నాని
నింగికీ నేలకీ మధ్య ఉన్నంత తేడా ఉంది కృష్ణకీ అర్జున్ జయప్రకాశ్‌కి. ఒకరు పల్లెటూరి ఆకతాయి కుర్రాడు. మరొకడు రాక్‌స్టార్. అమ్మాయిలను ప్రేమలో పడేయాలని నచ్చిన వాళ్లకి లవ్ ప్రపోజ్ చేసి ఫెయిల్ అవుతుంటాడు కృష్ణ. అమ్మాయిలంటే అర్జున్‌కు ఇంట్రస్టే. కానీ సిన్సియర్‌గా లవ్ చేయడం, ఇటాలియన్ మాఫియాతో పెట్టుకోవడం ఒకటే అంటాడు. కానీ కరెక్ట్ పర్సన్ లైఫ్‌లోకి రాగానే కృష్ణ ప్రేమలో పడతాడు. మరోవైపు అర్జున్ కూడా ఒక అమ్మాయికి మనసిచ్చేస్తాడు. అంతేకాదు ఒకే లక్ష్యం కోసం ఇద్దరు అడుగులు ముందుకు పడ్డాయి. కలిసి యుద్ధం చేశారు.
ఎవరిపై? ఎందుకు? ఎలా గెలిచారు? అనేది సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని డ్యూయెల్ రోల్ చేసిన సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్ కథానాయికలు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కంప్లీటైంది. ఏప్రిల్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘యుద్ధం మీ అందరి కోసం సిద్ధం’’ అన్నారు నాని. ‘‘నాని నటనలో మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. కృష్ణ, అర్జున్ పాత్రల లుక్స్‌తో పాటు, మూవీ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ తమిళ.
Comments
Please login to add a commentAdd a comment