సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘స్పార్క్ 1.O’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్‌ | Srikanth Launches First Look Poster Of Spark Movie | Sakshi
Sakshi News home page

సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘స్పార్క్ 1.O’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్‌

Published Wed, Jul 20 2022 5:53 PM | Last Updated on Wed, Jul 20 2022 5:53 PM

Srikanth Launches First Look Poster Of Spark Movie - Sakshi

 ప్రీతి సుందర్, భవ్యశ్రీ, హితేంద్ర, రాము  ప్రధాన పాత్రల్లో యంగ్‌ డైరెక్టర్‌ సురేష్ మాపుర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘స్పార్క్ 1.O’. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా క్రైమ​ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని  అరుణోదయ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై  వి.హితేంద్ర నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న ఈ క్రేజీ క్రైమ్ ఎంటర్టైనర్ ట్రైలర్‌ని ప్రముఖ హీరో శ్రీకాంత్ విడుదల చేసి, చిత్ర యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇద్దరు పవర్‌ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ నడుమ సాగే వినూత్నమైన క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అందరికి నచ్చుతుందని నిర్మాత హితేంద్ర అన్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement