ఆకతాయి మారాడు | Ashish Raj ruksarmir's Aakatai movie | Sakshi
Sakshi News home page

ఆకతాయి మారాడు

Published Sun, Jan 22 2017 11:05 PM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM

ఆకతాయి మారాడు

ఆకతాయి మారాడు

‘‘మేనల్లుణ్ణి హీరోగా నిలబెట్టడం కోసం ముగ్గురు మావయ్యలు కలసి ఈ సినిమా నిర్మించారు. టీజర్‌ హాలీవుడ్‌ స్థాయిలో ఉంది. ఆశిష్‌రాజ్‌ అనుభవమున్న హీరోలా నటించాడు. సినిమా హిట్టయ్యి అతనికీ, చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నా’’ అన్నారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ఆశిష్‌రాజ్, రుక్సార్‌మీర్‌ జంటగా రామ్‌ భీమన దర్శకత్వంలో విజయ్‌ కరణ్, కౌశల్‌ కరణ్, అనిల్‌ కరణ్‌ నిర్మించిన ‘ఆకతాయి’ టీజర్‌ని పరుచూరి గోపాలకృష్ణ, జీవీ వరప్రసాద్, ప్రతాని రామకృష్ణ గౌడ్‌ విడుదల చేశారు.

రామ్‌ భీమన మాట్లాడుతూ – ‘‘ఓ ఆకతాయి కుర్రాడు అందరూ మెచ్చే విధంగా ఎలా మారాడనేది చిత్రకథ. ప్రేమ, వినోదం, ఉత్కంఠ... అన్నీ ఉన్నాయి. ‘కబాలి’గా బ్రహ్మానందం నటన, ప్రత్యేక గీతంలో అమీషా పటేల్‌ అందాలు ప్రేక్షకుల్ని ఆలరిస్తాయి’’ అన్నారు. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాతలు తెలిపారు. హీరో ఆశిష్‌రాజ్, నటులు అజయ్‌ ఘోష్, నవీన్‌ నేని, రచయిత రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement