ఆకతాయి లక్ష్యం ఏంటి? | Ashish Raj, Mir ruksar movie Akatayi | Sakshi
Sakshi News home page

ఆకతాయి లక్ష్యం ఏంటి?

Published Tue, Nov 8 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

ఆకతాయి లక్ష్యం ఏంటి?

ఆకతాయి లక్ష్యం ఏంటి?

అతనో ఆకతాయి కుర్రాడు. కానీ అతనికో లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం ఏంటి? దాన్ని నెరవేర్చుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఆకతాయి’. ఆశిష్ రాజ్, రుక్సార్ మీర్ జంటగా రామ్ భీమనను దర్శకునిగా పరిచయం చేస్తూ విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ చిత్రీకరణ జరగుతోంది.

నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. వినోదం, ప్రేమ అన్నీ ఉంటాయి. ఉక్రెయిన్, జార్జియాలో చిత్రీకరించనున్న రెండు పాటలతో షూటింగ్ పూర్తవుతుంది. జనవరిలో సినిమా విడుదల చేస్తాం’’ అని చెప్పారు. సుమన్, రాశి, బ్రహ్మానందం, అలీ, పోసాని, పృథ్వి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమేరా: వెంకట్ గంగదారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement