A Chandigarh Bound Flight Returned To Ahmedabad After Bird Hit - Sakshi
Sakshi News home page

Go First Airlines: పక్షి ఢీ కొట్టడంతో విమానం అత్యవసర ల్యాండింగ్‌!

Aug 4 2022 3:17 PM | Updated on Aug 4 2022 3:41 PM

A Chandigarh Bound Flight Returned To Ahmedabad After Bird Hit - Sakshi

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి చండీగఢ్‌ వెళ్తున్న గో ఫస్ట్‌ విమానం జీ8911కు త్రుటిలో ప్రమాదం తప్పింది.

గాంధీనగర్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి చండీగఢ్‌ వెళ్తున్న గో ఫస్ట్‌ విమానం జీ8911కు త్రుటిలో ప్రమాదం తప్పింది. గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఓ పక్షి విమానాన్ని ఢీకొట్టింది. దీంతో విమానాన్ని తిరిగి అహ్మదాబాద్‌ మళ్లించినట్లు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) తెలిపింది. ఇటీవల విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్‌ చేసేందుకు దారి మళ్లించిన సంఘటనలు పెరిగినట్లు పేర్కొంది.

దేశీయ విమానాల్లో ఏర్పడుతున్న సాంకేతిక లోపాలు పెద్దవేమి కావని, ఆందోళన చెందాల్సిన ‍అవసరం లేదని గత ఆదివారం పేర్కొన్నారు డీజీసీఏ చీఫ్‌ అరుణ్‌ కుమార్‌. గడిచిన 16 రోజుల్లో అంతర్జాతీయ విమానాల్లో సైతం 15 సాంకేతిక లోపాలతో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేసిన సంఘటనలు ఎదురైనట్లు గుర్తు చేశారు.

ఇదీ చదవండి: ఒకే విమానంలో కో పైలెట్లుగా తల్లి కూతుళ్లు: వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement