యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా షూటింగ్‌ పూర్తి | Spark LIFE releasing Pan India wide on November 17th | Sakshi
Sakshi News home page

'స్పార్క్‌ ఎల్‌.ఐ.ఎఫ్‌.ఈ' సినిమా షూటింగ్‌ పూర్తి

Published Sat, Aug 26 2023 12:38 AM | Last Updated on Sat, Aug 26 2023 11:04 AM

Spark LIFE releasing Pan India wide on November 17th - Sakshi

విక్రాంత్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్‌ ఎల్‌.ఐ.ఎఫ్‌.ఈ’. మెహరీన్, రుక్సార్‌ థిల్లాన్‌ హీరోయిన్లుగా నటించారు. విక్రాంత్‌ డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రోడక్షన్స్‌పై రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది.

ఈ సందర్భంగా హీరో–డైరెక్టర్‌ విక్రాంత్‌ మాట్లాడుతూ– ‘‘సైకలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. భావోద్వేగాలు, ప్రేమ, భారీ ఫైట్స్‌తో ఈ మూవీ రూపొందింది. ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్‌ అనుభూతినిచ్చే సినిమా ఇది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్‌ 17న ఈ సినిమాని రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement