సాహు గారపాటి, మేర్లపాక గాంధీ, నాని, హరీష్ పెద్ది
‘‘కృష్ణ, అర్జున అనే ఇద్దరు వ్యక్తులు ఓ పరిస్థితిలో ఒక సమస్యపై చేసే పోరాటమే ‘కృష్ణార్జున యుద్ధం’. కృష్ణది పల్లెటూరి పాత్ర. అర్జున్ రాక్‌స్టార్. నాకు కృష్ణ పాత్ర ఇష్టం. చిత్తూరు యాసలో మాట్లాడే పాత్ర. కృష్ణ పాత్ర తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని నాని అన్నారు. నాని హీరోగా అనుపమా పరమేశ్వరన్, రుక్సార్ మీర్ హీరోయిన్లుగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. వెంకట్ బోయనపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదల కానుంది. హిప్ హాప్ తమిళ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి విడుద.లయ్యాయి.
నాని మాట్లాడుతూ –‘‘గాంధీ డైరెక్షన్ నాకు ఇష్టం. తనతో పని చేయాలనుకుంటే ఇప్పటికి కుదిరింది. మా చిత్రానికి ఏ సినిమా ఇన్‌స్పిరేషన్ కాదు. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడమే లక్ష్యంగా తీశాం. హిప్ హాప్ తమిళ అందించిన పాటలు నా కెరీర్‌లో వన్నాఫ్ ది బెస్ట్ ఆల్బమ్ అవుతుంది’’ అన్నారు. ‘‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రాల తర్వాత నా దర్శకత్వంలో వస్తోన్న సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. ఈ నెల 31న తిరుపతిలో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నాం. నాకు మంచి అవకాశం ఇచ్చిన నానీ అన్నకు స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు మేర్లపాక గాంధీ. ‘‘పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు నిర్మాత సాహు గారపాటి. చిత్రసమర్పకులు వెంకట్ బోయనపల్లి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment