ruksar Mir
-
ఆడలేదు బాబాయ్
నానీ డబుల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘కృష్ణార్జునయుద్ధం’. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఇందులో అనూపమా పరమేశ్వరన్, రుక్సా మీర్ కథానాయికలుగా నటించారు. రీసెంట్గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేదు. అయితే..‘‘సూపర్‌హిట్ ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాను మా డిజిటల్ కంటెంట్‌లో చూడండి’’అని ట్విటర్ ద్వారా యప్ టీవీ పేర్కొంది. దానికి నానీ స్పందిస్తూ –‘‘సినిమా సూపర్ హిట్ అవ్వలేదు బాబాయ్. ఆడలేదు కూడా. అయినా మనసుపెట్టి చేశాం. చూసేయ్యండి’’ అని అన్నారు. -
అన్ని అంశాలు ప్యాకేజ్‌తో ఉంటాయి –‘దిల్’రాజు
‘‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ కథను మేర్లపాక గాంధీ ముందు నాకే చెప్పాడు. సింపుల్ కథ. సినిమా సూపర్‌హిట్ అయ్యింది. రెండో సినిమా ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ కూడా మంచి హిట్. తన సినిమాలో క్యారెక్టర్స్, కామెడీ, మ్యూజిక్.. ఇలా అన్ని అంశాలు ప్యాకేజ్‌తో ఉంటాయి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నాని హీరోగా అనుపమా పరమేశ్వరన్, రుక్సార్ మీర్ హీరోయిన్లుగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. వెంకట్ బోయనపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఈనెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాను నేనే రిలీజ్ చేస్తున్నా. గాంధీ సినిమాలతో ప్రేక్షకులకు పెద్దగా ఒత్తిడి ఉండదు. ఎంజాయ్ చేస్తారు. నేను రీసెంట్గా ఈ సినిమా చూశా. నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్’’ అన్నారు. నాని మాట్లాడుతూ– ‘‘నా ప్రతి సినిమా విడుదల టైమ్‌లో టెన్షన్ ఉంటుంది. ఎక్కువ సినిమాలు చేస్తే టెన్షన్ అలవాటు పడిపోతుందని అనుకుంటే.. ప్రతి సినిమాకు కామన్‌గా వచ్చేస్తోంది. రెండు రోజుల ముందు సినిమా చూశాం. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ సమ్మర్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’’ అన్నారు. ‘‘ మా సినిమాను రాజుగారు విడుదల చేస్తుండటం హ్యాపీ’’ అన్నారు మేర్లపాక గాంధీ. వెంకట్ బోయనపల్లి, సాహు గారపాటి, హరీష్ పెద్ది పాల్గొన్నారు. -
యుద్ధం సిద్ధం
నింగికీ నేలకీ మధ్య ఉన్నంత తేడా ఉంది కృష్ణకీ అర్జున్ జయప్రకాశ్కి. ఒకరు పల్లెటూరి ఆకతాయి కుర్రాడు. మరొకడు రాక్‌స్టార్. అమ్మాయిలను ప్రేమలో పడేయాలని నచ్చిన వాళ్లకి లవ్ ప్రపోజ్ చేసి ఫెయిల్ అవుతుంటాడు కృష్ణ. అమ్మాయిలంటే అర్జున్‌కు ఇంట్రస్టే. కానీ సిన్సియర్‌గా లవ్ చేయడం, ఇటాలియన్ మాఫియాతో పెట్టుకోవడం ఒకటే అంటాడు. కానీ కరెక్ట్ పర్సన్ లైఫ్‌లోకి రాగానే కృష్ణ ప్రేమలో పడతాడు. మరోవైపు అర్జున్ కూడా ఒక అమ్మాయికి మనసిచ్చేస్తాడు. అంతేకాదు ఒకే లక్ష్యం కోసం ఇద్దరు అడుగులు ముందుకు పడ్డాయి. కలిసి యుద్ధం చేశారు. ఎవరిపై? ఎందుకు? ఎలా గెలిచారు? అనేది సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని డ్యూయెల్ రోల్ చేసిన సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్ కథానాయికలు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కంప్లీటైంది. ఏప్రిల్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘యుద్ధం మీ అందరి కోసం సిద్ధం’’ అన్నారు నాని. ‘‘నాని నటనలో మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. కృష్ణ, అర్జున్ పాత్రల లుక్స్‌తో పాటు, మూవీ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ తమిళ. -
కృష్ణ అందరికీ నచ్చుతాడు– నాని
‘‘కృష్ణ, అర్జున అనే ఇద్దరు వ్యక్తులు ఓ పరిస్థితిలో ఒక సమస్యపై చేసే పోరాటమే ‘కృష్ణార్జున యుద్ధం’. కృష్ణది పల్లెటూరి పాత్ర. అర్జున్ రాక్‌స్టార్. నాకు కృష్ణ పాత్ర ఇష్టం. చిత్తూరు యాసలో మాట్లాడే పాత్ర. కృష్ణ పాత్ర తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని నాని అన్నారు. నాని హీరోగా అనుపమా పరమేశ్వరన్, రుక్సార్ మీర్ హీరోయిన్లుగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. వెంకట్ బోయనపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదల కానుంది. హిప్ హాప్ తమిళ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు డైరెక్ట్‌గా మార్కెట్లోకి విడుద.లయ్యాయి. నాని మాట్లాడుతూ –‘‘గాంధీ డైరెక్షన్ నాకు ఇష్టం. తనతో పని చేయాలనుకుంటే ఇప్పటికి కుదిరింది. మా చిత్రానికి ఏ సినిమా ఇన్స్పిరేషన్ కాదు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా తీశాం. హిప్ హాప్ తమిళ అందించిన పాటలు నా కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ ఆల్బమ్ అవుతుంది’’ అన్నారు. ‘‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రాల తర్వాత నా దర్శకత్వంలో వస్తోన్న సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. ఈ నెల 31న తిరుపతిలో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నాం. నాకు మంచి అవకాశం ఇచ్చిన నానీ అన్నకు స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు మేర్లపాక గాంధీ. ‘‘పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు నిర్మాత సాహు గారపాటి. చిత్రసమర్పకులు వెంకట్ బోయనపల్లి పాల్గొన్నారు. -
కృష్ణ... ఊర మాస్
ఎర్ర చొక్కా.. నల్ల బనియన్.. గళ్ల లుంగీ.. మెడలో తాయత్తు.. కత్తులను తలపిస్తున్న కోరమీసాలు.. రఫ్ గడ్డం.. పదునైన చూపులు.. సంక్రాంతి సందర్భంగా ఇలా పక్కా మాస్ లుక్‌లో ప్రత్యక్షమయ్యారు నాని. ఆయన తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తోన్న సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి సమర్పణలో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్, రుక్సార్ మీర్ కథానాయికలు. కృష్ణ పాత్రలో నాని ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో సరికొత్త నానీని తెరపై చూడనున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. హిప్ హాప్ తమిళ స్వరాలు, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఏప్రిల్ 12న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
తెలుగు సినిమా అంటే పిచ్చి!
‘‘నేను చిన్ననాటి నుంచి తెలుగు సినిమాలను చూస్తూ పెరిగాను. అందుకే సినిమా మీద ప్రేమతో ఐర్లాండ్‌లో డిప్లొమా ఇన్ స్క్రీన్‌ప్లే, లండన్‌లో డిప్లొమా ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ పూర్తి చేశాను. ‘ఆకతాయి’ సినిమాలో కొత్త ప్రయోగాలు చేశాను’’ అని రామ్ భీమన అన్నారు. ఆశిష్‌రాజ్, రుక్సార్ మీర్ జంటగా విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్ భీమన చెప్పిన విశేషాలు... ► పాయింట్ ఆఫ్ వ్యూ అనే టెక్నాలజీని మొదటిసారి ఈ సినిమాలో ప్రయోగించాను. తెలుగు సినిమా చరిత్రలోనే ఈ టెక్నాలజీతో సీన్స్ తీయడం ఇదే మొదటిసారి. నాకు కమర్షియల్ సినిమా అంటే పిచ్చి. ఎందుకంటే కామెడీ, ఫైట్స్, పాటలు.. ఇలా అన్ని ఒకే చోట దొరికేది కమర్షియల్ సినిమాలోనే. ‘ఆకతాయి’ హైలెట్స్ గురించి చెప్పుకోవాలంటే టెక్నాలజీతో పాటు మణిశర్మ సంగీతం అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఈ సినిమా పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేశారు. మణిశర్మ గారు నాతో మాట్లాడుతూ – ‘నాకు ఇది చాలా చిన్న సినిమా అని చెప్పి రెమ్యూనరేషన్ మాట్లాడారు. కానీ, చిన్న సినిమాల్లో ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది’ అన్నారు. ప్రతి పది నిమిషాలకు సినిమాలో ఒక్కో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతూ ఉంటుంది. ► ఈ సినిమా పాయింట్ గురించి చెప్పాలంటే... ఇది ఒక రివెంజ్ సబ్జెక్ట్. హీరో చాలా తెలివైనవాడు. అతనికి సాంకేతిక పరిజ్ఞానంపై విపరీతమైన పట్టు ఉంటుంది. తనకు వచ్చిన సమస్యను టెక్నికల్ నాలెడ్డ్తో ఎలా పరిష్కరించాడన్నదే చిత్రకథ. ► ‘దావతే ఇష్క్’ అనే హిందీ మూవీలో ఈ చిత్రకథానాయికుడు ఆశిష్‌రాజ్ గెస్ట్ రోల్ చేశాడు. గతంలో ఆశిష్ థియేటర్ ఆర్టిస్టు. రుక్సార్ మీర్ మా చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్నారు. ఇద్దరూ అద్భుతంగా నటించారు. ‘గజిని’ తరువాత తనకు గుర్తుండిపోయే విలన్ పాత్రల్లో ఈ చిత్రంలోని పాత్ర నిలుస్తుందని ప్రదీప్ రావత్ అన్నారు. అమీషా పటేల్ చాలా గ్యాప్ తర్వాత తెలుగు తెరపై కనిపించబోతున్న సినిమా ఇది. ఆమె చేసిన స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్. ► ఈ చిత్ర నిర్మాతలు రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో పేరు సంపాదించారు. సినిమాపై ఉన్న ప్రేమతో నిర్మాతలుగా మారారు. పేరుకి ఇది చిన్న సినిమా అయినా పెద్ద చిత్రానికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఖర్చుకి వెనకాడకుండా తీశారు. -
అన్నయ్య భయపడితే చాలు... ఆనందమే!
– రాజమౌళి ‘‘అన్నయ్య (కాంచీ)లో వెటకారం ఎక్కువ. ప్రతి ఒక్కరిలోనూ తప్పులు ఎత్తి చూపిస్తూ వెక్కిరిస్తాడు. తన సినిమాలో తప్పులు ఉండకూడదని కోరుకుంటున్నాను. కానీ, అందరూ కలసి నన్నెక్కడ విమర్శిస్తారోనని అన్నయ్య నిలబడిన తీరు చూస్తే ఆనందంగా ఉంది. తను భయపడితే చాలు... నాకు ఆనందంగా ఉంటుంది’’ అన్నారు ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన కజిన్, సంగీత దర్శకుడు కీరవాణి సోదరుడు ఎస్.ఎస్. కాంచీ దర్శకత్వం వహించిన సినిమా ‘షో టైమ్’. రణధీర్, రుక్సార్ మీర్ జంటగా జాన్ సుధీర్ పూదోట నిర్మించిన ఈ సినిమా పాటల్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. కీరవాణి స్వరపరిచిన పాటల సీడీలను అనుష్క విడుదల చేసి, తొలి సీడీని రచయిత శివశక్తి దత్తాకి అందజేశారు. రాజమౌళి థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత జాన్ సుధీర్ పూదోట తెలిపారు. ‘‘ఓ థియేటర్లో జరిగే కథే ఈ సినిమా. ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎప్పుడు చూస్తామా? అనే ఆసక్తి కలుగుతోంది’’ అన్నారు కె. రాఘవేంద్రరావు. ‘‘ప్రత్యేక గీతాలు, ఫైట్లు లేకుండా ప్రేక్షకులు ఆస్వాదించేలా కాంచీ సినిమా తీశాడు’’ అన్నారు కీరవాణి. కాంచీ మాట్లాడుతూ –‘‘నన్నెవరైనా విమర్శిస్తే సంతోషమే. నా తప్పులు తెలుసుకుంటాను. కానీ, నన్నెవరూ విమర్శించకుండా, నా తప్పులు వెతికే అవకాశం వాళ్లకి రాకూడదనే తపనతో ఈ సినిమా తీశా. సినిమాలో తప్పులేవైనా ఉంటే అవి నావి, ఒప్పులు మా టీమ్‌కి చెందుతాయి’’ అన్నారు. ‘‘మా అబ్బాయి కార్తికేయ బాగా పాడతాడని ఈ సినిమాలో పాట వినేవరకూ తెలియదు’’ అన్నారు రాజమౌళి. రచయిత విజయేంద్రప్రసాద్, నిర్మాత పీవీపీ, దర్శకుడు వైవీయస్ చౌదరి, సంగీత దర్శకుడు కల్యాణ రమణ తదితరులు పాల్గొన్నారు. -
ఆకతాయి మారాడు
‘‘మేనల్లుణ్ణి హీరోగా నిలబెట్టడం కోసం ముగ్గురు మావయ్యలు కలసి ఈ సినిమా నిర్మించారు. టీజర్ హాలీవుడ్ స్థాయిలో ఉంది. ఆశిష్‌రాజ్ అనుభవమున్న హీరోలా నటించాడు. సినిమా హిట్టయ్యి అతనికీ, చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నా’’ అన్నారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ఆశిష్‌రాజ్, రుక్సార్‌మీర్ జంటగా రామ్ భీమన దర్శకత్వంలో విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్ నిర్మించిన ‘ఆకతాయి’ టీజర్‌ని పరుచూరి గోపాలకృష్ణ, జీవీ వరప్రసాద్, ప్రతాని రామకృష్ణ గౌడ్ విడుదల చేశారు. రామ్ భీమన మాట్లాడుతూ – ‘‘ఓ ఆకతాయి కుర్రాడు అందరూ మెచ్చే విధంగా ఎలా మారాడనేది చిత్రకథ. ప్రేమ, వినోదం, ఉత్కంఠ... అన్నీ ఉన్నాయి. ‘కబాలి’గా బ్రహ్మానందం నటన, ప్రత్యేక గీతంలో అమీషా పటేల్ అందాలు ప్రేక్షకుల్ని ఆలరిస్తాయి’’ అన్నారు. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాతలు తెలిపారు. హీరో ఆశిష్‌రాజ్, నటులు అజయ్ ఘోష్, నవీన్ నేని, రచయిత రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. -
ఈ హీరో మహా ఆకతాయి
అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాళ్లను ‘ఆకతాయి’ అంటుంటారు. అటువంటి ఓ కుర్రాడిలో హీరోను చూశారు దర్శకుడు రామ్ భీమన. జనవరిలో అతణ్ణి చూపిస్తారట. ఆశిష్‌రాజ్, రుక్సార్ మీర్ జంటగా రామ్ భీమన దర్శకత్వంలో విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్ నిర్మిస్తున్న సినిమా ‘ఆకతాయి’. శుక్రవారం సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లను విడుదల చేశారు. ‘‘రెండు పాటల మినహా చిత్రీక రణ పూర్తయింది. వారం రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసి నిర్మాణానంతర కార్యక్రమాలు ప్రారంభిస్తాం. మణిశర్మ సంగీతం, అమీషా పటేల్ ప్రత్యేక గీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. జనవరి నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అని కౌశల్ కరణ్ చెప్పారు. సుమన్, నాగబాబు, బ్రహ్మా నందం, అలీ, ప్రదీప్ రావత్, పోసాని, పృథ్వీ ఇతర తారాగణం.