలో ఉంది భారత రైల్వేస్. Odisha | Puri-Howrah Vande Bharat Express halted between Dulakhapatna-Manjuri Road Station after the overhead wire was damaged due to thunderstorms and lightning. Purna Chandra Shahu, Station Manager, Bhadrak said, "Front glass and side windows of the driver cabin were damaged… pic.twitter.com/bhuAIGQFiI — ANI (@ANI) May 21, 2023 -
కారు ఆపమన్నారని..ట్రాఫిక్ పోలీసును 10 కి.మీ ఈడ్చుకెళ్లి..
ఓ వ్యక్తి డ్రగ్స్ మత్తులో బీభత్సం సృష్టించాడు. ట్రాఫిక్ పోలీసు కారు ఆపమన్న ఆపకపోగా, ఆపాలని యత్నించినందకు పోలీసునే విండోషీల్డ్‌పై ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ట్రాఫిక్ పోలీసులు ఏదో అనుమానంతో అతడి కారుని ఆపారు. ఐతే అతను డ్రగ్స్ మత్తులో కారు ఆపకుండా అలానే పోనిచ్చాడు. దీంతో ట్రాఫిక్ పోలీసు అతన్ని బైక్‌పై వెంబడించి ఆపేందుకు యత్నించాడు. ఆ క్రమంలో పోలీసు కారు విండోషీల్డ్‌పై వేలాడాడు. అయినా కూడా సదరు డ్రైవర్ ఆపకుండా అలానే నిర్లక్ష్యంగా 10 కి.మీ ఈడ్చకెళ్లాడు. చివరకు ఉరాన్ నాకా వద్ద గవాన్ ఫాటా సమీపంలో పోలీసు వాహనంతో ఆ వెళ్తున్న కారుని ఆపి నిందితుడు ఆదిత్య బెంబాడేను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ సిద్ధేశ్వర్ మాలీని కారుపై అలానే దాదాపు 10 కిలోమీటర్లు అంతే వేగంగా ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ని చంపేందుకు యత్నించినందుకుగానూ అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు పోలీసులు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Watch: High On Drugs, Man Drags Traffic Cop On Car's Windshield For 10 km In Maharashtra Read here: https://t.co/1vEbl6k80l pic.twitter.com/WDtVzq6gc5 — NDTV Videos (@ndtvvideos) April 16, 2023 (చదవండి: యూపీలో మరో వ్యక్తి కొంగ స్నేహం..ఏం జరుగుతుందో చూడాలి..) -
విమానం గాల్లో ఉండగా విండ్‌షీల్డ్‌కు పగుళ్లు..కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
కోల్‌కతా: సౌదీ అరేబియాకు చెందిన కార్గో విమానం కోల్‌కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం గాల్లో ఉండగా.. విండ్ షీల్డ్‌కు పగుళ్లు రావడంతో పైలట్ ఎమెర్జెన్సీ ల్యాండింగ్ కోసం విజ్ఞప్తి చేశాడు. దీంతో విమానాశ్రయంలో అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అనంతరం విమానం సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఇటీవలే బెంగళూరు నుంచి అబుదాబి వెళ్తున్న ఎటిహాద్ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తి కాసేపటికే తిరిగి బెంగళూరు విమానాశ్రాయానికి వచ్చింది. ల్యాండింగ్ అనంతరం ఫ్లైట్‌ను పరిశీలించారు. ఆ తర్వాత విమానం తిరగి బయల్దేరి గమ్యస్థానాన్ని చేరుకుంది. ఏప్రిల్ 1న ఢిల్లీ ఇంధిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కూడా ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. దుబాయ్‌కు చెందిన ఫెడ్ఎక్స్ విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో ఫ్లైట్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. చదవండి: ఢిల్లీ లిక్కర్ కేసు: సీబీఐ సమన్లపై సీఎం కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్ -
గో ఫస్ట్ విమానానికి తప్పిన పెనుముప్పు.. రెండు రోజుల్లో మూడోసారి
సాక్షి, ఢిల్లీ: గో ఫస్ట్ విమానానికి పెను ముప్పు తప్పింది. బుధవారం.. ఢిల్లీ నుంచి గౌహతి వెళ్తుండగా విమానం విండ్ షీల్డ్ పగిలింది. దీంతో విమానాన్ని జైపూర్‌కు మళ్లించినట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. రెండు రోజుల్లో గో ఫస్ట్ విమానంలో సాంకేతిక లోపం సంభవించడం ఇది మూడోసారి. చదవండి: సైకో భర్త చిత్రహింసలు.. భార్యకు అశ్లీల వీడియోలు చూపిస్తూ.. ఇటీవలి కాలంలో విమానాల్లో సాంకేతిక లోపాలు వరుసగా తలెత్తుతున్నాయి. మంగళవారం కూడా విమానయాన సంస్థ గోఫస్ట్‌కు చెందిన రెండు విమానాల్లో ఒకేసారి ఇంజన్ సమస్యలు కలకలం రేపింది. శ్రీనగర్-ఢిల్లీ, ముంబై-లేహ్ గోఫస్ట్ విమానాల్లో ఇంజన్లలో సమస్య ఏర్పడ్డాయి దీంతో రెండు విమానాలను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీనిపై సివిల్ ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ విచారణ చేపట్టింది. -
‘అదృష్టం.. ఈ రోజు ముందు సీట్లో కూర్చోలేదు’
ముంబై: అదృష్టం అంటే ఈ ముంబై ఫ్యాషన్ డిజైనర్‌దే. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. నిజంగానే అదృష్టం కాకపోతే.. మెట్రో స్టేషన్ మీద నుంచి పది మీటర్ల రాడ్డు క్యాబ్ మీద పడటం.. అది కూడా డ్రైవర్ పక్కన ఉన్న ఖాళీ సీట్లో పడటం ఏంటి. దాంతో తాను లేచిన వేళ చాలా మంచిదైంది అనుకుంటున్నారు రింకు జైన్. వివరాలు.. గోరేగావ్‌కు చెందిన రింకు జైన్ ఫ్యాషన్ డిజైనర్. ఈ క్రమంలో పట్టణంలో ఓ బొటిక్ నిర్వహిస్తున్నారు రింకు. ఈ నేపథ్యంలో బుధవారం తన షాప్ వద్దకు వెళ్లడానికి ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకున్నారు. ముంబై వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలో జోగేశ్వరి ప్లైఓవర్ కిందుగా క్యాబ్ ప్రయాణం చేస్తుండగా.. 10 మీటర్ల పొడవైన రాడ్ వచ్చి రింకు ప్రయాణిస్తున్న క్యాబ్ మీద పడింది. ఆ రాడ్ కాస్త డ్రైవర్ పక్కన ఖాళీగా ఉన్న సీట్లో పడింది. ఆ సమయంలో రింకు, ఆమె స్నేహితురాలు వెనక ప్యాసింజర్ సీట్లో కూర్చోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయం గురించి రింకు మాట్లాడుతూ.. ‘నాకు ముందు సీట్లో కూర్చోనే అలవాటు. కానీ ఈ సారి లగేజ్ ఎక్కువ ఉండటంతో దాన్ని డ్రైవర్ పక్క సీట్లో పెట్టి.. నేను, నా ఫ్రెండ్ వెనక ప్యాసింజర్ సీట్లో కూర్చున్నాం. ప్లైఓవర్ కిందకు రాగానే మేం ప్రయాణిస్తున్న క్యాబ్ మీద రాడ్ పడింది. ఈ సంఘటనతో మేం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాము. ఇప్పటికి కూడా ఆ భయం నుంచి కోలుకోలేదు’ అని తెలిపారు. -
ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు, విమానసిబ్బంది!
కోల్ కతా: గాల్లో ప్రయాణిస్తుండగానే విండ్ షీల్డ్ పగిలిపోవడంతో రాయల్ భూటాన్ ఎయిర్ లైన్ విమానాన్ని అత్యవసరంగా కోల్ కతాలోని ఎన్ఎస్సీ బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దించివేశారు. పారో నుంచి ముంబైకి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తడంతో అత్యవరస ల్యాండింగ్ కు కెప్టెన్ ఏటీసీ అనుమతిని కోరాడు. ఏటీసీ అనుమతి లభించడంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన ఉదయం 9.30 గంటలకు జరిగింది. ఈ ఘటనలో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.