నానీ
నానీ డబుల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘కృష్ణార్జునయుద్ధం’. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఇందులో అనూపమా పరమేశ్వరన్, రుక్సా మీర్ కథానాయికలుగా నటించారు. రీసెంట్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేదు. అయితే..‘‘సూపర్‌హిట్ ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాను మా డిజిటల్ కంటెంట్‌లో చూడండి’’అని ట్విటర్ ద్వారా యప్ టీవీ పేర్కొంది. దానికి నానీ స్పందిస్తూ –‘‘సినిమా సూపర్ హిట్ అవ్వలేదు బాబాయ్. ఆడలేదు కూడా. అయినా మనసుపెట్టి చేశాం. చూసేయ్యండి’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment