కోల్‌కతా: సౌదీ అరేబియాకు చెందిన కార్గో విమానం కోల్‌కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం గాల్లో ఉండగా.. విండ్ షీల్డ్‌కు పగుళ్లు రావడంతో పైలట్ ఎమెర్జెన్సీ ల్యాండింగ్ కోసం విజ్ఞప్తి చేశాడు. దీంతో విమానాశ్రయంలో అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అనంతరం విమానం సేఫ్‌గా ల్యాండ్ అయింది.
ఇటీవలే బెంగళూరు నుంచి అబుదాబి వెళ్తున్న ఎటిహాద్ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తి కాసేపటికే తిరిగి బెంగళూరు విమానాశ్రాయానికి వచ్చింది. ల్యాండింగ్ అనంతరం ఫ్లైట్‌ను పరిశీలించారు. ఆ తర్వాత విమానం తిరగి బయల్దేరి గమ్యస్థానాన్ని చేరుకుంది.
ఏప్రిల్ 1న ఢిల్లీ ఇంధిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కూడా ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. దుబాయ్‌కు చెందిన ఫెడ్ఎక్స్ విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో ఫ్లైట్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
చదవండి: ఢిల్లీ లిక్కర్ కేసు: సీబీఐ సమన్లపై సీఎం కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment