Ashish Raj
-
`ఇగో` మూవీ రివ్యూ
టైటిల్ : ఇగో జానర్ : రొమాంటిక్ కామెడీ తారాగణం : ఆశిష్ రాజ్, సిమ్రాన్, దీక్షాపంత్, రావు రమేష్, పృధ్వీ, పోసాని కృష్ణమురళీ సంగీతం : సాయి కార్తీక్ దర్శకత్వం : సుబ్రమణ్యం నిర్మాత : విజయ్ కరణ్, కౌషల్ కరణ్, అనిల్ కరణ్ ఆసక్తికరమైన కథా కథనాలతో తెరకెక్కిన చిన్న సినిమాలు కూడా సంచలన విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో ఆ తరహా చిత్రాలను రూపొందించేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. అదే బాటలో ఆశిష్ రాజ్, సిమ్రాన్ జంటగా ఇంట్రస్టింగ్ పాయింట్ కు లవ్ స్టోరి, కామెడీలను జోడించి ఇగో సినిమాను తెరకెక్కించారు. మరీ ఈ ప్రయత్నం ఆకట్టుకుందా..? కథ : గోపి (ఆశిష్ రాజ్), ఇందు (సిమ్రాన్)లు ఇద్దరు ఇగోతో ఒకరి మీద ఒకరు పై చేయి సాధించాలని ప్రయత్నిస్తుంటారు. తరతరాలుగా వారిద్దరి కుటుంబాలకు ఒకరంటే ఒకరు పడదు. దీంతో ఇందుని ఇబ్బంది పెట్టాలని గోపి, గోపిని ఏదో ఒక సమస్యలో ఇరికించాలని ఇందు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటారు. ఈ గోడవలు ఇంట్లో తెలియటంతో ఇందుకు పెళ్లి సంబంధం చూస్తారు. అమెరికాలో స్థిరపడిన అబ్బాయితో ఇందుకి పెళ్లి కుదురుతుంది. ఇగో గోపి ఇందుకు కన్నా ముందే మంచి అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేసి హైదరాబాద్ వస్తాడు. అప్పుడే ఇందు, గోపిలకు ఒకరంటే ఒకరికి ప్రేమని తెలుస్తుంది. ఇద్దరు కలుసుకునే సమయానికి గోపిని ఓ మర్డర్ కేసులో అరెస్ట్ చేస్తారు. పూర్వి (దీక్షాపంత్) అనే అమ్మాయి అతి దారుణంగా హత్య చేయబడుతుంది. ఆమె ఫోన్లో గోపితో దిగిన సెల్ఫీతో పాటు, హత్య జరగటానికి ముందుకు గోపితో 40 నిమిషాలు మాట్లాడినట్టు, హత్య జరిగిన తరువాతి రోజు పూర్వి అకౌంట్ నుంచి గోపి 40 వేలు డ్రా చేసినట్టు సీసీ టీవీ ఫుటేజ్ సాక్ష్యాలుగా ఉంటాయి. దీంతో అంతా గోపినే ఈ హత్య చేశారని భావిస్తారు. అసలు పూర్విని హత్య చేసింది ఎవరు..? ఆ కేసులో గోపిని ఎందుకు ఇరికించారు..? ఈ కేసునుంచి గోపి ఎలా బయట పడ్డాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఆకతాయి సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆశిష్ రాజ్, రెండో ప్రయత్నంలో పరవాలేదనిపించాడు. డ్యాన్స్‌లు, యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో నటన విషయంలో పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. హీరోయిన్ గా పరిచయం అయిన సిమ్రాన్ అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. బిగ్ బాస్ ఫేం దీక్షా పంత్‌ది చిన్న పాత్రే అయిన ఉన్నంతలో తన పరిధిమేరకు పాత్రకు న్యాయం చేసింది. రావూ రమేష్, పృధ్వీ, పోసాని కృష్ణమురళీలు రొటీన్ పాత్రల్లో నిరాశపరిచారు. ఫస్ట్ హాఫ్ లో పృధ్వీ కామెడీ కాస్త నవ్విస్తుంది. విశ్లేషణ : తనకేది సంబంధం లేని కేసులో ఇరుక్కున్న ఓ యువకుడు ఎలా బయటపడ్డాడు అన్న ఆసక్తికరమైన పాయింట్ ను కథగా ఎంచుకున్న దర్శకుడు ఆ పాయింట్ ను ఆసక్తికరంగా తెరకెక్కించటంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. మెయిన్ పాయింట్ కు సపోర్ట్ గా ఎంచుకున్న ప్రేమకథ, కామెడీ ఏమాత్రం ఆకట్టకోకపోవటం. అసలు కథ ద్వితియార్థంలో గాని మొదలు కాకపోవటం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. కావాలని ఇరికించిన పంచ్ డైలాగ్ లు కామెడీ సీన్స్ విసిగిస్తాయి. అయితే హీరో మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యే సన్నివేశాలు కాస్త ఆసక్తికరంగా ఉన్నా.. అదే స్థాయిలో సినిమాను ముందుకు నడిపించలేకపోయాడు. సాయికార్తీక్ సంగీతం బాగుంది. ముఖ్యంగా నేపథ్యం సంగీతం ఆకట్టుకుంటుంది. -
ఆ రోజు వచ్చింది
‘‘ఆకతాయి’ సినిమాలో కాలేజ్ కుర్రాడిలా నటించాను. ‘ఇగో’లో బాధ్యతలను నిర్లక్ష్యం చేసి లైఫ్‌ను ఎంజాయ్ చేసే గోపీ పాత్రలో నటించాను. ఎమోషన్స్‌తో రూపొందిన మా చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు ఆశిష్ రాజ్. ఆర్వీ సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ఆయన హీరోగా విజయ్ కరణ్, కౌషల్ కరణ్, అనిల్ కరణ్ నిర్మించిన చిత్రం ‘ఇగో’. సిమ్రాన్ కథానాయికగా నటించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ఆశిష్ రాజ్ చెప్పిన విశేషాలు. ► ఇగో ఫీలయ్యే ఇద్దరు (గోపీ, ఇందు) వ్యక్తుల మధ్య ఎమోషన్స్‌తో సాగే లవ్‌స్టోరీ ఇది. సినిమాలో విలేజ్, సిటీ కల్చర్ మిక్సై ఉంటుంది. నటుడిగా నాకు మంచి గుర్తింపు తీసుకొస్తుందన్న నమ్మకం ఉంది. అమలాపురం యాసలో నేను చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. కైరాదత్ చేసిన స్పెషల్ సాంగ్ సూపర్‌గా ఉంటుంది. దర్శకుడు సుబ్రహ్మణ్యం చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సాయి కార్తీక్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. ► చిన్నతనం నుంచే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. చదువు పూరై్తన తర్వాత మా నాన్నగారు ప్రోత్సహించారు. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో రాణించడం కష్టమే. కానీ నాకు దేవుడి అండ తోడుగా ఉంటుందనుకుంటున్నాను. మహేశ్‌బాబుతో ఓ యాడ్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు దేవుడా.. నా కంటూ ఓ రోజు రావాలని మనసులో అనుకున్నాను. అదే నిజమైంది. నెక్ట్స్ సినిమా గురించి ఇంకా ఏమి అనుకోలేదు. ఆశిష్ నా బర్త్‌డే గిఫ్ట్! ‘ఇగో’ చిత్రదర్శకుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ – ‘‘మా హీరోనే నా పుట్టినరోజు కానుక. ఆశిష్ రాజ్ సూపర్‌గా నటించాడు. హీరోయిన్ సిమ్రాన్ బాగా నటించింది. మా సినిమాలో నటించిన సీనియర్ యాక్టర్స్ అందరూ ఎంతగానో హెల్ప్ చేశారు. వారిని మర్చిపోలేను. కథ విషయానికొస్తే.. పల్లెటూరి నుంచి పట్నానికి వచ్చే ప్రేమకథ ఇది. ఆ తర్వాత ఏం జరిగిందనేది స్క్రీన్‌పై చూస్తేనే బాగుంటుంది. స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో ప్రేక్షకులు థ్రిల్ అవుతారు’’ అన్నారు. -
ఇగో అంటే అహం కాదు
‘ఆకతాయి’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరి యమైన ఆశిష్ రాజ్ నటించిన తాజా చిత్రం ‘ఇగో’ (ఇందు–గోపి). విజయ్ కరణ్, కౌషల్ కరణ్, అనిల్ కరణ్ నిర్మించిన ఈ చిత్రానికి సుబ్రమణ్యం దర్శకుడు. సాయికార్తీక్ స్వరకర్త. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆడియో సీడీని ఆవిష్కరించి, దర్శకుడు నక్కిన త్రినాథరావుకు అందించారు. ‘‘ఈ మధ్యకాలంలో క్యారక్టరైజేషన్ను బేస్ చేసుకుని వస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఆశిష్‌రాజ్ మొదటి సినిమాతో పోల్చితే చాలా ఇంప్రూవ్ అయ్యాడు’’ అన్నారు త్రినాథరావు. సుబ్రమణ్యం తమకు మంచి రోల్స్ ఇవ్వటంతో పాటు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని ఆశిష్‌రాజ్, సిమ్రాన్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ జి.కె. -
ఆకతాయి కుర్రాడి ఇగో
‘ఆకతాయి’ సినిమా ఫేమ్ ఆశిష్ రాజ్, సిమ్రాన్ జంటగా రూపొందుతోన్న సినిమా ‘ఇగో’. సుబ్రమణ్యం దర్శకత్వంలో ‘ఆకతాయి’ నిర్మాతలు విజయ్ కరణ్–కౌసల్ కరణ్–అనిల్ కరణ్ నిర్మిస్తున్న ‘ఇగో’ మోషన్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ రొమాంటిక్ సస్పెన్స్ ఎంటర్టైనర్ ఇది. మూడు షెడ్యూల్స్‌లో దాదాపు 80% చిత్రీకరణ పూర్తి చేశాం. లాస్ట్ షెడ్యూల్ త్వరలో మొదలవుతుంది. భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హీరో పాత్ర సరికొత్తగా ఉంటుంది. క్వాలిటీ ఔట్పుట్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. దీక్షాపంత్, రావు రమేశ్, పోసాని, పృధ్వి, గౌతంరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ప్రసాద్ జి.కె. -
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న 'ఇగో'
'ఆకతాయి' సినిమా తరువాత 'వికెఎ ఫిలిమ్స్' నిర్మాణ సంస్థ తన ద్వితీయ చిత్రంగా నిర్మిస్తున్న చిత్రం 'ఇగో'. విజయ్ కరణ్, కౌసల్ కరణ్, అనిల్ కరణ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో ఆశిష్ రాజ్, సిమ్రాన్ లు జంటగా నటిస్తున్నారు. నవతరం ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా తో సుబ్రమణ్యం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ ను గోదారి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ రొమాంటిక్ సస్పెన్స్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న 'ఇగో' రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథానాయకుడి క్యారెక్టరైజేషన్ సరికొత్తగా ఉంటుంది. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. అనుకొన్నదానికంటే ముందుగానే షూటింగ్ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎక్కడా రాజీపడకుండా ప్రేక్షకులకు క్వాలిటీ ఔట్ పుట్ ఇచ్చేందుకు సర్వ సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేయనున్నాం' అన్నారు. -
ఆకతాయికి ఇగో
‘ఆకతాయి’ సినిమాతో యువతను ఆకట్టుకున్న ఆశిష్ రాజ్ హీరోగా తెరకెక్కుతోన్న ద్వితీయ చిత్రం ‘ఇగో’. సిమ్రన్ కథానాయిక. ‘ప్రేమా గీమా జాన్తా నయ్’ ఫేమ్ ఆర్.వి. సుబ్రహ్మణ్యం (సుబ్బు) దర్శకత్వంలో వి.కె.ఎ. ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి వ్యాపారవేత్త శ్రీనివాస్ గౌడ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సంగీత దర్శకుడు సాయికార్తీక్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘అహంభావం ఉన్న గోపీ, ఇందు ప్రేమకథతో తెరకెక్కనున్న చిత్రమిది. పల్లెటూరు, పట్టణ సంస్కృతుల నేపథ్యంలో ఉంటుంది. ఈరోజు నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం. మూడు షెడ్యూళ్లలో చిత్రీకరణ పూర్తి చేస్తాం. హైదరాబాద్, పాలకొల్లులో ముఖ్యమైన సన్నివేశాలు తెరకెక్కిస్తాం. దసరాకు సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: ప్రసాద్ జి.కె. -
విలేజ్ టు సిటీ
‘ఆకతాయి’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన ఆశిష్ రాజ్ రెండో చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ‘ఆకతాయి’ చిత్రం నిర్మించిన వికెఏ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ముంబై భామ సిమ్రన్ కథానాయిక. నిర్మాతలు విజయ్, కౌశల్, అనిల్ మాట్లాడుతూ– ‘‘ఆశిష్ రాజ్ కోసం చాలా కథలు విన్నాం. సుబ్రహ్మణ్యం చెప్పిన కథ బాగా నచ్చింది. గ్రామీణ, పట్టణ నేపథ్యంలో జరిగే ప్రేమ కథ ఇది. వినోదం, యాక్షన్, థ్రిల్.. ఇలా అన్ని అంశాలూ ఉంటాయి. జూలైలో షూటింగ్ ప్రారంభించి, దసరా కానుకగా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: ప్రసాద్ జీకే. -
అలా రెండో సినిమా
‘ఆకతాయి’తో హీరోగా పరిచయమైన ఆశిష్ రాజ్‌కు మరో ఛాన్స్ వచ్చింది. ‘ఆకతాయి’ను నిర్మించిన వీకేఏ ఫిల్మ్స్ సంస్థే ఈ సినిమానూ నిర్మించనుంది. మే నెలలో ఈ సినిమా ప్రారంభం కానుంది. నిర్మాతలు కేఆర్ విజయ్ కరణ్, కేఆర్ కౌశల్ కరణ్, కేఆర్ అనిల్ కరణ్ మాట్లాడుతూ– ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన మా ‘ఆకతాయి’ను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఆ సినిమాకు వచ్చిన ప్రేక్షకుల స్పందన చూసి రెండో సినిమాకు శ్రీకారం చుడుతున్నాం. యువ ప్రతిభాశాలి దర్శకుడిగా పరిచయం కానున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో మొదలు పెడతాం. ఆశిష్ సరసన ప్రముఖ హీరోయిన్ నటిస్తారు. పూర్తి వివరాలు త్వరలోనే చెబుతాం’’ అన్నారు. -
ఆకతాయి... ఎంగేజింగ్ యాక్షన్ ఎంటర్టైనర్
షార్ట్ ఫిలింస్‌తో గుర్తింపు తెచ్చుకున్న రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కిన రెండో సినిమా ఆకతాయి. ఓ కొత్త హీరోతో యాక్షన్, ఎమోషన్స్, కామెడీ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్న పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మంచి విజయం సాధించాడు. ముఖ్యంగా మేకింగ్ విషయంలో రామ్, తీసుకున్న జాగ్రత్తలు క్వాలిటీ పరంగా సినిమాను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే హీరో హీరోయిన్ల లవ్ సీన్స్, ఫ్యామిలీ డ్రామా, ఇంటర్వెల్ ట్విస్ట్ లతో సినిమాను ఎంటర్టైనింగ్గా నడిపించిన దర్శకుడు, ద్వితియార్థంలో మాస్ కమర్షియల్ సినిమాకు కావల్సిన ట్విస్ట్‌లు. మైండ్ గేమ్, యాక్షన్ సీన్స్ తో ఆడియన్స్‌ను కథతో ప్రయాణించేలా చేయగలిగాడు. హీరో హీరోయిన్లు కొత్తవారైనప్పటికీ వారి నుంచి కథకు తగ్గ స్థాయి నటనను రాబట్టడంలో యూనిట్ విజయం సాధించింది. నటనతో పాటు యాక్షన్ సీన్స్‌తో హీరో ఆశిష్ రాజ్ ఆకట్టుకోగా.. హీరోయిన్ రుక్సార్ మీర్ తెరపై గ్లామరస్ లుక్స్‌తో మెప్పించింది. సుమన్, నాగబాబు, రాశీ, రాంకీ, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణమురళి లాంటి సీనియర్ యాక్టర్లతో పాటు మణిశర్మ లాంటి టాప్ టెక్నీషియన్స్ నుంచి మంచి వర్క్ రాబట్టుకున్నాడు. అక్కడక్కడ కొంత సాగతీత అనిపించినా కామెడీ సీన్స్‌తో బోర్ కొట్టకుండా జాగ్రత్త పడ్డారు. తన రెండో సినిమాకే వైవిధ్యమైన కథతో.. కమర్షియల్ ఎలెమెంట్స్ కూడా ఎక్కడా మిస్ కాకుండా తీసిన రామ్ భీమన, టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. -
తెలుగు సినిమా అంటే పిచ్చి!
‘‘నేను చిన్ననాటి నుంచి తెలుగు సినిమాలను చూస్తూ పెరిగాను. అందుకే సినిమా మీద ప్రేమతో ఐర్లాండ్‌లో డిప్లొమా ఇన్ స్క్రీన్‌ప్లే, లండన్‌లో డిప్లొమా ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ పూర్తి చేశాను. ‘ఆకతాయి’ సినిమాలో కొత్త ప్రయోగాలు చేశాను’’ అని రామ్ భీమన అన్నారు. ఆశిష్‌రాజ్, రుక్సార్ మీర్ జంటగా విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్ భీమన చెప్పిన విశేషాలు... ► పాయింట్ ఆఫ్ వ్యూ అనే టెక్నాలజీని మొదటిసారి ఈ సినిమాలో ప్రయోగించాను. తెలుగు సినిమా చరిత్రలోనే ఈ టెక్నాలజీతో సీన్స్ తీయడం ఇదే మొదటిసారి. నాకు కమర్షియల్ సినిమా అంటే పిచ్చి. ఎందుకంటే కామెడీ, ఫైట్స్, పాటలు.. ఇలా అన్ని ఒకే చోట దొరికేది కమర్షియల్ సినిమాలోనే. ‘ఆకతాయి’ హైలెట్స్ గురించి చెప్పుకోవాలంటే టెక్నాలజీతో పాటు మణిశర్మ సంగీతం అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఈ సినిమా పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేశారు. మణిశర్మ గారు నాతో మాట్లాడుతూ – ‘నాకు ఇది చాలా చిన్న సినిమా అని చెప్పి రెమ్యూనరేషన్ మాట్లాడారు. కానీ, చిన్న సినిమాల్లో ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది’ అన్నారు. ప్రతి పది నిమిషాలకు సినిమాలో ఒక్కో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతూ ఉంటుంది. ► ఈ సినిమా పాయింట్ గురించి చెప్పాలంటే... ఇది ఒక రివెంజ్ సబ్జెక్ట్. హీరో చాలా తెలివైనవాడు. అతనికి సాంకేతిక పరిజ్ఞానంపై విపరీతమైన పట్టు ఉంటుంది. తనకు వచ్చిన సమస్యను టెక్నికల్ నాలెడ్డ్తో ఎలా పరిష్కరించాడన్నదే చిత్రకథ. ► ‘దావతే ఇష్క్’ అనే హిందీ మూవీలో ఈ చిత్రకథానాయికుడు ఆశిష్‌రాజ్ గెస్ట్ రోల్ చేశాడు. గతంలో ఆశిష్ థియేటర్ ఆర్టిస్టు. రుక్సార్ మీర్ మా చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్నారు. ఇద్దరూ అద్భుతంగా నటించారు. ‘గజిని’ తరువాత తనకు గుర్తుండిపోయే విలన్ పాత్రల్లో ఈ చిత్రంలోని పాత్ర నిలుస్తుందని ప్రదీప్ రావత్ అన్నారు. అమీషా పటేల్ చాలా గ్యాప్ తర్వాత తెలుగు తెరపై కనిపించబోతున్న సినిమా ఇది. ఆమె చేసిన స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్. ► ఈ చిత్ర నిర్మాతలు రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో పేరు సంపాదించారు. సినిమాపై ఉన్న ప్రేమతో నిర్మాతలుగా మారారు. పేరుకి ఇది చిన్న సినిమా అయినా పెద్ద చిత్రానికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఖర్చుకి వెనకాడకుండా తీశారు. -
ఆకతాయి మారాడు
‘‘మేనల్లుణ్ణి హీరోగా నిలబెట్టడం కోసం ముగ్గురు మావయ్యలు కలసి ఈ సినిమా నిర్మించారు. టీజర్ హాలీవుడ్ స్థాయిలో ఉంది. ఆశిష్‌రాజ్ అనుభవమున్న హీరోలా నటించాడు. సినిమా హిట్టయ్యి అతనికీ, చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నా’’ అన్నారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ఆశిష్‌రాజ్, రుక్సార్‌మీర్ జంటగా రామ్ భీమన దర్శకత్వంలో విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్ నిర్మించిన ‘ఆకతాయి’ టీజర్‌ని పరుచూరి గోపాలకృష్ణ, జీవీ వరప్రసాద్, ప్రతాని రామకృష్ణ గౌడ్ విడుదల చేశారు. రామ్ భీమన మాట్లాడుతూ – ‘‘ఓ ఆకతాయి కుర్రాడు అందరూ మెచ్చే విధంగా ఎలా మారాడనేది చిత్రకథ. ప్రేమ, వినోదం, ఉత్కంఠ... అన్నీ ఉన్నాయి. ‘కబాలి’గా బ్రహ్మానందం నటన, ప్రత్యేక గీతంలో అమీషా పటేల్ అందాలు ప్రేక్షకుల్ని ఆలరిస్తాయి’’ అన్నారు. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాతలు తెలిపారు. హీరో ఆశిష్‌రాజ్, నటులు అజయ్ ఘోష్, నవీన్ నేని, రచయిత రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. -
ఆకతాయి లక్ష్యం ఏంటి?
అతనో ఆకతాయి కుర్రాడు. కానీ అతనికో లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం ఏంటి? దాన్ని నెరవేర్చుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఆకతాయి’. ఆశిష్ రాజ్, రుక్సార్ మీర్ జంటగా రామ్ భీమనను దర్శకునిగా పరిచయం చేస్తూ విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ చిత్రీకరణ జరగుతోంది. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. వినోదం, ప్రేమ అన్నీ ఉంటాయి. ఉక్రెయిన్, జార్జియాలో చిత్రీకరించనున్న రెండు పాటలతో షూటింగ్ పూర్తవుతుంది. జనవరిలో సినిమా విడుదల చేస్తాం’’ అని చెప్పారు. సుమన్, రాశి, బ్రహ్మానందం, అలీ, పోసాని, పృథ్వి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమేరా: వెంకట్ గంగదారి.