flight emergency landing
-
Toronto: న్యూయార్క్ వెళ్లే ఫ్లైట్‌లో మంటలు
టొరంటో: కెనడాలోని టొరంటో విమానాశ్రయం నుంచి న్యూయార్క్ బయలుదేరిన విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మంటలు లేచాయి. దీంతో విమానాన్ని పైలట్ వెనక్కి తిప్పి మళ్లీ టొరంటో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశాడు. ఘటన జరిగిన సమయంలో విమానంలో 74 మంది ప్రయాణికులున్నారు. విమానం టేకాఫ్ అయిన తర్వాత పైలట్ విమానాన్ని అత్యంత ఎత్తుకు తీసుకెళ్లాడు. ఈ సమయంలో విండ్‌షీల్డ్ వద్ద మిరుగులు వచ్చాయి. దీంతో పాటు కాక్‌పిట్‌లో వైరు కాలిన వాసనను పైలట్ గమనించాడు. దీంతో వెంటనే ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి తెలియజేశాడు. వారు ఓకే అనడంతో పైలట్ విమానాన్ని వెనక్కు తిప్పి మళ్లీ టొరంటోలో ల్యాండ్ చేశాడు. ఇదీ చదవండి.. సొంత దేశంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు -
ప్రయాణికుడి దెబ్బకు 200 మందికి టెన్షన్.. ఏం జరిగిదంటే?
సియోల్: ఇటీవలి కాలంలో కొందరు విమాన ప్రయాణికులు అతిగా ప్రవర్తిస్తున్నారు. కొందరు విమానంలో గాల్లో ఉన్న సమయంలో డోర్ ఓపెన్ చేయడం, మరికొందరు ఎదుటి వారితో వాగ్వాదానికి దిగడం వంటివి తరచుగా చూస్తున్నాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఏషియానా విమానంలో చోటుచేసుకుంది. విమానం ఆకాశంలో ఉన్న సమయంలో ఓ ప్యాసింజర్ ఎమర్జెన్సీ డోర్‌ను ఓపెన్ చేశాడు. దీంతో, కొందరు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. దక్షిణ కొరియాలో ఏషియానా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమాన డోర్‌ను ఓ ప్యాసింజెర్ తెరిచాడు. ఏ321 విమానం గాలిలో ఉన్నప్పుడు ఓ వ్యక్తి ఆ విమాన్ డోర్‌ను తీశాడు. దక్షిణ దీవి జేజూ నుంచి డేగూ వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో విమానంలో దాదాపు 200 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో, అప్రమత్తమైన పైలట్ ఆ విమానాన్ని డేగు విమానాశ్రయంలో దించారు. కాగా, సదరు ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ను ఓపెన్ చేస్తున్న సమయంలో ప్రయాణికులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆ డోర్ ఓపెన్ అయ్యింది. ఇక, విమానం గాలిలో ఉన్న సమయంలో డోర్ ఓపెన్ కావడంతో అందులో ఉన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, సదరు వ్యక్తి డోర్ ఎందుకు ఓపెన్ చేశాడన్నది తెలియరాలేదు. మరోవైపు.. ఉల్సన్‌లో జరుగుతున్న ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు చాలా మంది అథ్లెట్లు ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. శ్వాస కోస ఇబ్బందులు తలెత్తిన్న ప్రయాణికులను హాస్పిటల్‌కు తరలించినట్లు రవాణాశాఖ తెలిపింది. కాగా, విమానంలో డేగు ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే డోర్ ఓపెన్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 🚨 Un pasajero ha abierto una salida de emergencia del #A321 HL8256 de #AsianaAirlines en pleno vuelo. El vuelo #OZ8124 entre Jeju y Daegu del 26 de mayo se encontraba en aproximación cuando una de las salidas de emergencia sobre el ala fue abierta por un pasajero. El avión… pic.twitter.com/G0rlxPNQuW — On The Wings of Aviation (@OnAviation) May 26, 2023 ఇది కూడా చదవండి: బ్రిటన్ ప్రధాని నివాసంపైకి కారుతో దాడికి యత్నం?.. రిషి సునాక్ సేఫ్! -
గాల్లో విమానం.. పైలట్ సీట్లోకి నాగు పాము.. తర్వాత ఏం జరిగిందంటే!
జోహన్నెస్‌బర్గ్: గాల్లో ఎగురుతున్న ఓ విమానంలోని అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాక్ పిట్లోకి ప్రవేశించిన అత్యంత విషపూరితమైన కేప్ కోబ్రా ఏకంగా పైలట్ సీట్ పక్కన దర్శనమిచ్చింది. పామును గమనించిన పైలట్ భయపడకుండా చాకచక్యంగా వ్యవహరించడంతో విమానంలో ఉన్నవారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో సోమవారం చోటు చేసుకుంది. విమానంలో పామును చూసిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేసి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. సోమవారం నలుగురు ప్రయాణికుతో చిన్న విమానం వార్సెస్టర్ నుంచి నెల్సుప్రీట్‌కు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ రుడోల్ఫ్ ఎరాస్మస్కు తన వెనుక భాగంలో ఏదో కదులుతున్నట్టు అనిపించింది. తల తిప్పి చూడగా.. ఓ నాగుపాము తన సీటు కింద కదులుతూ కనిపించింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అయితే పాముని చూసి బెంబేలెత్తకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. ఈ విషయాన్ని ముందుగా గ్రౌండ్ కంట్రోల్ సిబ్బందికి తెలియజేశాడు. ఏటీసీ సూచనలతో విమానాన్ని జోహన్నెస్‌బర్గ్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో ప్రాయణికులకు ప్రాణాపాయం తప్పింది. విమానంలోని వారిని దింపేసి తనిఖీలు చేయగా.. పైలట్ సీటు కింద పాము చుట్టుకొని ఉండటాన్ని గుర్తించారు. వాస్తవానికి ప్రయాణానికి ముందు రోజు ఆదివారం మధ్యాహ్నం వార్సెస్టర్ ఎయిర్‌పోర్టు సిబ్బంది విమానం రెక్కల కింద నాగుపామును గుర్తించారు. దాన్ని పట్టుకునేందుకు వారు ప్రయత్నించినా దాని ఆచూకీ లభించకపోవడంతో బయటకు వెళ్లిపోయిందని భావించారు. అనూహ్యంగా మర్నాడు కాక్‌పిట్‌లో ప్రత్యక్షమైంది. మరోవైపు సంయమనం పాటించి, విమానాన్ని జాగ్రత్తగా ల్యాండింగ్ చేసిన పైలెట్‌ను అభినందిస్తూ అతని ధైర్య సాహసాలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
సీఎం జగన్ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఏం చెప్పారంటే?
సాక్షి, విజయవాడ: సాంకేతిక కారణాలతోనే సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం వెనుదిరిగిందని గన్నవరం ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎం.లక్ష్మీ కాంత్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ‘‘ప్రతి విమానం బయల్దేరే సమయంలో పూర్తి చెకింగ్ చేస్తాం. చెకింగ్ తర్వాతే విమానం టేకాఫ్ అవుతుంది. చిన్న సాంకేతిక కారణం ఉన్నా ఫ్లైట్‌ను వెనక్కి తీసుకొచ్చేస్తారు. సీఎం విమానం విషయంలోనూ అదే జరిగింది. ప్రయాణీకుల భద్రతే పైలట్ ముఖ్య ఉద్ధేశం. సాంకేతిక లోపం అనేది ఏ టైం లోనైనా రావొచ్చు.. ఏ విమానానికైనా రావొచ్చు’’ అని లక్ష్మీ కాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు సన్నాహక సమావేశం కోసం ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలిసిందే. ఏసీ వాల్వ్‌లో లీకేజి కారణంగా ప్రైజరైజేషన్ సమస్య తలెత్తిందని పైలట్ గుర్తించినట్టుగా ప్రాథమికంగా తెలిసిందని అధికారులు తెలిపారు. సమస్యను గుర్తించిన పైలట్ తిరిగి గన్నవరం విమానాశ్రయానికి మళ్లించారు. ఢిల్లీ పర్యటన కోసం ముఖ్యమంత్రి, అధికారుల బృందం సాయంత్రం 5:03 గంటలకు టేకాఫ్ అయ్యింది. కాసేపటికే పైలట్ విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. చదవండి: ‘పట్టు’కుంటే బంగారమే!.. ఏడాదికి రూ.లక్షల ఆదాయం -
సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్
సాక్షి, విజయవాడ: ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు సన్నాహక సమావేశం కోసం ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఏసీ వాల్వ్‌లో లీకేజి కారణంగా ప్రైజరైజేషన్ సమస్య తలెత్తిందని పైలట్ గుర్తించినట్టుగా ప్రాథమికంగా తెలిసిందని అధికారులు తెలిపారు. సమస్యను గుర్తించిన పైలట్ తిరిగి గన్నవరం విమానాశ్రయానికి మళ్లించారు. ఢిల్లీ పర్యటన కోసం ముఖ్యమంత్రి, అధికారుల బృందం సాయంత్రం 5:03 గంటలకు టేకాఫ్ అయ్యింది. కాసేపటికే పైలట్ విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. తిరిగి సాయంత్రం 5:27 గంటలకు గన్నవరంలో ల్యాండ్ అయ్యారు. సీఎం తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రాత్రికే ఢిల్లీకి సీఎం జగన్ వెళ్లనున్నారు. చదవండి: తోడేళ్లంతా ఒక్కటయ్యాయి.. సింహం సింగిల్‌గానే నడుస్తోంది -
244 మందితో వెళ్తున్న గోవా విమానంలో బాంబు కలకలం!
అహ్మదాబాద్: మాస్కో నుంచి గోవాకు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. విమానంలో బాంబు ఉన్నట్లు ఫోన్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గోవాకు వెళ్లాల్సిన విమానాన్ని గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో మొత్తం 244 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, విమానంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించలేదని, బాంబు లేదని తేల్చడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. జామ్‌నగర్ నుంచి గోవాకి 11 గంటలకు విమానం బయలుదేరి వెళ్లనుంది ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు. బాంబు బెదిరింపులతో నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) సిబ్బంది విమానం, లగేజ్‌ని తనిఖీలు చేశారు.‘ ఎన్ఎస్జీకి ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. విమానం చాలా పెద్దతి, తనిఖీ చేసేందుకు ఎక్కువ సమయం పట్టింది. అన్ని రకాల అధికారిక కార్యక్రమాలు పూర్తయ్యాక ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్యలో జామ్‌నగర్ నుంచి గోవాకు విమానం బయలుదేరే అవకాశం ఉంది. క్యాబిన్‌లోని మొత్తం లగేజ్‌ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.’ అని జామ్‌నగర్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ తెలిపారు. #WATCH | Visuals from Jamnagar Aiport where Moscow-Goa chartered flight passengers were deboarded after Goa ATC received a bomb threat. As per airport director, Nothing suspicious found. The flight is expected to leave for Goa probably b/w 10:30 am-11 am today.#Gujarat pic.twitter.com/dRBAEucYjy — ANI (@ANI) January 10, 2023 ఇదీ చదవండి: బ్రెజిల్ అల్లర్లు: మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక -
అమిత్ షా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
గువాహటి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానాన్ని దారిమళ్లించారు అధికారులు. అసోంలోని గువాహటి లోక్ప్రియా గోపినాథ్ బర్దోలాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి 10.45 గంటలకు అత్యవసర ల్యాండింగ్ చేశారు. త్రిపురలోని అగర్తలాకు వెళ్లున్న హోంమంత్రి అమిత్ షా విమానం ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్ చేయలేకపోయారు. దీంతో విమానాన్ని అసోంకి మళ్లించి సురక్షితంగా కిందకు దించారు. విమానం అత్యవసర ల్యాండింగ్ చేపట్టిన క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వాగతం పలికారు. అక్కడి నుంచి గువాహటిలోని హోటల్ రాడిసన్ బ్లూకు చేరుకుని బుధవారం రాత్రి బస చేశారు అమిత్ షా. వాతావరణ పరిస్థితులపై అనుమతులు వచ్చిన తర్వాత గురువారం ఉదయం అగర్తలాకు బయలుదేరి వెళ్తారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా చేపట్టనున్న రథయాత్రను ప్రారంభించేందుకు వెళ్తున్నారు షా. ఈ రథయాత్రతో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇదీ చదవండి: రామ్‌పూర్ ప్రత్యేక కోర్టులో జయప్రద -
హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం..
ముంబై: శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ బయలుదేరిన ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం తలెత్తటంతో విమానాన్ని అత్యవసరంగా ముంబైలో ల్యాండింగ్ చేశారు అధికారులు. విమానంలోని యెల్లో హైడ్రాలిక్ సిస్టమ్ పని చేయకపోవడంతో ముంబైకి మళ్లించినట్లు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్(డీజీసీఏ) అంధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి దుబాయికి శనివారం సాయంత్రం 143 మంది ప్రయాణికులతో బయలుదేరింది ఎయిరిండియా ఏ320 వీటీ-ఈఎక్స్‌వీ విమానం. సాంకేతిక సమస్యను గుర్తించి ముంబైకి మళ్లించారు. ముంబై విమానాశ్రయంలో సుపరక్షితంగా ల్యాండ్ అయినట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. విమానంలో ఏర్పడిన సమస్యను సంబంధిత సిబ్బంది పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా విమానాలు దారి మళ్లించడం కొత్తేమీ కాదు. డిసెంబర్ 2వ తేదీన కన్నూర్ నుంచి దోహా వెళ్తున్న ఇండో విమానం 6ఈ-1715ని ముంబైకి మళ్లించారు. ప్రయాణికులను మరో విమానంలో గమ్యం చేర్చినట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: మధుమేహం పెరుగుదలలో చైనా, భారత్ పోటాపోటీ -
దేవుడు చెప్పాడని విమానం డోర్ తీసే యత్నం.. ఆకాశంలో హల్చల్
వాషింగ్టన్: విమానం గాల్లోకి ఎగిరాక చిన్న పొరపాటు జరిగినా.. పెను ప్రమాదం జరుగుతుంది. అలాంటి 37వేల అడుగుల ఎత్తుకు ఎగిరిన తర్వాత ఓ మహిళ చేసిన పనికి ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. తనకు దేవుడు చేప్పాడంటూ విమానం డోర్ తీసేందుకు ప్రయత్నించింది. అడ్డుకున్న తోటి ప్రయాణికుడిని గాయపర్చింది. మహిళ ప్రవర్తనతో తప్పనిసరి పరిస్థితుత్లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అర్కన్సాస్ తూర్పు జిల్లా కోర్టు విడుదల చేసిన పత్రాల ప్రకారం.. టెక్సాస్‌కు చెందిన 34 ఏళ్ల ఎలోమ్ అగ్బెనినో ఇటీవల ఒహియోలోని కొలంబస్ వెళ్లేందుకు టెక్సాస్ నుంచి సౌత్‌వెస్ట్ విమానం 192 ఎక్కింది. విమానం ఆకాశంలో ప్రయాణిస్తుండగా.. ఎలోమ్ తన సీటు నుంచి లేచి వెళ్లి ఎగ్జిట్ డోర్‌ను తదేకంగా చూస్తూ నిలబడింది. ఆమెను గమనించిన విమాన సిబ్బంది ఒకరు సీట్లో కూర్చోవాలని సూచించారు. అప్పుడు ఆమె తాను కిటికీ నుంచి బయటకు చూస్తానని చెప్పింది. అందుకు సిబ్బంది అంగీకరించలేదు. వెంటనే ఆమె వారిని నెట్టుకుంటూ వెళ్లి.. ఎగ్జిట్ డోర్ హ్యాండిల్ పట్టుకుని తెరిచేందుకు ప్రయత్నించింది. ‘దేవుడు నన్ను ఒహియో రమ్మన్నాడు. విమానం డోర్ తీయమని దేవుడే చెప్పాడు’ అంటూ గట్టిగా అరస్తూ హల్చల్ చేసింది. దాంతో విమానంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎలోమ్‌ను అడ్డుకునేందుకు తోటి ప్రయాణికుడొకరు ప్రయత్నించగా.. అతడిని ఆమె కొరికి గాయపర్చింది. అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని అర్కన్సాస్‌లోని బిల్ అండ్ హిల్లరీ క్లింటన్ నేషనల్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఎయిర్‌పోర్టు పోలీసులు ఎలోమ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. అయితే తాను భర్తకు చెప్పకుండానే ఒహియోకు బయల్దేరినట్లు ఎలోమ్ పోలీసులు విచారణలో చెప్పింది. ఆమె మానసిక స్థితి కూడా సరిగ్గా లేనట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఐదుగురితో ప్రేమ.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన బాయ్‌ఫ్రెండ్.. కానీ! -
తప్పిన ప్రమాదం.. ముంబై విమానం అత్యవసర ల్యాండింగ్
లక్నో: దేశంలో వివిధ కారణాలతో విమానాలు దారి మళ్లించటం, అత్యవరంగా ల్యాండింగ్ చేస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా వారణాసి నుంచి ముంబయి వెళ్తున్న విస్తారా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఓ పక్షి విమానాన్ని ఢీకొట్టినట్లు డీజీసీఏ పేర్కొంది. దాంతో విమాన్ని వెనక్కు మళ్లించి ల్యాండింగ్ చేసినట్లు తెలిపింది. ‘విస్తారా ఏ320 ఎయిర్‌క్రాఫ్ట్ వీటీ-టీఎన్సీ ఆపరేట్ చేస్తున్న యూకే622 విమానం సురక్షితంగా వారణాసిలో ల్యాండింగ్ అయింది. విమానం దిగినట్లు విమానయాన సంస్థ స్పష్టం చేసింది. పక్షి ఢీకొట్టటంతో ఎయిర్‌క్రాఫ్ట్ ముందుభాగం దెబ్బతిన్నది.’ అని ట్విట్టర్లో వెల్లడించింది డీజీసీఏ. ఇదీ చదవండి: Go First Airlines: పక్షి ఢీ కొట్టడంతో విమానం అత్యవసర ల్యాండింగ్! -
పక్షి ఎంత పని చేసింది.. విమానాన్ని ఢీ కొట్టడంతో.. !
గాంధీనగర్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న గో ఫస్ట్ విమానం జీ8911కు త్రుటిలో ప్రమాదం తప్పింది. గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఓ పక్షి విమానాన్ని ఢీకొట్టింది. దీంతో విమానాన్ని తిరిగి అహ్మదాబాద్ మళ్లించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తెలిపింది. ఇటీవల విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు దారి మళ్లించిన సంఘటనలు పెరిగినట్లు పేర్కొంది. దేశీయ విమానాల్లో ఏర్పడుతున్న సాంకేతిక లోపాలు పెద్దవేమి కావని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గత ఆదివారం పేర్కొన్నారు డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్. గడిచిన 16 రోజుల్లో అంతర్జాతీయ విమానాల్లో సైతం 15 సాంకేతిక లోపాలతో అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన సంఘటనలు ఎదురైనట్లు గుర్తు చేశారు. Go First flight G8911 operating on 4th August from Ahmedabad to Chandigarh diverted to Ahmedabad after bird hit: Directorate General of Civil Aviation (DGCA) pic.twitter.com/zVRG2evG8g — ANI (@ANI) August 4, 2022 ఇదీ చదవండి: ఒకే విమానంలో కో పైలెట్లుగా తల్లి కూతుళ్లు: వీడియో వైరల్ -
విమానంలో ఒక్కసారిగా తగ్గిన ప్రెజర్.. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి!
కొచ్చి: కొద్ది రోజులుగా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి అత్యవసరంగా కిందకు దింపాల్సిన సంఘటనలు పెరిగిపోయాయి. ఏ క్షణంలో ఏమి జరుగుతుందోననే భయంతో ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. తాజాగా దుబాయ్ నుంచి కేరళలోని కొచ్చికి వస్తున్న ఎయిరిండియా విమానంలో సమస్య తలెత్తింది. క్యాబిన్లో ప్రెజర్ తగ్గటం వల్ల విమానాన్ని ముంబైకి మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. వారు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందులు పడినట్లు సమాచారం. అయితే.. ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా కిందకు దించారు. ఈ సంఘటన గురువారం జరిగింది. ముంబయి నుంచి మరో విమానంలో ప్రయాణికులను కొచ్చికి శుక్రవారం ఉదయం చేర్చారు. దుబాయి నుంచి కేరళలోని కొచ్చికి వస్తున్న ఎయిరిండియా విమానంలో సంకేతిక సమస్య తలెత్తిన ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ). ‘దుబాయి నుంచి కొచ్చికి వస్తున్న ఎయిరిండియా బోయింగ్ విమానం ఏఐ-934 కెప్టెన్.. క్యాబిన్లో ప్రెజర్ తగ్గిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడినట్లు ఐఓసీసీకి సమాచారం అందించారు. విమానాన్ని ముంబైకి మళ్లించి సురక్షితంగా ల్యాండింగ్ చేశాం.’ అని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇద్దరు సీనియర్ అధికారులను దర్యాప్తునకు నియమించినట్లు చెప్పారు. గత బుధవారం.. ఢిల్లీ నుంచి గువాహటికి వస్తున్న గోఎయిర్ విమానం విండ్‌షీల్డ్ పగిలిన సంఘటన కలకలం సృష్టించింది. ఆ తర్వాత గోఎయిర్ విమానాన్ని జైపూర్‌కు మళ్లించి సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఈనెలలోనే ఇలాంటివి రోజుకు 30 సంఘటనలు చోటు చేసుకున్నట్లు తాజాగా డీజీసీఏ తెలిపింది. అయితే.. ఎలాంటి నష్టం వాటిల్లలేదని వెల్లడించింది. ప్రయాణికుల భద్రతకు సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: ‘సార్ నా బ్యాగులో బాంబు ఉంది..’ ఇండిగో విమానంలో ప్యాసింజర్ హల్చల్ -
Indigo Flight Emergency Landing:పైలటే ప్రాణాలు కాపాడారు..
శంషాబాద్(హైదరాబాద్): షార్జా నుంచి హైదరాబాద్‌కు ఇండిగో ఎయిర్‌లైన్స్ 6ఈ–1406 విమానంలో బయల్దేరిన తమను పైలటే కాపాడారని ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. శనివారం రాత్రి 10.50 గంటలకు బయల్దేరిన విమానం షెడ్యూల్ ప్రకారం శంషాబాద్ విమానాశ్రయానికి ఆదివారం తెల్లవారు జామున 4:10 గంటలకు చేరుకో వాల్సి ఉండగా విమానంలోని సాంకేతికలోపాన్ని గుర్తించిన పైలట్ పాకిస్తాన్‌లోని కరాచి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసిన సంగతి తెలిసిందే. తెల్లవారు జామున విమానాన్ని కరాచి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసిన అనంతరమే విమానంలో సాంకేతికలోపం తలెత్తిందన్న సమాచారాన్ని ఎయిర్‌లైన్స్ వెల్లడించిందని ప్రయాణికులు తెలిపారు. ఎనిమిది గంటల పాటు విమానంలోనే ఉన్న తర్వాత భోజన ఏర్పాట్లు చేశా రని వెల్లడించారు. తొలుత కరాచి నుంచి ప్రయాణికులను గుజరాత్‌లోని అహ్మదాబాద్ మీదుగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ ఆ ప్రయత్నాన్ని రద్దు చేశారు. ప్రత్యేక విమానంలో కరాచి నుంచి నేరుగా శంషాబాద్‌కు తీసుకొచ్చారు. పైలట్ సాంకేతిక లోపం గుర్తించడంతోనే తాము ప్రాణాలతో బయటపడ్డామని, కరాచిలో విమానం ల్యాండయ్యాక మాత్రమే తమకు వివరాలు వెల్లడించారని ప్రయాణికులు తెలిపారు. కరాచి విమానాశ్రయంలో విమానం ల్యాండ్ చేశాక, సుమా రు ఎనిమిది గంటలకు పైగా విమానంలోనే ఉన్నాం. పైలట్ గుర్తించకపోతే పెద్ద ప్రమాదం జరిగేది. – ఓ ప్రయాణికుడు -
కాలిన వాసనతో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 48 గంటల్లో నాలుగోది!
ఢిల్లీ: కాలికట్ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించారు అధికారులు. విమానం క్యాబిన్‌తో పాటు ప్రయాణికులు ఏదో కాలిపోతున్నట్లు వస్తున్న వాసనను గుర్తించారు. దీంతో బీ737-800 ఎయిర్‌క్రాఫ్ట్ వీటీ-ఏక్స్ఎక్స్ అనే విమానాన్ని అత్యవసరంగా మస్కట్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండింగ్ చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) వెల్లడించింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. మరోవైపు.. మస్కట్‌లో విమానం ల్యాండింగ్ చేసిన తర్వాత పరిశీలించగా.. ఎలాంటి మంటలు, పొగ, లీకేజీలు కనిపించలేదని అధికారులు తెలిపారు. 'కాలిన వాసన వచ్చిన నేపథ్యంలో విమానాన్ని క్షణ్నంగా పరిశీలించాం. రెండు ఇంజిన్లతో పాటు ఏపీయూ యూనిట్‌లోనూ ఎలాంటి మంటలు, పొగ, కనిపించలేదు. ఇంధనం, ఆయిల్, హైడ్రోజన్ లీకైనట్లు సైతం కనిపించలేదు.' అని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రన్ వేపై విమానాన్ని అన్ని విధాల పరీక్షించినట్లు చెప్పారు. 48 గంటల్లో నాలుగో సంఘటన.. సాంకేతిక సమస్యలతో విమానాన్ని దారి మళ్లించటం ఒకే రోజులో ఇది రెండో సంఘటన కావటం గమనార్హం. అయితే.. 48 గంటల్లో ఇది నాలుగో సంఘటన. ఆదివారం ఉదయం ఓ ఇండిగో విమానాన్ని అత్యవసరంగా పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. యూఏఈలోని షార్జా నుంచి హైదరాబాద్ రావాల్సిన ఈ విమానంలో మార్గ మధ్యలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా కరాచీలో దించారు. భారత్‌కు చెందిన ఓ విమానం పాక్‌లో ల్యాండ్ కావడం గడిచిన రెండు వారాల్లో ఇది రెండోసారి. జులై 16న ఎథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అడిస్ అబాబా నుంచి బ్యాంకాక్‌కు వెళ్తుండగా.. కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. జులై 15న శ్రీలంకకు చెందిన విమానాన్ని చెన్నైలో అత్యవసరంగా దించాల్సి వచ్చింది. ఇదీ చూడండి: Indigo Flight Emergency Landing: కరాచీ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ -
కాక్‌పిట్‌లో కాఫీ తెచ్చిన తంటా..
విమాన ప్రయాణంలో ఒక్కోసారి అనుకోని సంఘటనలు తీవ్ర ఆందోళనకు దారి తీస్తూ వుంటాయి. తాజాగా కాక్‌పిట్ కంట్రోల్ ప్యానెల్లో వేడి వేడి కాఫీ ఒలకడంతో అకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు సిబ్బంది గందరగోళానికి గురయ్యారు. చివరకు పైలట్ అప్రమత్తతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఫిబ్రవరి 6న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వేస్టిగేషన్ బ్రాంచ్ వివరాల ప్రకారం కాండోర్ ఎయిర్‌బస్ ఏ330-243 విమానం జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి మెక్సికోలోని కాన్కున్కు 326 మంది ప్రయాణికులతో అట్లాంటిక్ సముద్రం మీదుగా ప్రయాణిస్తోంది. ఆ సమయంలో పైలట్ మూతలేకుండా ఇచ్చినటువంటి కాఫీని కప్ హోల్డర్‌లో కాకుండా ట్రేలో ఉంచాడు. అయితే ప్యానెల్మీద ప్రమాదవశాత్తు కాఫీ ఒలికిపోయింది. దీంతో ప్యానెల్ నుంచి కాలిన వాసన రావడంతో పాటు పొగలు రావడం మొదలైంది. వెంటనే కెప్టెన్ అప్రమత్తమై విమానాన్ని దారి మళ్లించి, షానన్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ఈ ఘటనలో విమానంలోని 11 మంది సిబ్బంది సహా 326 మంది ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు. ఈ ఉదంతం అనంతరం అన్ని మార్గాల్లో ప్రయాణించే విమానాల్లో మూతలతో కూడిన కాఫీలు అందేలా చర్యలు తీసుకున్నట్లు థామస్ కుక్ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అలాగే పైలట్లకు అందించే ద్రవాలతో జాగ్రత్తగా ఉండాలని సూచించినట్టు పేర్కొన్నారు. తమ ఇంజనీర్ల బృందం విమానం పూర్తిగా తనిఖీ చేసి మరమ్మతుల తరువాత, మాంచెస్టర్ మీదుగా విమానం గమ్యానికి చేరుకుందని, ఈ వ్యవహారంలో ప్రయాణికుల అసౌకర్యానికి క్షమాపణలు తెలిపారు. -
విమానానికి తప్పిన ముప్పు
న్యూఢిల్లీ: 370 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిరిండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. పలు నియంత్రణ పరికరాలు విఫలమవడం, ఇంధన నిల్వలు అయిపోవడంతో పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించి న్యూజెర్సీలో విమానాన్ని సురక్షితంగా నేలకు దించారు. సెప్టెంబర్ 11న ఈ ఘటన జరగ్గా, అత్యవసర సమయంలో పైలట్లు, అమెరికా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ మధ్య జరిగిన సంభాషణల క్లిప్పింగ్ తాజాగా బహిర్గతమైంది. ’నియంత్రణ పరికరాలు పనిచేయడం లేదు. ఇంధనం కూడా తగినంతగా లేదు’ అని పైలట్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు చెప్పగా..‘క్షణంలో మీకు బదులిస్తాం’ అని అటువైపు నుంచి సమాధానం వచ్చింది. ‘మా వద్ద సింగిల్ క్రాస్ రేడియో అల్టీమీటర్ ఉంది. టీసీఎస్ వ్యవస్థ, ఆటో ల్యాండ్, వైండ్‌షీర్ వ్యవస్థ, ఆటోస్పీడ్ బ్రేక్, ఏపీయూ(ఆగ్జిలరీ పవర్ యూనిట్)లు పనిచేయడం లేదు’ అని పైలట్ అంటున్నట్లు ఆడియోలో వినిపించింది. విమానాన్ని ల్యాండ్ చేయడానికి ముందు పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పలు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించినట్లు వారి సంభాషణల ద్వారా తెలుస్తోంది. ఊహించని సాంకేతిక సమస్య తలెత్తినా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌చేసిన సిబ్బందిని ఎయిరిండియా ప్రశంసించింది. -
శంషాబాద్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం ఓ విమానాన్ని ఎయిర్ పోర్ట్ అధికారులు అత్యవసరంగా ల్యాండ్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి సౌదీ అరేబియా బయల్దేరిన విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఆ ప్రయాణికుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.