Vistara Flight Has Emergency Landing In Varanasi After Bird Hit - Sakshi
Sakshi News home page

పక్షి ఢీకొట్టడంతో విమానానికి పగుళ్లు.. అత్యవసర ల్యాండింగ్‌

Published Fri, Aug 5 2022 7:29 PM | Last Updated on Fri, Aug 5 2022 7:56 PM

Vistara Flight Has Emergency Landing In Varanasi After Bird Hit - Sakshi

లక్నో: దేశంలో వివిధ కారణాలతో విమానాలు దారి మళ్లించటం, అత్యవరంగా ల్యాండింగ్‌ చేస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా వారణాసి నుంచి ముంబయి వెళ్తున్న విస్తారా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఓ పక్షి విమానాన్ని ఢీకొట్టినట్లు డీజీసీఏ పేర్కొంది. దాంతో విమాన్ని వెనక్కు మళ్లించి ల్యాండింగ్‌ చేసినట్లు తెలిపింది. 

‘విస్తారా ఏ320 ఎయిర్‌క్రాఫ్ట్‌ వీటీ-టీఎన్‌సీ ఆపరేట్‌ చేస్తున్న యూకే622 విమానం సురక్షితంగా వారణాసిలో ల్యాండింగ్‌ అయింది. విమానం దిగినట్లు విమానయాన సంస్థ స్పష్టం చేసింది. పక్షి ఢీకొట్టటంతో ఎయిర్‌క్రాఫ్ట్ ముందుభాగం దెబ్బతిన్నది.’ అని ట్విట్టర్‌లో వెల్లడించింది డీజీసీఏ.

ఇదీ చదవండి: Go First Airlines: పక్షి ఢీ కొట్టడంతో విమానం అత్యవసర ల్యాండింగ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement