ruksar
-
Rukhsar Saeed: టేస్ట్ ఆఫ్ కశ్మీర్
కశ్మీర్ పేరు చెప్తే అందమైన ప్రదేశాలే గుర్తొస్తాయి. కాని ఆ లోయలో దాగిన రుచులు అన్వేషిస్తే తప్ప తెలియదు. శాకాహారమైనా మాంసాహారమైనా స్వచ్ఛమైన దినుసులతో గుమ్మెత్తిస్తారు. ‘మేము ఎలా వండుతామో నా వంట చూసి తెలుసుకోండి’ అని కశ్మీర్ వంట చేసి చూపుతోంది రుక్సార్ సయీద్. కశ్మీర్ మహిళలు పెద్దగా పాల్గొనని ‘మాస్టర్ షెఫ్ ఆఫ్ ఇండియా’ తాజా సిరీస్‌కు రుక్సార్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. పోటీని తట్టుకుని టాప్ 12లో నిలిచిన ఆమెను చూసి కశ్మీర్లో ఆడవాళ్లు గర్విస్తున్నారు. సోనీ లివ్‌లో ప్రసారమవుతున్న తాజా సీజన్ ‘మాస్టర్ షెఫ్ ఆఫ్ ఇండియా’ కోసం రుక్సార్ సయీద్ (33) ‘షబ్ దేక్’ అనే కశ్మీరీ వంట చేసింది. ‘ఇది మా అమ్మమ్మ నుంచి మా అమ్మకు, మా అమ్మ నుంచి నాకు అందిన వంట. ముదురు గుమ్మడికాయ, నాటుకోడి, ఆల్‌బకారా ఎండుగుజ్జు వేసి చేస్తాం. చాలా బాగుంటుంది’ అంది. జడ్జీలుగా ఉన్న ప్రముఖ షెఫ్‌లు వికాస్ ఖన్నా, రణ్వీర్ బ్రార్, పూజా ధింగ్రా... కొద్దిగా రుచి చూసి ‘అద్భుతం’ అన్నారు. ఆమె ఇంకో ఎపిసోడ్లో ‘షికారా రైడ్’ అనే అల్పాహారం చేసింది. మటన్ కోఫ్తాను, పుదీనా మసాలాతో రంగరించి చేసింది. టేస్ట్ అదిరిందని వేరే చె΄్పాలా? ‘కశ్మీర్ లోయంతా రకరకాల మసాలా దినుసులు, మేం మాత్రమే తినే ఆకుకూరలు, కాయగూరలు ఉన్నాయి. వాటిని వండే పద్ధతి అందరికీ తెలియదు. మాస్టర్ షెఫ్ ద్వారా దేశమంతటికీ ఆ రుచులను తెలియజేయాలనుకుంటున్నాను’ అంటుంది రుక్సార్ సయీద్. ఆమె సంకల్పం గట్టిదిలాగుంది. తాజా సీజన్లో మహా మహా వంటగాళ్లు, వంటగత్తెలు పోటీ పడితే తుది జాబితాలో 22 మంది ఉంటే, వారిలో చాలామందిని అధిగ‘మించి’ టాప్ 12కు చేరింది రుక్సార్. దాంతో కశ్మీర్లో ఇప్పుడు ఈ షోను అక్కడి స్త్రీలు చూస్తున్నారు. రుక్సార్‌ను తమ ప్రతినిధిగా, తమ సామర్థ్యాలకు కొలమానంగా చూస్తున్నారు. ‘ఆ సంతోషం చాలు నాకు. నన్ను స్ఫూర్తిగా తీసుకుని స్త్రీలు ముందుకు రావాలి’ అంటుంది రుక్సార్. ఫుడ్ టెక్నాలజీలో డాక్టరేట్ రుక్సార్ సయీద్‌ది పుల్వామా జిల్లాలోని పామ్పోర్ అనే ్రపాంతం. నిత్యం మంచు కురిసే ఈ ్రపాంతంలో కవులు ఎక్కువ. ‘నేను కవిత్వం రాయను. కాని ప్లేట్లో పదార్థమే ఒక కవిత్వమంత అందంగా అమర్చగలను’ అంటుంది రుక్సార్. ఫుడ్ టెక్నాలజీలో పీహెచ్డీ చేసిన రుక్సార్ అందరిలా ఏ లెక్చరర్ పోస్ట్‌కో వెళ్లలేదు. ‘నాకు ఆహారం మీద సంపూర్ణ అవగాహన ఉంది. ముఖ్యంగా ఫ్రోజెన్ ఫుడ్‌ను సరిగా అమ్మగలిగితే తక్షణం వేడి చేసుకుని తినాలనుకునేవారికి మేలు జరుగుతుంది. కాని ఆహారంలో కల్తీ ఎక్కువ. ఈ కల్తీ విషంతో సమానం. అందుకే నేను ఏ కల్తీ లేని ఫ్రోజెన్ ఫుడ్‌ను అమ్మాలని ఖాలిస్ ఫుడ్స్ పేరుతో చిన్న సంస్థను మొదలుపెట్టాను. చికెన్ ఉత్పత్తులను కశ్మీర్లో అమ్ముతున్నాను. కశ్మీర్లో ఉద్యోగం చేయడం కన్నా ఉద్యోగాలు కల్పించడమే ఎక్కువ అవసరం అని నేను భావిస్తాను. నిరుద్యోగం పోవాలంటే ఇలాగే చేయాలి. నా సంస్థ బాగా నడుస్తోంది. కాని దేశవ్యాప్తంగా పంపాలంటే కొన్ని చిక్కులు ఉన్నాయి. ఈ లోపు నేను, నా బ్రాండ్ తెలియడానికి మాస్టర్ షెఫ్ ్రపోగ్రామ్‌కు వచ్చాను’ అని తెలిపింది రుక్సార్. అంతే తేడా ‘వంట అందరు ఆడవాళ్లూ చేస్తారు. కాని ఫుడ్ షోలలో ఆ వంటను శాస్త్రీయంగా చేయాలి. అంతే తేడా. కశ్మీర్లో వంట తెలిసిన యువతీ యువకులు బాగానే ఉన్నారు. నేను ఈ షో ద్వారా గడించిన అనుభవంతో వారికి సాయం చేయాలనుకుంటున్నాను. ఆహారం తయారు చేయడంలో మెళకువలు తెలిపి వారు ఫుడ్ జాయింట్లు ఏర్పాటు చేసుకుని తమ కాళ్ల మీద తాము నిలబడేలా చూడాలనుకుంటున్నాను. ఇందుకు కావాల్సిన సామాగ్రి నేనే సమకూరుస్తాను’ అంది. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్న రుక్సార్ తన భర్త సాదిక్ అహ్మద్ సహకారం వల్లే ఇలా షోకు వచ్చినట్టుగా తెలిపింది. ‘ఆడవాళ్లూ.. ప్రయత్నించండి. ఓడిపోవద్దు’ అనేది రుక్సార్ సందేశం. -
యాక్షన్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ పూర్తి
విక్రాంత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్ ఎల్.ఐ.ఎఫ్.ఈ’. మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లుగా నటించారు. విక్రాంత్ డెఫ్ ఫ్రాగ్ ప్రోడక్షన్స్పై రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా హీరో–డైరెక్టర్ విక్రాంత్ మాట్లాడుతూ– ‘‘సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. భావోద్వేగాలు, ప్రేమ, భారీ ఫైట్స్‌తో ఈ మూవీ రూపొందింది. ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ అనుభూతినిచ్చే సినిమా ఇది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్ 17న ఈ సినిమాని రిలీజ్ చేస్తాం’’ అన్నారు. -
సినిమాలో స్పార్క్ ఉందనిపిస్తోంది – మంత్రి జగదీశ్వర్ రెడ్డి
విక్రాంత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్ లైఫ్’. మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఏ సినిమానైనా విమర్శనాత్మక కోణంలో చూసే వ్యక్తిని నేను. ‘స్పార్క్’ టీజర్ప్రారంభం చూడగానే నాకు ‘శివ’ సినిమా గుర్తొచ్చింది. విక్రాంత్‌లో, ఈ సినిమాలో స్పార్క్ ఉందనిపిస్తోంది. ఈ సినిమా కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేయడంతో పాటు విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘యూఎస్‌లో చదువుకుని, అక్కడే జాబ్ చేసినా సినిమాలపై ప్రేమ పెరిగిందే కానీ తగ్గలేదు. ఆ ప్రేమతోనే ‘స్పార్క్’ కథ రెడీ చేసుకున్నాను. నేను ప్రేమతో చేసిన ఈ సినిమాను ప్రేక్షకులు ప్రేమతో హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు విక్రాంత్. తుంగతుర్తి ఎమ్మేల్యే కిశోర్, రచయిత అనంత శ్రీరామ్, ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వహాబ్ మాట్లాడారు. -
స్టార్డమ్ ఏబీసీడీలు కూడా శిరీష్ స్టార్ట్ చేయాలి
‘‘ఏబీసీడీ’ సినిమా ట్రైలర్ చూస్తుంటే నా ‘పిల్ల జమీందార్’ సినిమా గుర్తుకు వస్తోంది. నా సినిమాను మించి ‘ఏబీసీడీ’ హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు హీరో నాని. అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఏబీసీడీ’. ‘అమెరిక్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి’ అన్నది ఉపశీర్షిక. డి.సురేశ్‌బాబు సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాని మాట్లాడుతూ– ‘‘నేను యాక్టింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు శిరీష్‌ను అప్పుడప్పుడు కలిశాను. అప్పుడు తను కాస్త లావుగా, బొద్దుగా ఉండేవాడు. సినిమా బిజినెస్ గురించి చాలా మంచి ఆర్టికల్స్ రాసేవాడు. ప్రొడక్షన్లో అరవింద్‌గారికి మంచి సక్సెసర్ దొరికాడని అనుకున్నాను. కట్ చేస్తే తను యాక్టర్ అయిపోయాడు. తన కెరీర్‌కు సంబంధించి ఏబీసీడీలు ఎప్పుడో స్టార్ట్ చేసిన శిరీష్, తన స్టార్డమ్కు సంబంధించిన ఏబీసీడీలు ఈ సినిమాతో స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ–‘‘రెండేళ్ల కిందట నా కజిన్ రామ్‌చరణ్ ‘ఏబీసీడీ’ మలయాళ సినిమా సీడీ నాకు ఇచ్చి, ఈ క్యారెక్టర్ నీకు కరెక్ట్‌గా సూట్ అవుతుందని చెప్పాడు. సినిమా చూస్తే చాలా బాగుందనిపించింది. ఈ సినిమాలో హీరో డబ్బు విలువ తెలియకుండా పాడైపోయాడని భావించిన తండ్రి అతన్ని బాగు చేసుకోవడానికి ఏం చేశాడనేదే కథ. బన్నీకి, రామ్‌చరణ్‌కు 21 ఏళ్లు వచ్చినప్పుడు కారు కొనిచ్చారు. నాకు 21 ఏళ్లు వచ్చాక మంచి స్పోర్ట్స్ కారు కొనివ్వమని నాన్నను అడగ్గానే ‘చెప్పుచ్చుకుని కొడతాను.. నీ వయసువాళ్లు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ట్రావెల్ చేస్తున్నారు. నీకు కారు కొనివ్వడమే లగ్జరీ. అలాంటిది స్పోర్ట్స్ కారు కొనివ్వమని అడుగుతున్నావ్’ అని కొనివ్వలేదు. నీ కారుకి బడ్జెట్ ఇంత అనుకుంటున్నాను అంటే, ఆ రోజు నేను కోపానికి పోయి ‘నాకు వద్దులే, నా సొంత డబ్బులతోనే కొనుక్కుంటాను’ అన్నాను. అయితే ఆ కారు కొనడానికి నాకు మూడేళ్లు పట్టింది. అప్పుడు నాన్న చేసిన పనివల్ల డబ్బు విలువ తెలిసి వచ్చింది. కాబట్టి ఈ సినిమాను మా నాన్నకు డెడికేట్ చేస్తున్నాను. ఈ చిత్రంలో నా తండ్రి పాత్రలో నాగబాబుగారిని తప్ప మరెవరినీ ఊహించుకోలేను’’ అన్నారు. ‘‘మధుర’ శ్రీధర్ నాకు మంచి స్నేహితుడు. అతనితో కొంతకాలంగా ట్రావెల్ చేస్తున్నాను. అల్లు అరవింద్‌గారు కూడా నాకు మంచి మిత్రుడు. ఈ సినిమాతో శిరీష్‌కు పెద్ద విజయం రావాలి’’ అన్నారు డి.సురేశ్‌బాబు. ‘‘అందరికీ థాంక్స్’’ అని ‘మధుర’ శ్రీధర్ రెడ్డి అన్నారు. ‘‘మధుర శ్రీధర్’తో ట్రావెల్ చేసేటప్పుడు మా నాన్నతో ఉన్నట్లే అనిపించింది. అల్లు శిరీష్ సినిమాలోనే కాదు.. రియల్ లైఫ్ హీరో కూడా. కొత్త డైరెక్టర్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. శిరీష్ నాకు లైఫ్ లాంగ్ హీరోగా ఉంటారు’’ అన్నారు సంజీవ్ రెడ్డి. రుక్సార్ థిల్లాన్, మ్యూజిక్ డైరెక్టర్ జుడా సాందీ, డైరెక్టర్ వేణు ఊడుగుల తదితరులు పాల్గొన్నారు. -
మా ఇద్దరి మధ్య పోటీ జరుగుతోంది – ‘దిల్’ రాజు
‘‘బాహుబలి’ ఫంక్షన్ తర్వాత ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా వేడుక తిరుపతిలో జరుగుతుంటే చాలా ఆనందంగా ఉంది. గాంధీ ఈ సినిమాతో హ్యాట్రిక్ డైరెక్టర్ కాబోతున్నాడు. నాకు, నానీకి పోటీ జరుగుతోంది. ఇద్దరం వరుస హిట్ల మీద ఉన్నాం. సినిమాకు కథ బాగుంటే అన్నీ బాగున్నట్టే. ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో మేం విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నాని, అనుపమా పరమేశ్వరన్, రుక్సార్ హీరో హీరోయిన్లుగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం‘కృష్ణార్జున యుద్ధం’. వెంకట్ బోయనపల్లి సమర్పణలో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా తిరుపతిలో ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహించారు. ‘దిల్’ రాజు సినిమా ట్రైలర్‌ను, ఫస్ట్ టికెట్‌ను ఆవిష్కరించారు. మేర్లపాక గాంధీ మాట్లాడుతూ– ‘‘కథ చెప్పడం మొదలుపెట్టిన పది నిమిషాలకే నానీగారు ఓకే చెప్పేశారు. చిత్తూరు యాసను ఆయన చాలా ఈజీగా పలకడం గర్వంగా ఫీలవుతున్నా. సుబ్బలక్ష్మి, రియా పాత్రల్లో ఇద్దరు హీరోయిన్లు బాగా చేశారు. హిప్ హాప్ తమిళ మంచి సంగీతాన్నిచ్చారు’’ అన్నారు. నాని మాట్లాడుతూ– ‘‘చిన్నప్పటి నుంచి మా తాతగారి ఊరికి ఎన్నిసార్లు వెళ్లానో తెలియదు కానీ, అంతకు మూడు రెట్లు ఎక్కువ తిరుపతికి వచ్చాను. నేనే కాదు.. ప్రతి తెలుగోడు తిరుపతివాడే. గాంధీని చూస్తే సొంత సోదరునిలా అనిపించేది. ఈ మధ్య కాలంలో ఇంత ఎంజాయ్ చేసిన సినిమా ఇంకోటి లేదు. ఏదైనా మంచి పని చేయాలంటే తిరుపతికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాం. మన ప్రీ–రిలీజ్ ఈవెంట్ ఇక్కడ మొదలైంది. ఇక తిరుగులేదు’’ అన్నారు. అనుపమా పరమేశ్వరన్, రుక్సార్, చిత్ర సంగీతదర్శకుడు హిప్ హాప్ తమిళ, తిరుపతి ప్రసాద్, ‘నిన్ను కోరి’ దర్శకుడు శివ నిర్వాణ, ప్రశాంతి, మౌర్య, ప్రభాస్ శ్రీను, ఫైట్ మాస్టర్స్ జాషువా, ఆర్.కె, డ్యాన్స్ మాస్టర్ రఘు తదితరులు పాల్గొన్నారు. -
ఆకతాయి లక్ష్యం ఏంటి?
అతనో ఆకతాయి కుర్రాడు. కానీ అతనికో లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం ఏంటి? దాన్ని నెరవేర్చుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఆకతాయి’. ఆశిష్ రాజ్, రుక్సార్ మీర్ జంటగా రామ్ భీమనను దర్శకునిగా పరిచయం చేస్తూ విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ చిత్రీకరణ జరగుతోంది. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. వినోదం, ప్రేమ అన్నీ ఉంటాయి. ఉక్రెయిన్, జార్జియాలో చిత్రీకరించనున్న రెండు పాటలతో షూటింగ్ పూర్తవుతుంది. జనవరిలో సినిమా విడుదల చేస్తాం’’ అని చెప్పారు. సుమన్, రాశి, బ్రహ్మానందం, అలీ, పోసాని, పృథ్వి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమేరా: వెంకట్ గంగదారి. -
షోలో సస్పెన్స్!
రణధీర్, రుక్సార్ జంటగా రామ రీల్స్ సంస్థ నిర్మించిన మొదటి సినిమా ‘షో టైమ్’. ‘మర్యాద రామన్న’, ‘ఈగ’ సినిమాల రచయిత ఎస్.ఎస్. కాంచీ దర్శకత్వం వహించారు. జాన్ సుధీర్ పూదోట నిర్మాత. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రంలోని ఓ పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఓ థియేటర్లో సినిమా చూడ్డానికి వెళ్లిన ఓ జంటకు ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయనేది కథ. ఆద్యంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగుతుంది’’ అన్నారు. సుప్రీత్, కార్తీక్, రవి ప్రకాశ్, సత్య, సంజిత్, ఆదిత్య నటించిన ఈ చిత్రానికి కళ: బాబ్జి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిరణ్ తనమల.