
సాక్షి, ఢిల్లీ: గో ఫస్ట్ విమానానికి పెను ముప్పు తప్పింది. బుధవారం.. ఢిల్లీ నుంచి గౌహతి వెళ్తుండగా విమానం విండ్ షీల్డ్ పగిలింది. దీంతో విమానాన్ని జైపూర్‌కు మళ్లించినట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. రెండు రోజుల్లో గో ఫస్ట్ విమానంలో సాంకేతిక లోపం సంభవించడం ఇది మూడోసారి.
చదవండి: సైకో భర్త చిత్రహింసలు.. భార్యకు అశ్లీల వీడియోలు చూపిస్తూ..
ఇటీవలి కాలంలో విమానాల్లో సాంకేతిక లోపాలు వరుసగా తలెత్తుతున్నాయి. మంగళవారం కూడా విమానయాన సంస్థ గోఫస్ట్‌కు చెందిన రెండు విమానాల్లో ఒకేసారి ఇంజన్ సమస్యలు కలకలం రేపింది. శ్రీనగర్-ఢిల్లీ, ముంబై-లేహ్ గోఫస్ట్ విమానాల్లో ఇంజన్లలో సమస్య ఏర్పడ్డాయి దీంతో రెండు విమానాలను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీనిపై సివిల్ ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ విచారణ చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment