న్యూయార్క్‌-న్యూఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ | New York To Delhi Flight Diverted To Rome Full Details | Sakshi
Sakshi News home page

న్యూయార్క్‌-న్యూఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Published Mon, Feb 24 2025 7:19 AM | Last Updated on Mon, Feb 24 2025 7:19 AM

New York To Delhi Flight Diverted To Rome Full Details

న్యూయార్క్‌: ఇటీవలి కాలంలో బాంబు బెదిరింపుల సమస్యలు ఎక్కువయ్యాయి. కొంత మంది ఆగంతకులు, జులాయిలు సరదాగా ఫోన్‌ చేసి లేక మెయిల్‌ పెట్టి బెదిరింపులకు తెగబడుతున్నారు. తాజాగా అమెరికన్‌ ఎయిర్‌ లైన్స్‌కు బాంబు బెదిరింపులు రావడంతో ఇటలీ రాజధాని రోమ్‌లో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వివరాల ప్రకారం.. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన AA292 విమానంలో న్యూయార్క్‌ నుంచి ఢిల్లీ రావాల్సి ఉంది. ఈనెల 22వ తేదీన జేఎఫ్‌కే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాత్రి 8.14 గంటల సమయంలో టేకాఫ్‌ తీసుకుంది. అనంతరం, ఈ విమానంలో బాంబు ఉన్నట్టు బెదిరింపులు వచ్చాయి. దీంతో, అప్రమత్తమైన అధికారులు భద్రతా కారణాలతో విమానాన్ని ఇటలీలోని రోమ్‌కు దారి మళ్లించారు. దీంతో, రోమ్‌లోని లియోనార్డో డావిన్సీ ఫియుమిసినో ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. ఇటలీ ఎయిర్‌ ఫోర్స్‌ విమానాలు రక్షణగా రాగా బోయింగ్‌ విమానం ల్యాండవుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ సందర్బంగా విమానాశ్రయంలో అధికారులు మాట్లాడుతూ.. భద్రతా కారణాల రీత్యా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేయడం జరిగింది. ఈ విమానం ల్యాండింగ్‌ కారణంగా ఇతర విమానాల రాకపోకలపై ఎలాంటి ప్రభావం పడలేదు. విమానాశ్రయ కార్యకలాపాల్లో ఎలాంటి ఇబ్బంది రాలేదని చెప్పుకొచ్చారు. విమాన సిబ్బంది, ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నట్టు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement