Go First
-
గో ఫస్ట్ కోసం స్పైస్‌జెట్
న్యూఢిల్లీ: దివాలా తీసిన గో ఫస్ట్ విమానయాన సంస్థను దక్కించుకునేందుకు బిడ్లు దాఖలయ్యాయి. బిజీ బీ ఎయిర్‌వేస్‌తో కలిసి స్పైస్‌జెట్ చీఫ్ అజయ్ సింగ్ బిడ్ వేశారు. స్పైస్‌జెట్ వ్యయాలు తగ్గించుకునేందుకు, నిధుల సమీకరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో అజయ్ సింగ్.. గో ఫస్ట్ కోసం పోటీ పడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన వ్యక్తిగత హోదాలో బిడ్డింగ్‌లో పాల్గొంటున్నట్లు స్పైస్‌జెట్ తెలిపింది. మరోవైపు, షార్జాకి చెందిన స్కై వన్ ఎఫ్జెడ్ఈ తాము కూడా బిడ్ వేసినట్లు వెల్లడించింది. -
గో ఫస్ట్‌కు ఎన్సీఎల్టీలో ఊరట
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ గో ఫస్ట్‌కి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో (ఎన్సీఎల్టీ) కొంత ఊరట లభించింది. కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియను (సీఐఆర్‌పీ) ముగించేందుకు గడువును ఎన్సీఎల్టీ మరో 60 రోజుల పాటు పెంచింది. పరిష్కార నిపుణుడు (ఆర్పీ) దివాకర్ మహేశ్వరి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. గో ఫస్ట్‌పై మూడు సంస్థలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు, ధరావత్తును కూడా డిపాజిట్ చేసినట్లు మహేశ్వరి తెలిపారు. దేశీ విమానయాన సంస్థ స్పైస్‌జెట్, షార్జాకి చెందిన స్కై వన్, ఆఫ్రికన్ సంస్థ సాఫ్రిక్ ఇన్వెస్ట్మెంట్స్ వీటిలో ఉన్నాయి. ఇవి త్వరలోనే తమ ప్రణాళికలను సమర్పించే అవకాశం ఉందని మహేశ్వరి పేర్కొన్నారు. గో ఫస్ట్ గతేడాది మే 3 నుంచి కార్యకలాపాలు నిలిపివేసింది. స్వచ్ఛందంగా దివాలా పరిష్కార ప్రక్రియ చేపట్టాలని కోరుతూ మే 10న ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. గో ఫస్ట్ దివాలా పరిష్కార ప్రక్రియ డెడ్‌లైన్‌ను ఎన్సీఎల్టీ పొడిగించడం ఇది రెండోసారి. గతేడాది నవంబర్ 23న 90 రోజుల పాటు పొడిగించగా.. ఆ డెడ్‌లైన్ ఫిబ్రవరి 4తో ముగిసింది. దివాలా కోడ్ కింద సీఐఆర్‌పీని గరిష్టంగా 330 రోజుల్లోగా పూర్తి చేయాలి. -
దివాలా తీసిన ‘గో ఫస్ట్’పై 3 కంపెనీల కన్ను!
న్యూఢిల్లీ: దివాలా తీసిన గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌ను కొనుగోలు చేయడానికి మూడు సంస్థలు పోటీపడుతున్నాయి. దేశీ విమానయాన సంస్థ స్పైస్‌జెట్, షార్జాకి చెందిన ఏవియేషన్ కంపెనీ స్కై వన్, ఆఫ్రికా కేంద్రంగా పని చేసే సాఫ్రిక్ ఇన్వెస్ట్మెంట్స్ వీటిలో ఉన్నాయి. గో ఫస్ట్ కొనుగోలుపై ఆసక్తిగా ఉన్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు స్పైస్‌జెట్ తెలియజేసింది. మదింపు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత త్వరలోనే తమ ఆఫర్ ప్రకటించే యోచనలో ఉన్నట్లు వివరించింది. మదింపు ప్రక్రియను చేపట్టేందుకు గత పది రోజులుగా ఈ మూడు సంస్థల నుంచి దివాలా పరిష్కార నిపుణుడు (ఆర్పీ) శైలేంద్ర అజ్మీరాకు అభ్యర్ధనలు వచి్చనట్లు తెలుస్తోంది. వాస్తవానికి గో ఫస్ట్ కొనుగోలు కోసం బిడ్లు దాఖలు చేసేందుకు గడువు నవంబర్ 22తో ముగిసింది. అయితే, గడువు లోపల స్పందించని కంపెనీలు.. ఆ తర్వాత ఆసక్తి వ్యక్తం చేయడం గమనార్హం. తాజా పరిస్థితుల నేపథ్యంలో బిడ్డింగ్ డెడ్‌లైన్‌ను మరికొంత కాలం పొడిగించాలని బిడ్డర్లు కోరినట్లు సమాచారం. దీనిపై రుణదాతల కమిటీ (సీఓసీ) నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్ మే 3 నుంచి కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు 270 మిలియన్ డాలర్లను సమీకరించుకునే ప్రయత్నాల్లో ఉంది. -
గో ఫస్ట్ లిక్విడేషన్ ప్రణాళికలు!
ముంబై: ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న దేశీ విమానయాన కంపెనీ గో ఫస్ట్ లిక్విడేషన్ ప్రక్రియ ఊపందుకోనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ లిక్విడేషన్ ప్రతిపాదనకు ఈ వారంలో రుణదాతలు అనుకూలంగా ఓటింగ్ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రముఖ పారిశ్రామివేత్త నస్లీ వాడియా ప్రమోట్ చేసిన కంపెనీ రుణ సంక్షోభాన్ని పరిష్కరించుకోవడంలో పలుమార్లు విఫలమైంది. కంపెనీ రుణదాతలకు రూ. 6,521 కోట్లవరకూ చెల్లించవలసి ఉంది. రుణదాతలలో బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాయిష్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ ఉన్నాయి. వీటిలో సెంట్రల్ బ్యాంక్‌కు అత్యధికంగా రూ. 1,987 కోట్లు బకాయిపడి ఉంది. ఈ బాటలో బీవోబీకి రూ. 1,430 కోట్లు, డాయిష్ బ్యాంక్‌కు రూ. 1,320 కోట్లు చొప్పున రుణాలు చెల్లించవలసి ఉన్నట్లు తెలుస్తోంది. రుణదాతల కమిటీ(సీవోసీ) కంపెనీ ఆస్తుల విలువను రూ. 3,000 కోట్లుగా మదింపు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దివాలా చట్టం(ఐబీసీ)లో భాగంగా 270 రోజులలోగా కేసులను పూర్తి చేయవలసి ఉంది. దీంతో త్వరలోనే కంపెనీ లిక్విడేషన్‌కు తెరలేవనున్నట్లు తెలుస్తోంది. అయితే కస్టమర్లు, ట్రావెల్ ఏజెంట్లు, బ్యాంకులు తదితర రుణదాతలకు నిధులను సర్దుబాటు చేయవలసి ఉంటుంది. రేసులో జిందాల్ గో ఫస్ట్ విమానాలను కొనుగోలు చేయకుండా సేల్, లీజ్‌బ్యాక్ పద్ధతిలో కార్యకలాపాల నిర్వహణ చేపట్టడంతో కంపెనీ కొనుగోలుకి ఆసక్తి వ్యక్తం కాకపోవచ్చని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. కంపెనీ కీలక ఆస్తులలో థానేలోని 94 ఎకరాల భూమిని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఈ భూమిని వాడియా బ్యాంకులకు కొలేటరల్‌గా ఉంచారు. ఈ భూమి విలువను రూ. 3,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దీనికితోడు ముంబైలోని ఎయిర్‌బస్ శిక్షణా కేంద్రం, ప్రధాన కార్యాలయాలను అదనపు ఆస్తులుగా పరిగణిస్తున్నాయి. గో ఫస్ట్ కొనుగోలుకి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేసినప్పటికీ(ఈవోఐ).. జిందాల్ పవర్ మాత్రమే రుణదాతల కమిటీ పరిశీలనలో నిలిచినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. బ్యాంకులకుకాకుండా విమాన సరఫరాదారులకు రూ. 2,000 కోట్లు, వెండార్లకు రూ. 1,000 కోట్లు, ట్రావెల్ ఏజెంట్లకు రూ. 600 కోట్లు, కస్టమర్లకు రూ. 500 కోట్లు చొప్పున బకాయి ఉన్నట్లు తెలియజేశాయి. కేంద్రం నుంచి ఎమర్జెన్సీ క్రెడిట్ పథకం కింద మరో రూ. 1,292 కోట్ల రుణం పొందినట్లు వెల్లడించాయి. వెరసి గో ఫస్ట్ మొత్తం రూ. 11,000 కోట్ల రుణ భారాన్ని మోస్తున్నట్లు చెబుతున్నాయి. 2023 మే 2న కార్యకలాపాలు నిలిపివేసిన కంపెనీ 8 రోజుల తదుపరి జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కు స్వచ్చంద దివాలా పిటీషన్‌ను దాఖలు చేసింది. -
గో ఫస్ట్‌కు ఎన్సీఎల్టీలో ఊరట
న్యూఢిల్లీ: స్వచ్ఛంద దివాలా ప్రకటించిన విమానయాన సంస్థ గో ఫస్ట్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఊరట లభించింది. కంపెనీకి లీజుకు ఇచి్చన విమానాలను స్వా«దీనం చేసుకునేందుకు లెస్సర్లు దాఖలు చేసిన పిటీషన్లను ఎన్సీఎల్టీ తోసిపుచి్చంది. ఏవియేషన్ రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ.. ఇంకా వాటిని డీరిజిస్టర్ చేయనందున కార్యకలాపాల పునరుద్ధరణకు అవి అందుబాటులో ఉన్నట్లుగానే పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. విమానాలు, ఇంజిన్లే గో ఫస్ట్ వ్యాపారానికి కీలకమైనవని, వాటిని తీసివేస్తే ’కంపెనీ మరణానికి’ దారి తీస్తుందని ఎన్సీఎల్టీ తెలిపింది. దీని వల్ల రుణభార సమస్య పరిష్కారానికి అవకాశమే లేకుండా పోతుందని వివరించింది. మరోవైపు తమ విమానాలు, ఇంజిన్లను తనిఖీ చేసుకునేందుకైనా అనుమతినివ్వాలంటూ లెస్సర్లు చేసిన విజ్ఞప్తిని కూడా ఎన్సీఎల్టీ తోసిపుచి్చంది. విమానాల భద్రతా ప్రమాణాలు అత్యుత్తమ స్థాయిలో ఉండేలా చూడాల్సిన బాధ్యత పరిష్కార నిపుణుడికి (ఆర్పీ) ఉంటుందని స్పష్టం చేసింది. మే 3 నుంచి గో ఫస్ట్ కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
గో ఫస్ట్ విక్రయానికి కసరత్తు
న్యూఢిల్లీ: స్వచ్ఛందంగా దివాలా ప్రకటించిన విమానయాన సంస్థ గో ఫస్ట్‌ను విక్రయించే అవకాశాలపై కసరత్తు జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహ్వానిస్తూ రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్పీ) శైలేంద్ర అజ్మీరా ప్రకటన జారీ చేశారు. ఈవోఐల దాఖలుకు ఆగస్టు 9 ఆఖరు తేది. అర్హత కలిగిన సంస్థల పేర్లను ఆగస్టు 19న ప్రకటిస్తారు. ప్రొవిజనల్ లిస్టుపై అభ్యంతరాలను తెలియజేసేందుకు ఆగస్టు 24 ఆఖరు తేది. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ల సరఫరా సమస్య కారణంగా భారీగా ఆదాయ నష్టం వాటిల్లుతోందంటూ గో ఫస్ట్ సంస్థ మే 3 నుంచి ఫ్లయట్ సర్వీసులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక సంస్థలకు, ఇతరత్రా రుణదాతలకు కంపెనీ రూ. 11,463 కోట్లు చెల్లించాల్సి ఉంది. నోటీసు ప్రకారం 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయం రూ. 4,183 కోట్లుగా నమోదు కాగా, 4,200 మంది ఉద్యోగులు ఉన్నారు. రుణదాతల కమిటీ ఆమోదించిన పునరుద్ధరణ ప్రణాళికను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు గో ఫస్ట్ గత నెలలో సమర్పించింది. డీజీసీఏ జూలై 4–6 మధ్య ప్రత్యేక సేఫ్టీ ఆడిట్ నిర్వహించింది. ఈ వారంలో నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. -
గో ఫస్ట్ నుంచి విమానాల కోసం లీజర్ల పట్టు!
న్యూఢిల్లీ: దివాలా పిటిషన్ దాఖలు చేసిన విమానయాన సంస్థ గో ఫస్ట్ నుంచి తమ విమానాలను తిరిగి పొందే విషయంలో లీజర్లు వెనక్కు తగ్గడం లేదు. ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ తమ విమానాలను డీరిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో ఇప్పటికే నిరాకరించిన డీజీసీఏను తప్పు పడుతూ ఈ నిర్ణయం ఎంతమాత్రం సమర్థనీయం కాదని తెలిపారు. దీనిపై వాదనలు విన్న జస్టిస్ తారా వితస్తా గంజు ఈ పిటిషన్ విచారణను వాదనల నిమిత్తం మే 30న లిస్ట్ చేయాలని ఆదేశించారు. ఆలోగా లిఖితపూర్వక సమాధానాలు ఇవ్వాలని ప్రతిపాదులను ఆదేశించారు. హైకోర్టును ఆశ్రయించిన లీజర్లలో ఆక్సిపిటర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎయిర్‌క్రాఫ్ట్ 2 లిమిటెడ్, ఈఓఎస్ ఏవియేషన్ 12 (ఐర్లాండ్) లిమిటెడ్, పెంబ్రోక్ ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ 11 లిమి టెడ్, ఎస్ఎంబీసీ ఏవియేషన్ క్యాపిటల్ లిమిటెడ్ ఉన్నాయి. ► ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్‌కు మే నెల 10వ తేదీన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కాస్త ఊరటనిస్తూ, కంపెనీ స్వచ్ఛందంగా దాఖలు చేసిన దివాలా పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది. ► తమ విజ్ఞప్తులను కూడా తెలుసుకున్న తర్వాతే గో ఫస్ట్ దివాలా పిటీషన్‌పై తగు నిర్ణయం తీసుకోవాలంటూ సంస్థకు విమానాలను లీజుకిచ్చిన కంపెనీల అభ్యంతరాలను ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది. దీనితో దివాలా విచారణ పూర్తయ్యే వరకూ ఇతరత్రా దావాల నుంచి గో ఫస్ట్‌కు రక్షణ లభించనట్లయ్యింది. సంక్షోభంలో పడిన వాడియా గ్రూప్ సంస్థ– గో ఫస్ట్ నుండి తమ విమానాలను వెనక్కి తీసుకునేందుకు ఎయిర్‌క్రాఫ్ట్ లీజర్లు చేసిన ప్రయత్నాలకు తక్షణం అడ్డుకట్ట పడింది. ► దీనితో ఎన్సీఎల్టీ రూలింగ్‌ను సవాలు చేస్తూ, విమాన లీజర్లు ఎస్ఎంబీసీ ఏవియేషన్ క్యాపిటల్, జీవై ఏవియేషన్, ఎస్‌ఎఫ్‌వీ ఎయిర్‌క్రాఫ్ట్ హోల్డింగ్స్, ఇంజిన్ లీజింగ్ ఫైనాన్స్ బీవీ (ఈఎల్ఎఫ్సీ) సంస్థలు.. ఎన్సీఎల్ఏటీలో అప్పీల్ చేశాయి. అయితే ఈ అప్పీళ్లను చైర్పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల అప్పిలేట్ బెంచ్ తోసిపుచ్చింది. ► దీనిని ఆయా సంస్థలు సుప్రీంలో అప్పీల్ చేయవచ్చన్న ఉద్దేశ్యంతో ఇప్పటికే గో ఫస్ట్ అత్యున్నత న్యాయస్థానంలో నాలుగు కేవియెట్లను దాఖలు చేసింది. ► గో ఫస్ట్‌కు రూ. 11,463 కోట్ల ఆర్థిక భారం ఉండగా, 7,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. మే 3వ తేదీ నుంచి గో ఫస్ట్ సేవలు నిలిచిపోయాయి. ► మరోవైపు 30 రోజుల్లో పునరుద్ధరణ ప్రణాళిక ఇవ్వాలని గో ఫస్ట్‌కు డీజీసీఏ సూచించడం మరో విషయం. గోఫస్ట్ సేవల సన్నద్ధతపై డీజీసీఏ ఆడిట్ గోఫస్ట్ సేవల పునరుద్ధరణకు అనుమతించే ముందు, సన్నద్ధతపై పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆడిట్ చేయనుంది. ఆర్థిక సంక్షోభంతో గోఫస్ట్ మే 3 నుంచి విమానయాన కార్యకలాపాలు నిలిపివేసి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముందు దివాలా పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఈ సంస్థ దివాలా పరిష్కార చర్యల పరిధిలో ఉంది. ఇలా సేవలను అర్థంతరంగా నిలిపివేయడంపై గోఫస్ట్‌కు డీజీసీఏ షోకాజు నోటీసు జారీ చేయగా.. దీనికి స్పందనగా వీలైనంత త్వరగా ఫ్లయిట్ సేవలు ప్రారంభించే ప్రణాళికపై పనిచేస్తున్నట్టు బదులిచ్చింది. ఈ విషయాన్ని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు గోఫస్ట్ కూడా తన ఉద్యోగులకు ఇదే విషయమై సమాచారం పంపింది. రానున్న రోజుల్లో మన సేవల సన్నద్ధతపై డీజీసీఏ ఆడిట్ నిర్వహిస్తుందని, నియంత్రణ సంస్థ ఆమోదం లభిస్తే వెంటనే కార్యకాలపాలు ప్రారంభిస్తామని వారికి తెలియజేసింది. కార్యకలాపాలు ప్రారంభానికంటే ముందే ఏప్రిల్ నెల వేతనాలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని సంస్థ సీఈవో భరోసా ఇచ్చారు. అలాగే, వచ్చే నెల నుంచి ప్రతీ నెలా మొదటి వారంలో వేతనాలను చెల్లించనున్నట్టు గోఫస్ట్ ఆపరేషన్స్ హెడ్ రంజింత్ రంజన్ ఉద్యోగులకు తెలిపారు. జెట్ ఎయిర్వేస్ కేసులో కన్సార్షియంకు ఊరట ఇదిలావుండగా, సేవలను నిలిపిచేసిన జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణ దిశలో అప్పీలేట్ ట్రిబ్యునల్– ఎన్సీఎల్ఏటీ కీలక రూలింగ్ ఇచ్చింది. ఎయిర్వేస్ విజేత బిడ్డర్ జలాన్ కల్రాక్ కన్సార్షియం చెల్లింపు బాధ్యతలను నెరవేర్చడానికి మరింత సమయం ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే ఇప్పటికే కన్సార్షియం అందించిన రూ. 175 కోట్ల ఫెర్మార్మెన్స్ బ్యాంక్ గ్యారెంటీని ఎన్‌క్యాష్ చేయవద్దని రుణదాతలను ఆదేశించింది. ఇప్పటికే రెండుసార్లు 2022 నవంబర్ 16, 2023 మార్చి 3వ తేదీల్లో కన్సార్షియం రుణ చెల్లింపుల కాలపరిమితిని రెండుసార్లు అప్పిలేట్ ట్రిబ్యునల్ పొడిగించింది. కేసు తదుపరి విచారణను జూలై 12కు వాయిదా వేసింది. కాగా, జెట్ ఎయిర్వేస్ కేసులో చెల్లించనున్న రూ. 150 కోట్ల పెర్ఫార్మెర్స్ బ్యాంక్ గ్యారెంటీలను ఎన్‌క్యాష్ చేయకుండా ప్రధాన రుణ దాత ఎస్బీఐని నిరోధించాలని కోరుతూ విన్నింగ్ బిడ్డర్ జలాన్ కల్రాక్ కన్సార్షియం దాఖలు చేసిన పటిషన్‌పై మే 30న ఉత్తర్వులు జారీ చేస్తామని అప్పీలేట్ ట్రిబ్యునల్ తెలిపింది. జెట్ ఎయిర్వేస్ కన్సార్షియం – రుణదాతల మధ్య కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో అప్పీలేట్ ట్రిబ్యునల్ కీలక సూచనలు చేస్తూ పరిష్కార ప్రణాళికను అమలు చేయడానికి పరస్పరం సహకరించుకోవాలని రెండు పక్షాలనూ కోరింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న జెట్ ఎయిర్వేస్ 2019 ఏప్రిల్ 18న కార్యకలాపాలను నిలిపివేసింది. క్యారియర్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ జూన్ 2019లో ప్రారంభమైంది. 2021 జూన్‌లో కన్సార్షియం సమర్పించిన పరిష్కార ప్రణాళికను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదించింది. అయితే, ప్రణాళిక ఇంకా అమలు కాలేదు. దీని ఫలితంగా క్యారియర్ భవిష్యత్తుపై అనిశ్చితి ఏర్పడింది. -
Go First bankruptcy: 30 రోజుల్లో పునరుద్ధరణ ప్రణాళిక ఇవ్వండి
న్యూఢిల్లీ: కార్యకలాపాల పునరుద్ధరణకు సంబంధించిన ప్రణాళికను 30 రోజుల్లోగా సమర్పించాలంటూ విమానయాన సంస్థ గో ఫస్ట్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సూచించింది. అందుబాటులో ఉన్న విమానాలు .. పైలట్లు ..ఇతర సిబ్బంది, నిర్వహణ ఏర్పాట్లు, నిధులు .. వర్కింగ్ క్యాపిటల్, లీజుదార్లతో ఒప్పందాలు తదితర వివరాలు అందులో పొందుపర్చాలని డీజీసీఏ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రణాళికను సమీక్షించిన తర్వాత డీజీసీఏ తగు నిర్ణయం తీసుకోవచ్చని వివరించాయి. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్ మే 2న స్వచ్ఛందంగా దివాలా పరిష్కార ప్రక్రియ చేపట్టాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా మే 3, 4 తారీఖుల్లో రద్దు చేసిన విమాన సేవలను ఆ తర్వాత మరిన్ని రోజులకు పొడిగించింది. ఈలోగా సర్వీసుల నిలిపివేతపై డీజీసీఏ షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీంతో మారటోరియం వ్యవధిని ఉపయోగించుకుని పునరుద్ధరణ ప్రణాళికను సమర్పించేందుకు సమయం ఇవ్వాలంటూ గో ఫస్ట్ తన సమాధానంలో కోరింది. మరోవైపు లీజుదార్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. గో ఫస్ట్ దివాలా పరిష్కార పిటిషన్‌ను అనుమతించాలని ఎన్సీఎల్టీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ మే 22న జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఉత్తర్వులు జారీ చేసింది. -
ఎన్సీఎల్ఏటీలో గో ఫస్ట్‌కు ఊరట
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎస్‌సీఎల్‌ఏటీ) సోమవారం సంక్షోభంలో ఉన్న ఎయిర్‌లైన్ గో ఫస్ట్‌పై దివాలా పరిష్కార ప్రక్రియను సమర్థించింది. దీనితో సంక్షోభంలో పడిన వాడియా గ్రూప్ సంస్థ– గో ఫస్ట్ నుండి తమ విమానాలను వెనక్కి తీసుకునేందుకు ఎయిర్‌క్రాఫ్ట్ లీజర్లు చేసిన ప్రయత్నాలకు తక్షణం అడ్డుకట్ట పడింది.. క్లెయిమ్‌లపై ఎన్సీఎల్టీకి వెళ్లవచ్చు... క్లెయిమ్‌లకు సంబంధించి ఎయిర్‌క్రాఫ్ట్ లీజర్లు అలాగే గో ఫస్ట్ మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఐఆర్పీ) నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎస్‌సీఎల్‌టీ)ని ఆశ్రయించాలని చైర్పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల అప్పిలేట్ బెంచ్ ఆదేశించింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్‌కు మే నెల 10వ తేదీన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కాస్త ఊరటనిస్తూ, కంపెనీ స్వచ్ఛందంగా దాఖలు చేసిన దివాలా పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది. అలాగే ఆర్థిక వ్యవహారాలు, చెల్లింపులకు సంబంధించి మారటోరియం విధించింది. మే 4న మధ్యంతర పరిష్కార నిపుణుడిగా (ఐఆర్పీ) అభిలాష్ లాల్‌ను నియమించడంతో పాటు ఏ ఉద్యోగినీ తీసివేయకూడదని ఆదేశించింది. అలాగే, రద్దయిన మేనేజ్మెంట్.. తక్షణ ఖర్చుల కోసం రూ. 5 కోట్ల మొత్తాన్ని ఐఆర్పీ వద్ద డిపాజిట్ చేయాలని సూచించింది. తమ విజ్ఞప్తులను కూడా తెలుసుకున్న తర్వాతే గో ఫస్ట్ దివాలా పిటీషన్‌పై తగు నిర్ణయం తీసుకోవాలంటూ సంస్థకు విమానాలను లీజుకిచ్చిన కంపెనీల అభ్యంతరాలను ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది. దీనితో దివాలా విచారణ పూర్తయ్యే వరకూ ఇతరత్రా దావాల నుంచి గో ఫస్ట్‌కు రక్షణ లభించనట్లయ్యింది. సంస్థ ఆస్తులను బదిలీ చేయడానికి గానీ రుణ దాతలు రికవర్ చేసుకోవడానికి గానీ ఈ ఉత్తర్వు్యలతో వీలుండదు. -
ఎన్సీఎల్ఏటీకి గో ఫస్ట్ లీజుదార్లు
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ గో ఫస్ట్ స్వచ్ఛంద దివాలా ప్రక్రియను వ్యతిరేకిస్తూ విమానాల లీజుదార్లు ఒక్కొక్కరుగా ఎన్సీఎల్ఏటీని ఆశ్రయిస్తున్నారు. ఈ విషయంలో ఎన్సీఎల్టీ ఆదేశాలను సవాలు చేస్తూ జీవై ఏవియేషన్, ఎస్‌ఎఫ్‌వీ ఎయిర్‌క్రాఫ్ట్ హోల్డింగ్ సంస్థలు.. నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో పిటీషన్ దాఖలు చేశాయి. ఎస్ఎంబీసీ ఏవియేషన్ క్యాపిటల్ ఇప్పటికే పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఐర్లాండ్‌కు చెందిన జీవై ఏవియేషన్.. గో ఫస్ట్‌కు 9 విమానాలు, ఎస్‌ఎఫ్‌వీ ఎయిర్‌క్రాఫ్ట్ హోల్డింగ్స్ ఒకటి, ఎస్ఎంబీసీ ఏవియేషన్ క్యాపిటల్ 5 విమానాలను లీజుకిచ్చాయి. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న గో ఫస్ట్ దాఖలు చేసిన స్వచ్ఛంద దివాలా పిటీషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ టీ) విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. -
గో ఫస్ట్‌కు ఎన్సీఎల్టీ ఊరట
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ గో ఫస్ట్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కాస్త ఊరటనిచ్చింది. కంపెనీ స్వచ్ఛందంగా దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. అలాగే ఆర్థిక వ్యవహారాలు, చెల్లింపులకు సంబంధించి మారటోరియం విధించింది. మే 4న ఉత్తర్వులను రిజర్వ్ చేసిన ఎన్సీఎల్టీ దాదాపు వారం రోజుల ఉత్కంఠకు తెరదించుతూ తాజాగా బుధవారం నాడు ఆదేశాలను వెలువరించింది. మధ్యంతర పరిష్కార నిపుణుడిగా (ఐఆర్పీ) అభిలాష్ లాల్‌ను నియమించడంతో పాటు ఏ ఉద్యోగినీ తీసివేయకూడదని ఆదేశించింది. అలాగే, రద్దయిన మేనేజ్మెంటు.. తక్షణ ఖర్చుల కోసం రూ. 5 కోట్ల మొత్తాన్ని ఐఆర్పీ వద్ద డిపాజిట్ చేయాలని సూచించింది. తమ విజ్ఞప్తులను కూడా తెలుసుకున్న తర్వాతే గో ఫస్ట్ దివాలా పిటీషన్‌పై తగు నిర్ణయం తీసుకోవాలంటూ సంస్థకు విమానాలను లీజుకిచ్చిన కంపెనీల అభ్యంతరాలను ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది. గో ఫస్ట్ తాను బాకీల విషయంలో డిఫాల్ట్ అయ్యానని, రుణదాతల నుంచి వచ్చిన డిమాండ్ నోటీసులను కూడా సమర్పించిందని, లీజు సంస్థలు కూడా దీన్ని ఖండించడం లేదని ద్విసభ్య ఎన్సీఎల్టీ బెంచ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో దివాలా చట్టంలోని సెక్షన్ 10 కింద కంపెనీ పిటిషన్‌ను విచారణకు స్వీకరించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని తెలిపింది. దీనితో దివాలా విచారణ పూర్తయ్యే వరకూ ఇతరత్రా దావాల నుంచి గో ఫస్ట్‌కు రక్షణ లభించనుంది. సంస్థ ఆస్తులను బదిలీ చేయడానికి గానీ రుణ దాతలు రికవరీ చేసుకోవడానికి గానీ ఉండదు. గో ఫస్ట్‌కు రూ. 11,463 కోట్ల ఆర్థిక భారం ఉండగా, 7,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. -
దివాలా పిటిషన్‌ను త్వరగా తేల్చండి..ఎన్సీఎల్టీకి గో ఫస్ట్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ గో ఫస్ట్ తాము స్వచ్ఛందంగా దాఖలు చేసిన దివాలా పిటిషన్‌పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కి విజ్ఞప్తి చేసింది. విమానాలను లీజుకిచ్చిన సంస్థలు (లెస్సర్లు) వాటిని డీరిజిస్టర్ చేయడం మొదలుపెట్టాయని తెలిపింది. దీనితో గో ఫస్ట్ అభ్యర్థనను సత్వరం పరిశీలించేందుకు ఎన్సీఎల్టీ బెంచ్ అంగీకరించింది. 36 విమానాల రిజిస్ట్రేషన్‌ను ఉపసంహరించాల్సిందిగా కోరుతూ లీజింగ్ కంపెనీలు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ)ని కోరాయి. మరోవైపు, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు టికెట్ల బుకింగ్ చేపట్టవద్దంటూ కంపెనీని డీజీసీఏ ఆదేశించింది. అలాగే, సురక్షితమైన, విశ్వసనీయమైన విధంగా సర్వీసులు నడపడంలో విఫలం కావడంపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు సమాచారం. ఆ వివరణను బట్టి ఆపరేటర్ సర్టిఫికెట్ (ఏవోసీ)ని కొనసాగనివ్వడంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఫ్లయిట్ సేవలను నిలిపివేసిన గో ఫస్ట్.. మే 15 వరకూ టికెట్ల విక్రయాన్ని ఆపేసిన సంగతి తెలిసిందే. గో ఫస్ట్ గత 17 ఏళ్లుగా విమాన సేవలు నిర్వహిస్తోంది. అయితే, ప్రాట్ అండ్ విట్నీ (పీఅండ్‌డబ్ల్యూ) ఇంజిన్ల వైఫల్యం కారణంగా కొన్నాళ్లుగా సగానికి పైగా విమానాలను నడపడం లేదు. దీంతో ఆదాయం పడిపోయి, ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో కూరుకుపోవడం వల్ల దివాలా ప్రక్రియ చేపట్టాలంటూ ఎన్సీఎల్టీని కంపెనీ ఆశ్రయించింది. దీనిపై మే 4న విచారణ జరిపిన ట్రిబ్యునల్ .. ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది. రుణ దాతలకు గో ఫస్ట్ దాదాపు రూ. 11,463 కోట్లు చెల్లించాల్సి ఉంది. -
తీవ్ర ఇబ్బందులు: రెండు రోజులు విమానాలను రద్దు చేసిన సంస్థ
న్యూఢిల్లీ: వాడియా గ్రూప్ యాజమాన్యంలోని బడ్జెట్ ధరల విమానాయాన సంస్థ గోఫస్ట్ ఫండ్ ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఈ కారణంగా రెండు రోజుల పాటు విమాన సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. (IBM To Freeze Hiring: వేలాది ఉద్యోగాలకు ఏఐ ముప్పు: ఐబీఎం షాకింగ్ న్యూస్) తీవ్రమైన నిధుల కొరత కారణంగా (బుధవారం, గురువారం (మే 3, 4 తేదీలు) విమానాలను రద్దు చేసింది. ఈ మేరకు గోఫస్ట్ సీఈఓ కౌశిక్ ఖోనాను ఉటంకిస్తూ పీటీఐ నివేదించింది. అంతేకాదు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ముందు స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు చేసింది. ప్రాట్ అండ్ విట్నీ (P&W) ఇంజిన్లను సరఫరా చేయకపోవడంతో 28 విమానాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఖోనా పీటీఐకి చెప్పారు. స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియల దాఖలు దురదృష్టకర నిర్ణయమని పేర్కొన్నారు. కానీ కంపెనీ ప్రయోజనాల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. (రెనాల్ట్ కైగర్ కొత్త వేరియంట్ వచ్చేసింది.. ఆర్ఎక్స్జెడ్ వెర్షన్‌పై భారీ తగ్గింపు) -
ప్రమోటర్లు తప్పుకోవడం లేదు
ముంబై: నష్టాల్లో కూరుకుపోతున్న విమానయాన సంస్థ గో ఫస్ట్ నుంచి ప్రమోటర్లు తప్పుకునే యోచనలో ఉన్నారన్న వార్తలను కంపెనీ వర్గాలు తోసిపుచ్చాయి. గో ఫస్ట్ తగిన భాగస్వాముల కోసం అన్వేషిస్తోందని, ప్రమోటర్లు నిష్క్రమించడం లేదని స్పష్టం చేశాయి. రాబోయే కొన్ని వారాల్లో రూ. 600 కోట్ల మేర నిధులను సమకూర్చుకునే అవకాశం ఉందని మేనేజ్మెంట్కు సన్నిహితంగా ఉండే వ్యక్తి తెలిపారు. ‘మేం మంచి భాగస్వామ్యాన్ని పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. కానీ దానర్ధం మేము వ్యాపారాన్ని అమ్మేస్తున్నామని కాదు. దేశీ విమానయాన రంగం క్రమంగా మెరుగుపడుతోంది. దీంతో కొన్ని ఎయిర్‌లైన్స్, కొందరు వ్యాపారవేత్తలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడంపై ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అలాంటి ప్రతిపాదన ఏదైనా వస్తే మేము పరిశీలించవచ్చు‘ అని ఆయన వివరించారు. 2022–23లో కంపెనీ రూ. 1,800 కోట్ల నష్టం నమోదు చేసిందని తెలిపారు. కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు ప్రమోటర్లు దాదాపు రూ. 300 కోట్లు సమకూరుస్తున్నారని, అత్యవసర రుణ హామీ పథకం కింద మరో రూ. 300 కోట్ల వరకూ బ్యాంకుల నుంచి రానున్నాయని.. మొత్తం మీద 3–4 వారాల్లో దాదాపు రూ. 600 కోట్లు రాగలవని పేర్కొన్నారు. వివిధ కారణాలతో 25 విమానాలు నిల్చిపోగా.. కంపెనీ ప్రస్తుతం 36–37 విమానాలను మాత్రమే నడుపుతోంది. చాలాకాలంగా 8–10 శాతంగా ఉంటున్న గో ఫస్ట్ మార్కెట్ వాటా తాజా పరిణామాలతో మార్చిలో 6.9 శాతం స్థాయికి పడిపోయింది. -
విమాన టికెట్లపై గో ఫస్ట్ అదిరిపోయే ఆఫర్: రేపటి వరకే ఛాన్స్
సాక్షి,ముంబై: దేశీయ విమానయాన సంస్థ గో ఫస్ట్ తగ్గింపు ధరల్లో విమాన టికెట్లను అందిస్తోంది. దేశీయ,అంతర్జాతీయ విమాన టికెట్ల ధరలపై ఆఫర్‌ను అందిస్తోంది. నేటి నుంచి రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 23-24) విక్రయిస్తున్న ఈ స్పెషల్ సేల్‌లో దేశీయ విమాన టికెట్ల ధరలు రూ. 1,199 వద్ద, అంతర్జాతీయ విమానాల ఛార్జీలు రూ. 6,139 నుంచి ప్రారంభమవుతాయని గో ఫస్ట్ తెలిపింది. (ఇదీ చదవండి: ఐసీఐసీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్) సమ్మర్ ట్రావెల్ సీజన్‌కు ముందు బడ్జెట్ ధరల విమానయాన సంస్థ గో ఫస్ట్ ఫిబ్రవరి 23న రెండు రోజుల ధరల విక్రయాన్ని ప్రకటించింది. ఈ సేల్ ఫిబ్రవరి 24 వరకు కొనసాగుతుందని, ప్రయాణ కాలం మార్చి 12 నుంచి సెప్టెంబర్ 30, 2023 వరకు ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో కూడా ఇదే విధమైన ఆఫర్ ప్రకటించింది.ఇండిగో దేశీయ విమాన టిక్కెట్లను రూ. 2,093 (ప్రారంభ ధర) ఆఫర్ ప్రకటించిన రోజు తర్వాత గో ఫస్ట్ ప్రకటన వచ్చింది. ఇండిగో సేల్ ఫిబ్రవరి 25 వరకు కొనసాగనుంది. ఈ ఆఫర్లో బుక్ చేసుకున్న టికెట్లపై మార్చి 13 నుండి అక్టోబర్ 13, 2023 వరకు ప్రయాణించవచ్చు. (సుమారు 5 వేలమంది సీనియర్లకు షాకిచ్చిన ఈ కామర్స్ దిగ్గజం) కాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఫిబ్రవరి 20న విడుదల చేసిన డేటా ప్రకారం జనవరి 2023లో 125.42 లక్షల మంది ప్రయాణీకులతో దేశీయ విమానాల రాకపోకలు గత ఏడాది కాలంతో పోలిస్తే దాదాపు రెట్టింపయ్యాయి. డిసెంబరు 2022 నుండి 127.35 లక్షలతో పోలిస్తే 1.5 శాతం తక్కువగా ఉంది. అయితే విమాన ట్రాఫిక్ ఇప్పటికీ ప్రీ-కోవిడ్ స్థాయిల కంటే తక్కువగా ఉంది. జనవరి 2020లో దేశీయ విమానయాన సంస్థలు 127.83 లక్షల మంది ప్రయాణికులతో ప్రయాణించారు. (నెలకు రూ.4 లక్షలు: రెండేళ...కష్టపడితే, కోటి...కానీ..!) -
ప్యాసింజర్లను ఎక్కించుకోని టేకాఫ్ ఘటన: ఎయిర్‌లైన్‌కు భారీ పెనాల్టీ
ప్రయాణికులను ఎక్కించుకోకుండా టేకాఫ్ అయ్యిన మరో ఎయిర్‌లైన్‌కు డీజీసీఏ భారీ పెనాల్టీ విధించి గట్టి షాక్ ఇచ్చింది. ఎయిర ఇండియా మూత్ర విసర్జన ఘటనలో సీరియస్ అయ్యినా డీజీసీఏ సదరు ఎయిర్‌లైన్‌కు గట్టిగా జరిమానా విధించిన షాకింగ్ ఘటన మరువక మునుపే మరో ఎయిర్‌లైన్‌కి పెద్ద మొత్తంలో పెనాల్టీ విధించింది డీజీసీఏ. ఈ మేరకు జనవరి 9న ఉదయం 6.30కి బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన జీ8, 116 గో ఫస్ట్ విమానం 55 మంది ప్రయాణికులను వదిలేసి టేకాఫ్ అయ్యింది. ఈ విషయమై డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ సదరు ఎయిర్‌లైన్‌కి నోటీసులు పంపి వివరణ ఇవ్వమని కోరింది. ఐతే సదరు ఎయిర్‌లైన్ ప్రయాణికులను ఎక్కించే విషయంలో టెర్మినల్ కో ఆర్డినేటర్, కమర్షియల్ సిబ్బందికి మధ్య సరైన కమ్యూనికేషన్, సమన్వయం లేకపోవడంతో ఈ తప్పిదం చోటు చేసుకుందని వివరించింది. దీంతో డీసీజీఏ ప్రయాణికులను ఎక్కించుకోవడంలో బహుళ తప్పిదాలు ఉన్నాయంటూ రూ. 10 లక్షలు జరిమాన విధించింది. ఇదిలా ఉండగా గోఫస్ట్ ఎయిర్‌లైన్ ఈ అనుకోని పర్యవేక్షణ ఘటనకు ఇబ్బందిపడ్డ నాటి ప్రయాణికులకు క్షమాపణల చెప్పింది, పైగా బాధిత ప్రయాణికులకు వచ్చే ఏడాదిలోపు భారత్‌లో ఎక్కడికైనా ప్రయాణించడానికి ఒక ఉచిత టిక్కెట్‌ను కూడా అందించింది. ఈ ఘటన జరిగినప్పుడూ ఫ్లైట్‌లో ఉన్న సిబ్బందిని కూడా తొలగించారు. (చదవండి: పాక్‌కు భారత్ నోటీసులు..సింధు జలాల ఒప్పందం మార్చకుందామా!) -
ఎయిర్‌పోర్ట్‌లో షాకింగ్ ఘటన.. ప్రయాణికులను ఎక్కించుకోకుండా..
బెంగళూరు విమానాశ్రయంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సుమారు 50 మందికి పైగా ప్రయాణికులు ఎక్కకుండానే విమానం టేకాఫ్ అయ్యింది. ఈ విషయమై ఫిర్యాదులు అందడంతో సదరు ఎయిర్‌లైన్‌ని డీజీసీఏ వివరణ కోరింది. వివరాల్లోకెళ్తే.. సోమవారం ఉదయం 6.30 గంటలకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గో ఫస్ట్ విమానం జి8116 ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది. ఐతే నాలుగు బస్సుల్లో ప్రయాణికులను విమానంలోకి చేర్చారు. ఇంకా సుమారు 55 మంది ప్రయాణికులు బస్సులోనే ఉండిపోయారు. విమానం వారిని ఎక్కించుకోకుండానే వెళ్లిపోయింది. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు నాలుగంటలు తర్వాత అంటే ఉదయం 10 గంటలకు ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా ఎయిర్ ఇండియా విమానం ఏర్పాటు చేసి వారిని పంపించారు. అయితే ఈ ఘటనపై ప్రయాణికులు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య, ప్రధాని నరేంద్రి మోదీ కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ ట్విట్వర్లో ఫిర్యాదులు చేశారు. దీంతో రంగంలోకి దిగిగిన డీజీసీఏ దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని సదరు ఎయిర్‌లైన్‌ను ఆదేశించింది. కాగా ప్రయాణికులకు బోర్డింగ్‌పాస్‌లు ఉన్నాయని, తనిఖీలు నిమిత్తం నిరీక్షిస్తుండగా.. విమానం ప్రయాణకులను ఎక్కించుకోవడం మరిచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ మేరకు విమానం కోసం వేచి ఉన్న ప్రయాణికులు తమ అనుభవాన్ని ట్విట్టర్లో వివరిస్తూ.. బెంగళూరుకి చెందిన సుమిత్ కుమార్ అనే ప్రయాణికుడు ఈ ఆలస్యం కారణంగా సమావేశానికి హారుకాలేకపోయానని, గో ఫస్ట్‌లో ఇదే నా చివర ఫ్లైట్ జర్నీ అని వాపోయారు. మరో ప్రయాణికురాలు శ్రేయా సిన్హా ఇది అత్యంత భయానక అనుభవం అని, గంటల తరబడి బస్సులోనే ఉండిపోయాం అని ట్విట్ చేశారు. కాగా గోఫస్ట్ ఎయిర్వేస్ ఆయా ట్వీట్లకు స్పందిస్తూ..ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నా అని ట్విట్టర్లో పేర్కొనడం గమనార్హం. -
విమానంలో మరో ఘటన..మహిళా ఫ్లైట్ అటెండెంట్ల పట్ల అసభ్య ప్రవర్తన
తీవ్ర కలకలం రేపిన ఎయిర్ ఇండియాలోని తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన ఘటన మరువక మునుపే మరో ఘటన చోటు చేసుకుంది. గో ఫస్ట్ విమానంలోని మహిళా ఫ్లైట్ అటెండెంట్ల పట్ల ఒక విదేశీ టూరిస్ట్ అసభ్యంగా ప్రవర్తించి.. వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. జనవరి 5న ఢిల్లీ నుంచిగోవా వెళ్లే గో ఫస్ట్ విమానంలో ఈ ఘటన జరిగింది. ఒక విదేశీ పర్యాటకుడుతో ఫ్లైట్ అటెండెంట్ కూర్చొగా..అతను మరొకరితో అసభ్యంగా మాట్లాడటం ప్రారంభించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. దీంతో సదరు వ్యక్తిని గోవాలోని కొత్త విమానాశ్రయంలోని భద్రతా ఏజెన్సీకి అప్పగించారు. ఆ తర్వాత డీజీసీఏకి ఈ విషయమై సమాచారం అందించారు. గోవాలోని మోపాలో కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాలు చేసిన రోజే జరగడం గమనార్హం. ఇప్పటికే విమానాల్లో ఇలాంటి ఘటనలపై డైరక్టరేట్ జనరల్ సవిల్ ఏవియేషన్ సీరియస్‌గా ఉంది. ఈ క్రమంలో ఇలాంటి ఘటనలు వరుసగా బయటకు రావడంతో సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేలా అంతర్గత కమిటీని సైతం డీజీసీఏ ఏర్పాటు చేసింది. (చదవండి: వినూత్నంగా జనగణన..ఫుల్ క్లారిటీ ఇచ్చిన బిహార్ సీఎం) -
అలారంలోనే సాంకేతిక లోపం.. హడలిపోయిన ప్రయాణికులు
కొయంబత్తూర్: విమానంలో ఏదైనా సాంకేతిక లోపం ఉంటే ముందుగా అలారం మ్రోగడం సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అటువంటిది అలారంలోనే సాంకేతిక సమస్య తలెత్తి అది మ్రోగితే ఇక అంతే విమాన సిబ్బందిలో, ప్రయాణికుల్లో ఒకటే టెన్షన్ మొదలవుతుంది. విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యే వరకూ ఏం జరుగుతుందో అనే ఒకటే భయం ఉంటుంది. అలారంలో సాంకేతిక సమస్య తలెత్తి అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేయాల్సిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి 92 మంది ప్రయాణికులతో బయల్దేరిన గో ఫస్ట్ విమానాన్ని తమిళనాడులోని కొయంబత్తూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. కొయంబత్తూర్‌లో ఎయిర్పోర్ట్ అధికారులు పర్మిషన్ తీసుకుని ల్యాండ్ చేయాల్సి వచ్చింది. విమానం ల్యాండ్ అయ్యే క్రమంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. అప్పటికే ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకుని ఉన్నారు. ఆ తర్వాత విమానాన్ని ఇంజనీర్లు తనిఖీ చేయగా ఎటువంటి సమస్య లేదని తేల్చారు. కాగా, అలారం ఎందుకు మోగింది అంటే అందులో ఏదో సాంకేతిక సమస్య రావడంతో అలా జరిగిందని ఇంజనీర్లు స్పష్టం చేశారు. విమానంలో ఎటువంటి ఇబ్బంది లేదని, అలారంలో ప్రాబ్లం వల్లే ల్యాండ్ చేయాల్సిన అవసరం వచ్చిందని ఎయిర్పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు. విమానంలో ఉండే ట్విన్ ఇంజన్స్ ఓవర్ హీట్‌కు గురైనప్పుడు అలారం మ్రోగడంతో అలర్ట్ అవుతారు విమాన సిబ్బంది. కానీ ఇక్కడ విమానంలో ఎటువంటి సమస్య లేకుండానే అలారం మ్రోగడం ఏంటా అనేది సదరు ఇంజనీర్లకే తెలియాలి. గతవారం గో ఫస్ట్ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే పక్షి తాకడంతో విమానాన్ని తిరిగి అహ్మదాబాద్‌కు రప్పించిన సంగతి తెలిసిందే. -
పక్షి ఎంత పని చేసింది.. విమానాన్ని ఢీ కొట్టడంతో.. !
గాంధీనగర్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న గో ఫస్ట్ విమానం జీ8911కు త్రుటిలో ప్రమాదం తప్పింది. గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఓ పక్షి విమానాన్ని ఢీకొట్టింది. దీంతో విమానాన్ని తిరిగి అహ్మదాబాద్ మళ్లించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తెలిపింది. ఇటీవల విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు దారి మళ్లించిన సంఘటనలు పెరిగినట్లు పేర్కొంది. దేశీయ విమానాల్లో ఏర్పడుతున్న సాంకేతిక లోపాలు పెద్దవేమి కావని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గత ఆదివారం పేర్కొన్నారు డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్. గడిచిన 16 రోజుల్లో అంతర్జాతీయ విమానాల్లో సైతం 15 సాంకేతిక లోపాలతో అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన సంఘటనలు ఎదురైనట్లు గుర్తు చేశారు. Go First flight G8911 operating on 4th August from Ahmedabad to Chandigarh diverted to Ahmedabad after bird hit: Directorate General of Civil Aviation (DGCA) pic.twitter.com/zVRG2evG8g — ANI (@ANI) August 4, 2022 ఇదీ చదవండి: ఒకే విమానంలో కో పైలెట్లుగా తల్లి కూతుళ్లు: వీడియో వైరల్ -
గో ఫస్ట్ విమానానికి తప్పిన పెనుముప్పు.. రెండు రోజుల్లో మూడోసారి
సాక్షి, ఢిల్లీ: గో ఫస్ట్ విమానానికి పెను ముప్పు తప్పింది. బుధవారం.. ఢిల్లీ నుంచి గౌహతి వెళ్తుండగా విమానం విండ్ షీల్డ్ పగిలింది. దీంతో విమానాన్ని జైపూర్‌కు మళ్లించినట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. రెండు రోజుల్లో గో ఫస్ట్ విమానంలో సాంకేతిక లోపం సంభవించడం ఇది మూడోసారి. చదవండి: సైకో భర్త చిత్రహింసలు.. భార్యకు అశ్లీల వీడియోలు చూపిస్తూ.. ఇటీవలి కాలంలో విమానాల్లో సాంకేతిక లోపాలు వరుసగా తలెత్తుతున్నాయి. మంగళవారం కూడా విమానయాన సంస్థ గోఫస్ట్‌కు చెందిన రెండు విమానాల్లో ఒకేసారి ఇంజన్ సమస్యలు కలకలం రేపింది. శ్రీనగర్-ఢిల్లీ, ముంబై-లేహ్ గోఫస్ట్ విమానాల్లో ఇంజన్లలో సమస్య ఏర్పడ్డాయి దీంతో రెండు విమానాలను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీనిపై సివిల్ ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ విచారణ చేపట్టింది. -
గాల్లో ఉండగానే ఇంజన్ లోపాలు, ఒకేసారి రెండు విమానాల్లో
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో విమానాల్లో సాంకేతిక లోపాలు వరుసగా తలెత్తుతున్నాయి. తాజాగా విమానయాన సంస్థ గోఫస్ట్‌కు చెందిన రెండు విమానాల్లో ఒకేసారి ఇంజన్ సమస్యలు కలకలం రేపింది. శ్రీనగర్-ఢిల్లీ, ముంబై-లేహ్ గోఫస్ట్ విమానాల్లో ఇంజన్లలో సమస్య ఏర్పడిన ఉదంతం మంగళవారం చోటుచేసుకుంది. దీంతో రెండు విమానాలను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీనిపై సివిల్ ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ విచారణ చేపట్టింది. తొలుత గోఫస్ట్ ముంబై-లేహ్ విమానంలో ఇంజన్ నంబర్ 2లో లోపం కనిపించడంతో గమనించిన సిబ్బంది ఢిల్లీకి మళ్లించారని డీజీసీఏ అధికారులు తెలిపారు. ఆ తరువాత మరో విమానం గాల్లో ఉండగానే సమస్య ఏర్పడింది. శ్రీనగర్-ఢిల్లీ విమానం నంబర్- 2 ఇంజన్లో లోపాన్ని గుర్తించడంతో దీన్ని తిరిగి శ్రీనగర్‌కు మళ్లించారు. రెండు ఘటనల్లోనూ ప్రయాణీకులు,న సిబ్బంది క్షేమంగా ఉండటం భారీ ఉపశమనం కలిగించింది. దీనిపై విచారణ జరుగుతోందని, డీజీసీఏ క్లియరెన్స్ వచ్చిన తరువాతే విమానాలు తిరిగి సేవలను ప్రారంభిస్తాయని అధికారులు తెలిపారు. కాగా దేశీయ విమానాల్లో వరుస లోపాల నేపథ్యంలో విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భద్రతా పర్యవేక్షణ నిమిత్తం విమానయాన సంస్థలు, ఇతర మంత్రిత్వ శాఖ, డీజీసీఏ అధికారులతో పలు సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.