![Newyork Bound Flight Took U Turn Mid Air In Canada - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/20/flight%20newyork.jpg.webp?itok=ozNB9l5U)
టొరంటో: కెనడాలోని టొరంటో విమానాశ్రయం నుంచి న్యూయార్క్ బయలుదేరిన విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మంటలు లేచాయి. దీంతో విమానాన్ని పైలట్ వెనక్కి తిప్పి మళ్లీ టొరంటో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశాడు. ఘటన జరిగిన సమయంలో విమానంలో 74 మంది ప్రయాణికులున్నారు.
విమానం టేకాఫ్ అయిన తర్వాత పైలట్ విమానాన్ని అత్యంత ఎత్తుకు తీసుకెళ్లాడు. ఈ సమయంలో విండ్‌షీల్డ్ వద్ద మిరుగులు వచ్చాయి. దీంతో పాటు కాక్‌పిట్‌లో వైరు కాలిన వాసనను పైలట్ గమనించాడు. దీంతో వెంటనే ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి తెలియజేశాడు. వారు ఓకే అనడంతో పైలట్ విమానాన్ని వెనక్కు తిప్పి మళ్లీ టొరంటోలో ల్యాండ్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment