Spark
-
మరో ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విక్రాంత్, మెహరీన్, రుక్సార్ థిల్లాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం స్పార్క్. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రానికి విక్రాంత్ దర్శకత్వం వహించారు. గతేడాది నవంబర్ 17న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.తాజాగా ఈ మూవీ మరో ఓటీటీకి వచ్చేసింది. దాదాపు విడుదలైన పది నెలల తర్వాత సన్ నెక్ట్స్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లోనూ అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతమందించారు.స్కార్క్ కథేంటంటే?లేఖ(మెహరీన్) కలలోకి ప్రతి రోజు ఓ వ్యక్తి వస్తుంటాడు. దీంతో ఆమె అతన్నే పెళ్లి చేసుకోవాలని భావిస్తుంది. స్నేహితులతో కలిసి అతని కోసం వెతుకుతుంటుంది. ఓ ఆస్పత్రిలో అనుకోకుండా అతన్ని చూస్తుంది. అతనే ఆర్య(విక్రాంత్ రెడ్డి). లేఖ ఎదురింట్లోనే ఉంటాడు. అతన్ని ప్రేమలో పడేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆర్య మాత్రం లేఖ ప్రపోజల్‌ని రిజెక్ట్ చేస్తాడు. ఇదిలా ఉంటే.. నగరంలో వరుసగా అమ్మాయిలు చనిపోతుంటారు. సడెన్‌గా సైకోలుగా మారి తమ కుటుంబ సభ్యులను చంపి, ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఈ హత్యలకు కారణం ఆర్యనే అని లేఖ తండ్రి(శ్రీకాంత్ అయ్యంగార్) ఆరోపిస్తాడు.పోలీసులు కూడా అతని కోసం గాలిస్తుంటారు. అసలు సిటీలో జరుగుతున్న హత్యలకు కారణం ఎవరు? అమ్మాయిలు సడెన్‌గా సైకోలుగా ఎందుకు మారుతున్నారు? ఆర్యకు ఈ మర్డర్లతో ఉన్న సంబంధం ఏంటి? వైజాగ్‌కు చెందిన జై.. ఆర్యగా పేరు మార్చుకొని హైదరాబాద్‌కు ఎందుకు వెళ్లాడు? యువతుల మరణాల వెనుక ఉన్న రహస్యం ఏంటి? జై ప్రియురాలు అనన్య(రుక్సార్ థిల్లాన్) ఎలా చనిపోయింది? ఈ మర్డర్లతో ఇండియన్ ఆర్మీలో పనిచేసే డాక్టర్ రుద్రకు ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. View this post on Instagram A post shared by SUN NXT (@sunnxt) -
టాటా సన్స్ మెగా ఐపీవో!
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా సన్స్ పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు ఈక్విటీ మార్కెట్ రీసెర్చ్ సంస్థ స్పార్క్ క్యాపిటల్ పేర్కొంది. టాటా గ్రూప్ ఎన్బీఎఫ్సీ హోల్డింగ్ కంపెనీ విలువను రూ. 7.8 లక్షల కోట్లుగా మదింపు చేసింది. గ్రూప్ కంపెనీల ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం విలువ మదింపు చేయగా.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రానున్న 18 నెలల్లో టాటా సన్స్ ఐపీవో చేపట్టనున్నట్లు తెలియజేసింది. అప్పర్‌లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా ఆర్బీఐ గతేడాది గుర్తింపునిచి్చన నేపథ్యంలో 2025 సెపె్టంబర్‌కల్లా తప్పనిసరిగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ కావలసి ఉన్నట్లు స్పార్క్ పేర్కొంది. ఇందుకు ఏడాదిన్నర కాలంలో పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసి ఉంటుందని తెలియజేసింది. దీంతో సంక్లిష్టంగా ఉన్న గ్రూప్ హోల్డింగ్ నిర్మాణం సరళతరమయ్యేందుకు వీలుంటుందని అభిప్రాయపడింది. కాగా.. ఇటీవల వెలువడిన సమాచారం ప్రకారం కంపెనీ రూ. 11 లక్షల కోట్ల విలువను అందుకోగలదని వెల్లడించింది. వెరసి ఐపీవో పరిమాణం రూ. 55,000 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేసింది. టాటా సన్స్ హోల్డింగ్స్‌లో 80 శాతం మోనిటైజబుల్ కానప్పటికీ పునర్వ్యవస్థీకరణ కారణంగా కంపెనీ రీరేటింగ్ను సాధించే వీలున్నట్లు పేర్కొంది. విలువ జోడింపు అన్‌లిస్టెడ్ పెట్టుబడులతో పలు మార్గాల ద్వారా టాటా సన్స్‌కు అదనపు విలువ జమకానున్నట్లు స్పార్క్ క్యాపిటల్ తెలియజేసింది. ఇటీవల సెమీకండక్టర్స్ తదితర ఆధునికతరం విభాగాలలోకి టాటా గ్రూప్ ప్రవేశించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. టాటా ఎలక్ట్రానిక్స్.. చిప్ తయారీ ప్రణాళికలు ప్రకటించిన విషయం విదితమే. టాటా టెక్నాలజీస్, టాటా మెటాలిక్స్, ర్యాలీస్ తదితర అనుబంధ సంస్థలను పేర్కొంది. ఫలితంగా టాటా గ్రూప్ మరో రూ. 1–1.5 లక్షల కోట్ల విలువను జోడించుకోనున్నట్లు అంచనా వేసింది. లిస్టెడ్, అన్ లిస్టెడ్ కంపెనీలు, ప్రిఫరెన్స్ షేర్లు, ఫండ్స్‌లో పెట్టుబడులను పరిగణించి విలువను మదింపు చేసింది. టీసీఎస్ బలిమి టాటా సన్స్ విలువలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ అతిపెద్ద వాటాను ఆక్రమిస్తోంది. టీసీఎస్ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం టాటా సన్స్ వాటా విలువ రూ. 10 లక్షల కోట్ల వరకూ ఉంటుంది. అన్‌లిస్టెడ్ కంపెనీలు, పెట్టుబడులుకాకుండా గ్రూప్‌లోని ఇతర లిస్టెడ్ దిగ్గజాలు టాటా మోటార్స్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్‌లో యాజమాన్య వాటాలు కలిగి ఉంది. టాటా కెమికల్స్‌లో అత్యధిక స్థాయి(కంపెనీ విలువలో 80 శాతం)లో యాజమాన్య హక్కులను కలిగి ఉంది. కాగా.. టాటా సన్స్‌లో దొరాబ్జీ టాటా ట్రస్ట్ 28 శాతం, రతన్ టాటా ట్రస్ట్ 24 శాతం, సైరస్ మిస్త్రీ కుటుంబ పెట్టుబడి సంస్థ(స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్) 9 శాతం, ఇతర ప్రమోటర్లు 14 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. -
Toronto: న్యూయార్క్ వెళ్లే ఫ్లైట్‌లో మంటలు
టొరంటో: కెనడాలోని టొరంటో విమానాశ్రయం నుంచి న్యూయార్క్ బయలుదేరిన విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మంటలు లేచాయి. దీంతో విమానాన్ని పైలట్ వెనక్కి తిప్పి మళ్లీ టొరంటో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశాడు. ఘటన జరిగిన సమయంలో విమానంలో 74 మంది ప్రయాణికులున్నారు. విమానం టేకాఫ్ అయిన తర్వాత పైలట్ విమానాన్ని అత్యంత ఎత్తుకు తీసుకెళ్లాడు. ఈ సమయంలో విండ్‌షీల్డ్ వద్ద మిరుగులు వచ్చాయి. దీంతో పాటు కాక్‌పిట్‌లో వైరు కాలిన వాసనను పైలట్ గమనించాడు. దీంతో వెంటనే ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి తెలియజేశాడు. వారు ఓకే అనడంతో పైలట్ విమానాన్ని వెనక్కు తిప్పి మళ్లీ టొరంటోలో ల్యాండ్ చేశాడు. ఇదీ చదవండి.. సొంత దేశంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు -
Spark Review: 'స్పార్క్' సినిమా రివ్యూ
టైటిల్: స్పార్క్ నటీనటులు: విక్రాంత్, మెహరీన్, రుక్సార్ థిల్లాన్, నాజర్ తదితరులు నిర్మాత: విక్రాంత్ రచన-దర్శకత్వం-స్క్రీన్‌ప్లే: విక్రాంత్ సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్ విడుదల తేది: 2023 నవంబర్ 17 (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?) స్కార్క్ కథేంటంటే? లేఖ(మెహరీన్) కలలోకి ప్రతి రోజు ఓ వ్యక్తి వస్తుంటాడు. దీంతో ఆమె అతన్నే పెళ్లి చేసుకోవాలని భావిస్తుంది. స్నేహితులతో కలిసి అతని కోసం వెతుకుతుంటుంది. ఓ ఆస్పత్రిలో అనుకోకుండా అతన్ని చూస్తుంది. అతనే ఆర్య(విక్రాంత్ రెడ్డి). లేఖ ఎదురింట్లోనే ఉంటాడు. అతన్ని ప్రేమలో పడేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆర్య మాత్రం లేఖ ప్రపోజల్‌ని రిజెక్ట్ చేస్తాడు. ఇదిలా ఉంటే.. నగరంలో వరుసగా అమ్మాయిలు చనిపోతుంటారు. సడెన్‌గా సైకోలుగా మారి తమ కుటుంబ సభ్యులను చంపి, ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఈ హత్యలకు కారణం ఆర్యనే అని లేఖ తండ్రి(శ్రీకాంత్ అయ్యంగార్) ఆరోపిస్తాడు. పోలీసులు కూడా అతని కోసం గాలిస్తుంటారు. అసలు సిటీలో జరుగుతున్న హత్యలకు కారణం ఎవరు? అమ్మాయిలు సడెన్‌గా సైకోలుగా ఎందుకు మారుతున్నారు? ఆర్యకు ఈ మర్డర్లతో ఉన్న సంబంధం ఏంటి? వైజాగ్‌కు చెందిన జై.. ఆర్యగా పేరు మార్చుకొని హైదరాబాద్‌కు ఎందుకు వెళ్లాడు? యువతుల మరణాల వెనుక ఉన్న రహస్యం ఏంటి? జై ప్రియురాలు అనన్య(రుక్సార్ థిల్లాన్) ఎలా చనిపోయింది? ఈ మర్డర్లతో ఇండియన్ ఆర్మీలో పనిచేసే డాక్టర్ రుద్రకు ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే? ఇదో సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. దానికి ట్రయాంగిల్ లవ్‌స్టోరీని జోడించారు. ఫస్టాఫ్‌లో ఒకపక్క హీరోహీరోయిన్లతో లవ్‌ట్రాక్ నడిపిస్తూనే.. మరోపక్క వరుస హత్యలు చూపిస్తూ ఆసక్తిని పెంచేశాడు దర్శకుడు. హత్యలకు సంబంధించిన సన్నివేశాలు భయంకరంగా ఉంటాయి. లవ్‌ట్రాక్ మాత్రం రొటీన్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక అసలు కథ ద్వితీయార్థంలో మొదలవుతుంది. నాజర్,గురు సోమసుందరం పాత్రల ఎంట్రీ తర్వాత కథనం ఆసక్తికరంగా మారుతుంది. ఎదుటి మనిషిలోని మెదడును కంట్రోల్ చేసే ప్రయోగం సఫలం అయితే జరిగే అనార్థాలను గురించి ఇందులో చర్చించారు. హత్యలతో సంబంధం ఉన్నవారిని గుర్తించేందుకు హీరో చేసే ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ఆసక్తికరంగా ఉంటాయి. దర్శకుడు ఎంచుకున్న కథ చాలా కొత్తది. పాన్ ఇండియా సబ్జెక్టు. ఇలాంటి భారీ కథకు స్టార్ హీరో అయితే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే? విక్రాంత్ కొత్తవాడే అయినా.. తన పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు. ఒకవైపు దర్శకత్వ బాధ్యతలు చేపడుతూనే.. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఆర్య, జై పాత్రల్లో చక్కగా నటించాడు. కొన్ని చోట్ల నటనలో అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తుంది. డ్యాన్స్ విషయంలో విక్రాంత్ ఇంకాస్త కసరత్తు చేయాల్సింది. లేఖ పాత్రలో మెహరిన్ ఒదిగిపోయింది. ఇక హీరో ప్రియురాలు అనన్యగా రుక్సార్ చక్కగా నటించింది. తెరపై అందంగా కనిపించింది. విలన్‌గా గురు సోమసుందరం తనదైన నటనతో మెప్పించాడు. సుహాసినీ మణిరత్నం సరికొత్త పాత్రలో నటించింది. నాజర్, రాహుల్ రవీంద్ర, వెన్నెల కిశోర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక పరంగా ఈ సినిమా పర్వాలేదు. హేషం అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో ప్రతి సీన్ చాలా రిచ్‌గా కనిపిస్తుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు) -
నాకు కొత్తగా అనిపించింది
‘‘స్పార్క్’ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ మూవీలో నేను లేఖ పాత్రలో కనిపిస్తాను. ఎంతోప్రాధాన్యత ఉన్న రోల్ నాది. సినిమా నాతోనే ప్రారంభం అవుతుంది.. నాతోనే ముగుస్తుంది.. ఇలాంటి థ్రిల్లర్ మూవీలో నటించటం నాకు కూడా కొత్తగా అనిపించింది. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరోయిన్ మెహరీన్ అన్నారు. విక్రాంత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్ లైఫ్’. మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లుగా నటించారు. డెఫ్ ఫ్రాగ్ ప్రోడక్షన్సపై లీల నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మెహరీన్ పంచుకున్న విశేషాల.. ► కొత్తవాళ్లు, అనుభవం ఉన్న నటీనటులతో పని చేసే క్రమంలో చాలా విషయాలు నేర్చుకుంటాం. ‘స్పార్క్’ సినిమాతో హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న విక్రాంత్ ఓ రోజు ఫోన్ చేసి, ‘మీతో కలిసి నటించాల నుంది’ అన్నారు. కథ నాకు నచ్చడంతో ఓకే చెప్పాను. విక్రాంత్‌గారు ఈ మూవీ కోసం చేసిన పరిశోధన నన్ను ఆకట్టుకుంది. నా పాత్ర, లుక్ కొత్తగా ఉంటుందని చెప్పారు.. నా లుక్, పాటలు తెరకెక్కించిన విధానం నన్నెంతో ఆకట్టుకుంది. విక్రాంత్ చెప్పిన మాటను నిలబెట్టుకున్నారని నాకు అర్థమైంది. లీల గారు ఎక్కడా రాజీపడకుండా ఈ మూవీ తీశారు. ► విక్రాంత్ అమెరికాలో మంచి స్థాయిలో స్థిరపడ్డారు. అయితే సినిమా చేయాలనే కలని పూర్తి చేసుకోవటానికి ఇక్కడకు వచ్చారు. అమెరికాలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల నేపథ్యంలో ‘స్పార్క్’ కథను తయారు చేసుకున్నారు విక్రాంత్. ఈ కథకి కమర్షియల్ అంశాలు జోడించి థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. తొలిసారి హీరోగా చేస్తూనే డైరెక్షన్ చేయటం ఎంతో కష్టం. కానీ, విక్రాంత్ ఎంతో కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాడు. తను ఓ డెబ్యూ హీరోగా, డెబ్యూ డైరెక్టర్‌గా మెప్పిస్తాడు. ►జీవితంలో ఉన్నతి స్థాయికి ఎదగాలని ప్రతి మనిషి కలలు కంటుంటారు.. నేను కూడా అంతే. నా కలలను నిజం చేసుకునే క్రమంలోనే ముందుకు వెళుతున్నాను. ఈ సినిమాలో నేను చేసిన లేఖ పాత్ర కూడా అలాగే ఉంటుంది.. అందుకే ఈ పాత్రకు నేను కనెక్ట్ అయ్యాను. నటిగా ప్రతి సినిమా నాకెంతో ప్రత్యేకమైనదే. కథ, నా పాత్ర నచ్చితేనే చేస్తాను.. లేకుంటే చేయను. అది నా కెరీర్‌కి ఎంతో సాయపడుతోంది. నన్ను ఇష్టపడేవారు, ప్రేక్షకులే నాలో స్ఫూర్తి నింపుతుంటారు. పాత్ర ఏదైనా నటిగా రెండు వందల శాతం న్యాయం చేయటానికి ప్రయత్నిస్తాను. ∙నేను ఏదైనా వేడుకలకి వెళ్లినప్పుడు, నా సినిమా ప్రమోషన్స్‌లో ఉన్నప్పుడు ఎవరైనా నేను చేసిన పాత్ర పేరుతో పిలిస్తే నాకెంతో సంతోషంగా ఉంటుంది. చాలా మంది ఇప్పటికీ నా తొలి చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ లోని మహాలక్ష్మి పాత్ర పేరుతో పిలుస్తుండటం హ్యాపీ. -
స్పార్క్ నా ఎమోషనల్ జర్నీ
విక్రాంత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్: ఎల్.ఐ.ఎఫ్.ఈ’. ఇందులో మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. డెఫ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై లీల నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకులు హరీష్ శంకర్, మారుతి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని, ఈ సినిమా విజయం సాధించాలని కోరారు. ఈ వేడుకలో విక్రాంత్ మాట్లాడుతూ– ‘‘అమెరికాలో జరిగిన కొన్ని ఘటనలకు కమర్షియల్ అంశాలు జోడించి ‘స్పార్క్’ కథ రాసుకున్నాను. నేనే కథ రాసుకుని, హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తానన్నప్పుడు కొందరు వద్దన్నారు. కానీ ఈ సినిమా నా కల. నా కలకు మా కో డైరెక్టర్ స్వామిగారి అనుభవాన్ని జోడించి ఈ సినిమాను పూర్తి చేశాను. కొన్ని కష్టాలు పడ్డాను. లీల ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమా నాకు పెద్ద ఎమోషనల్ జర్నీ’’ అన్నారు విక్రాంత్. ‘‘ఈ సినిమాలో సైంటిస్ట్ రోల్ చేశాను’’ అన్నారు సుహాసిని. ‘‘సినిమా చూశాను. బాగా వచ్చింది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు లీల. -
‘స్పార్క్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సినిమా కోసం జాబ్ వదిలేసి వచ్చేసా: హీరో విక్రాంత్
-
నీ ముఖానికి నువ్వు హీరో ఏంటి..?
-
‘స్పార్క్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఏమా అందంఏమా అందం
విక్రాంత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్.. ఎల్.ఐ.ఎఫ్.ఈ’. మెహరీన్ ఫిర్జాదా, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. డెఫ్ ఫ్రాగ్ ్ర΄÷డక్షన్స్పై రూ΄÷ందిన ఈ చిత్రం నవంబరు 17న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘ఏమా అందం.. ఏమా అందం.. భామా నీకు భువితో ఏమి సంబంధం’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విక్రాంత్, రుక్సార్ కాంబినేషన్లో ఈ పాట చిత్రీకరించారు. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరచిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, సిధ్ శ్రీరామ్ పాడారు. -
యాక్షన్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ పూర్తి
విక్రాంత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్ ఎల్.ఐ.ఎఫ్.ఈ’. మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లుగా నటించారు. విక్రాంత్ డెఫ్ ఫ్రాగ్ ప్రోడక్షన్స్పై రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా హీరో–డైరెక్టర్ విక్రాంత్ మాట్లాడుతూ– ‘‘సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. భావోద్వేగాలు, ప్రేమ, భారీ ఫైట్స్‌తో ఈ మూవీ రూపొందింది. ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ అనుభూతినిచ్చే సినిమా ఇది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్ 17న ఈ సినిమాని రిలీజ్ చేస్తాం’’ అన్నారు. -
బుడి బుడి నడకల నుంచి సూపర్ స్పీడ్ వరకు...
సక్సెస్ అనేది రాత్రికి రాత్రి వచ్చేది కాదు. నిద్రలేని రాత్రులు ఎన్నో గడపాల్సి ఉంటుంది. తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, విజయం కోసం ఎదురు చూస్తూ ఏఐ ఇంగ్లీష్ ట్యూటర్ స్టార్టప్ ‘స్పార్క్ స్టూడియో’ ద్వారా ఘన విజయం సాధించింది అనుశ్రీ గోయల్... కొన్ని సంవత్సరాల క్రితం... స్టాన్ఫోర్డ్(యూఎస్)లో యూత్ ఫెయిల్యూర్ స్టార్టప్‌ల గురించి పాల్ గ్రహమ్ విశ్లేషణాత్మకమైన ప్రసంగం ఇచ్చాడు. ‘స్టార్టప్‌కు సంబంధించిన సమస్త విషయాలపై దృష్టి పెడుతున్నారు. ప్రజలు బాగా కోరుకునేది ఏమిటి అనే కీలకమైన విషయాన్ని మాత్రం మరిచిపోతున్నారు’ పాల్ గ్రహమ్ అన్నప్పుడు హాల్లో చప్పట్లు మారుమోగాయి. ఆ ప్రేక్షకులలో అనుశ్రీ గోయెంకా ఉంది. అనుశ్రీకి గ్రహమ్ ఉపన్యాసం ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. అహ్మదాబాద్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన అనుశ్రీ మానిటర్ గ్రూప్‌లో కన్సల్టంట్గా అయిదు సంవత్సరాలు పనిచేసింది. ఆ తరువాత స్క్రోల్ మీడియా, స్విగ్గీలో పనిచేసింది. ఉద్యోగం యాంత్రికం అనిపించిందో, ఇంతకంటే చేయడానికి ఏం లేదు.. అనే నిర్లిప్తత ఆవహించిందో తెలియదు కానీ చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి కొత్త దారిలోకి వచ్చింది. ‘వ్యాపారంపై నా ముద్ర ఉండాలి. అది నాకు సంతోషం కలిగించేలా ఉండాలి’ అనుకుంటూ రంగంలోకి దిగింది అనుశ్రీ. పది సంవత్సరాలు కార్పొరేట్ ప్రపంచంలో పనిచేసిన అనుశ్రీ గ్రహమ్ ప్రసంగాన్ని పదేపదే గుర్తు తెచ్చుకుంటూ బెంగళూరు కేంద్రంగా ‘స్పార్క్ స్టూడియో’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం మొదలుపెట్టింది. ‘స్పార్క్ స్టూడియో’ అనేది పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఎక్స్ట్రా కరిక్యులర్ లెర్నింగ్ అండ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్. మొదట ‘స్పార్క్ స్టూడియో’ ఐడియాను శ్రేయోభిలాషులు, ఇండస్ట్రీ ఎనలిస్ట్లకు చెప్పినప్పుడు– ‘సక్సెస్ కావడం కష్టం’ అంటూ ఎన్నో కారణాలు చెప్పారు. అయినా వెనకడుగు వేయలేదు అనుశ్రీ. ‘మన దేశంలో హై–క్వాలిటీ ఆర్ట్స్, లిబరల్ ఎడ్యుకేషన్‌కు కొరత ఉంది’ తాను తరచుగా విన్న మాట ‘స్పార్క్ స్టూడియో’కు శ్రీకారం చుట్టడానికి కారణం అయింది. పిల్లలకు ఆన్లైన్ బోధన చేయడానికి ‘స్పార్క్ స్టూడియో’ ద్వారా దేశవ్యాప్తంగా పేరున్న పెయింటర్లు, మ్యూజిషియన్లు, ఇతర ఆర్టిస్ట్‌లను ఒకే వేదిక మీదికి తీసుకు వచ్చింది అనుశ్రీ. ‘స్పార్క్ స్టూడియో’ ప్రారంభమైన కొద్ది నెలల తరువాత... ‘ఎక్స్ట్రా కరిక్యులర్ మార్కెట్లో విపరీతమైన పోటీ ఉంది. మీరు చాలా ఆలస్యంగా దీనిలోకి అడుగు పెట్టారు. ఇప్పటికే ఎంతోమంది సక్సెస్ సాధించారు. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి చేసేదేమిటి?’ ఇలాంటి కామెంట్స్ ఎన్నో వినిపించాయి. ‘వంద వ్యాపారాల్లో నీదొకటి అయినప్పుడు దానిపై నీదైన ముద్ర, శైలి ఉండాలి’ అని గ్రహమ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తన స్నేహితులైన కౌస్తుబ్ ఖడే, జ్యోతిక సహజనందన్, నమిత గోయెంకాలతో ఒక టీమ్‌గా ఏర్పడింది అనుశ్రీ. ‘నేను బాగా పేరున్న స్కూల్లో చదువుకున్నాను. అయితే హై–క్వాలిటీ ఆర్ట్స్ కరికులమ్‌కు అక్కడ చోటు లేదు. స్పార్క్ స్టూడియో ద్వారా విద్యార్థులకు ఉపయోగపడే నిర్మాణాత్మకమైన కరికులమ్‌ను డిజైన్ చేశాము. పిల్లలు యానిమేషన్, మ్యూజిక్, ఫొటొగ్రఫీ...ఎన్నో నేర్చుకోవచ్చు. తమ పిల్లలు ఎన్నో కళలు నేర్చుకోవచ్చు అనే ఆలోచన తల్లిదండ్రులకు బాగా నచ్చింది. ఆర్ట్స్, మ్యూజిక్ ద్వారా పిల్లల్లో భాషా నైపుణ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతుంది అని ఎంత నచ్చజెప్పినా, వారు డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా లేకపోవడం అసలు సమస్య. మార్కెట్ అంటే ఇదే అనే విషయం ఆలస్యంగా అర్థమైంది. ఇలా ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నాను’ అంటుంది అనుశ్రీ. రెండు సంవత్సరాల ‘స్పార్క్ స్టూడియో’ ప్రయాణం లాభాలు లేవు, నష్టాలు లేవు అన్నట్లుగా ఉండేది. అప్పటికే కొన్ని ప్రసిద్ధ ఎక్స్ట్రాకరిక్యులర్ ఎడ్టెక్ స్టార్టప్‌లు మూత పడ్డాయి. ఈ నేపథ్యంలో ‘ఏం మిస్ అవుతున్నాం’ అంటూ ఆలోచిస్తున్న సమయంలో అనుశ్రీకి తట్టిన ఐడియా....పబ్లిక్ స్పీకింగ్ కోర్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఈ రెండు అంశాలు చేర్చడంతో అప్పటి వరకు బుడి బుడి నడకల ‘స్పార్క్ స్టూడియో’ వేగం పుంజుకుంది. సక్సెస్‌ఫుల స్టార్టప్‌గా నిలిచింది. ‘నమ్మకమే వెన్నెముకగా ఉన్న వ్యాపారం ఇది. నమ్మకాన్ని డబ్బుతో కొనలేము. కష్టపడి సంపాదించుకోవాలి’ అంటుంది అనుశ్రీ గోయెంక. నమ్మకమే వెన్నెముకగా ఉన్న వ్యాపారం ఇది. నమ్మకాన్ని డబ్బుతో కొనలేము. కష్టపడి సంపాదించుకోవాలి. – అనుశ్రీ గోయెంకా తన బృందంతో అనుశ్రీ గోయెంకా -
వినూత్నమైన క్రైమ్ డ్రామాగా ‘స్పార్క్ 1.O ’
ప్రీతి సుందర్, భవ్యశ్రీ, హితేంద్ర, రాము ప్రధాన పాత్రల్లో యంగ్ డైరెక్టర్ సురేష్ మాపుర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘స్పార్క్ 1.O’. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా క్రైమ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అరుణోదయ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై వి.హితేంద్ర నిర్మిస్తున్నారు. ఇటీవల హీరో శ్రీకాంత్ విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇద్దరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ నడుమ సాగే వినూత్నమైన క్రైమ్ డ్రామాగా స్పార్క్ 1.O తెరకెక్కింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం ఆగస్టు ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రేజీ క్రైమ్ ఎంటర్టైనర్ చిత్రంలో నటించడం తనకు చాలా సంతోషంగా ఉందని హీరోయిన్స్ లో ఒకరైన భవ్యశ్రీ పేర్కొన్నారు. -
సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘స్పార్క్ 1.O’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్
ప్రీతి సుందర్, భవ్యశ్రీ, హితేంద్ర, రాము ప్రధాన పాత్రల్లో యంగ్ డైరెక్టర్ సురేష్ మాపుర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘స్పార్క్ 1.O’. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా క్రైమ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అరుణోదయ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై వి.హితేంద్ర నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న ఈ క్రేజీ క్రైమ్ ఎంటర్టైనర్ ట్రైలర్‌ని ప్రముఖ హీరో శ్రీకాంత్ విడుదల చేసి, చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇద్దరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ నడుమ సాగే వినూత్నమైన క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అందరికి నచ్చుతుందని నిర్మాత హితేంద్ర అన్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. -
ఆర్జీవీ OTTలో బిగ్‌బాస్ బ్యూటీ దివి మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
బిగ్‌బాస్ సీజన్-4తో తర్వాత యూత్‌లో బాగా క్రేజ్ సంపాదించుకున్న నటి దివి. అంతకుముందు పలు సినిమాల్లో నటించినా ఈ భామకు పెద్దగా గుర్తిపు రాలేదు. కానీ బిగ్‌బాస్ 4వ సీజన్లో హౌజ్‌లో అడుగు పెట్టి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఉన్నది కొద్ది రోజులే అయినా అందరి దృష్టిని ఆకర్షించింది. తన అందం, అభినయం, ముక్కుసూటి తనంతో ఎంతోమందిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ. తాజాగా క్యాబ్ స్టోరీస్ అనే చిత్రంలో నటించింది ఈ భామ. కెవిఎన్ రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్ కృష్ణ నిర్మించారు. అయితే కరోనా ఎఫెక్ట్‌తో ఈ మూవీని థియేటర్లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరు వర్మతో కలిసి స్పార్క్ అనే ఓటీటీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాంగోపాల్ వర్మ తన భవిష్యత్తు ప్రాజెక్టులన్నీ స్పార్క్ ఓటీటీలోనే అందుబాటులో ఉంచేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటికే ఇందులో వర్మ తెరకెక్కించిన డి చిత్రం విడుదలైంది. తాజాగా దివి లేటెస్ట్ మూవీ క్యాబ్ స్టోరీస్ స్పార్క్‌లో ఈనెల 28నుంచి స్ర్టీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీలో గిరిధర్, ధన్‌రాజ్, ప్రవీణ్,శ్రీహాన్, సిరి కీలక పాత్రలు పోషించారు. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందించగా, సాయి కార్తీక్ సంగీతం అందించారు. చదవండి : ఐటెం గర్ల్ అయినందుకు ఎలాంటి బాధ లేదు: రాఖీ సావంత్ -
పిడుగుపాటుకు యువకుడి మృతి
అమృతలూరు (గుంటూరు) : తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తూ ఉండబట్టలేక తానూ వారి కష్టంలో పాలుపంచుకోవాలని వ్యవసాయ పనుల కోసం జిల్లాలు దాటి వచ్చిన యువకుడు పిడుగుపాటుకు బలయ్యాడు. ఇంకా నూనూగుమీసాల వయసులోనే పట్టుమని పదహారేళ్లు నిండకుండానే విధి ఆ యువకుడిని కబళించింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం, చానమిల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఖరీఫ్ సీజన్ పనులకు చిన్న ట్రాక్టర్లు వేసుకుని దమ్ము చేసేందుకు గోవాడకు పది రోజుల క్రితం వలస వచ్చారు. వారిలో వెజ్జు కార్తిక్ (16) మండల పరిధిలోని గోవాడలో పాంచాళవరం డొంకలోని తుమ్మల కృష్ణాజీ పొలంలో చిన్న ట్రాక్టర్‌తో దమ్ము చేస్తుండగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో పిడుగు పడింది. ఆ పిడుగు చేలోని నీటిలో పడగా కార్తీక్ నీటిలో షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. చెరుకుపల్లి ప్రై వేటు వైద్యశాలకు తరలించగా, మృతి చెందాడని వైద్యులు నిర్ధారించడంతో మృతదేహాన్ని స్వగ్రామం చానమిల్లికి తరలించారు. -
కదలికే.. వెలుగు
ఒక చిన్న ఆలోచన గొప్ప మలుపునకు కారణమవుతుంది. చిన్న పిల్లల ఆట నుంచి, సంగీత పరికరం నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన ఓ చిన్న పరికరం ఎంతో మంది జీవితాలకు వెలుగునిస్తోంది. కేవలం కాసేపు అటూ ఇటూ కదిలిస్తే చాలు.. చార్జింగ్ అయ్యి వెలుగునిచ్చే ఆ పరికరమే.. ‘స్పార్క్’. సుధా ఖేతర్పాల్ అనే ప్రవాస భారతీయ సంగీత విద్వాంసురాలు దీనికి రూపకల్పన చేశారు. కేవలం 12 నిమిషాల పాటు అటూ ఇటూ ఊపితే చార్జింగ్ అయి.. దాదాపు గంట పాటు వెలుగునిస్తుంది. అంతేకాదు దీనితో సెల్ఫోన్లు వంటి పరికరాలను కూడా చార్జ్ చేసుకోవచ్చు. కెన్యాలోని విద్యుత్ సరఫరాలేని ప్రాంతాల్లో విద్యార్థులకు ఈ ‘స్పార్క్’ను ఇచ్చి పరిశీలించారు కూడా. అక్టోబర్ నుంచి దీనిని విక్రయించనున్నారు. ఈ పరికరాలను భారీ సంఖ్యలో తయారుచేసేందుకు అవసరమైన నిధుల కోసం సుధ ఈ ప్రాజెక్టును క్లౌడ్ ఫండింగ్ వెబ్సైట్ కిక్‌స్టార్టర్‌లో పెట్టారు. గుండె ఆకారంలో ఉండే ఈ పరికరంలో లోహపు గుండ్లను పెట్టడం ద్వారా ఊపినప్పుడు ధ్వని వచ్చేలా ఏర్పాటు చేశారు. దీంతో పిల్లల ఆటా అవుతుంది.. ‘స్పార్క్’ చార్జింగూ అవుతుంది. విద్యుత్ సరఫరా లేని ప్రాంతాల్లోని విద్యార్థులకు ఇదిఎంతో తోడ్పడుతుందని సుధ చెబుతున్నారు. ఎలా పనిచేస్తుంది: కదులుతున్న అయస్కాంత క్షేత్రం విద్యుదావేశాన్ని పుట్టించగలదన్న ఒక సాధారణ భౌతిక శాస్త్ర సూత్రం ఆధారంగా ఈ ‘స్పార్క్’ పనిచేస్తుంది. దీనిలోపల ఒక రాగి చుట్టను దాని మధ్యగా కదిలే అయస్కాంతాన్ని అమర్చారు. వీటికి సర్క్యూట్ బోర్డును, బ్యాటరీని, డయోడ్లను అనుసంధానించారు. దీనిలో అయస్కాంతం అటూ ఇటూ కదిలిన కొద్దీ విద్యుత్ ఉత్పత్తయి బ్యాటరీలో నిల్వ అవుతుంది.