
ఈ హీరో మహా ఆకతాయి
అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాళ్లను ‘ఆకతాయి’ అంటుంటారు. అటువంటి ఓ కుర్రాడిలో హీరోను చూశారు దర్శకుడు రామ్ భీమన. జనవరిలో అతణ్ణి చూపిస్తారట. ఆశిష్‌రాజ్, రుక్సార్ మీర్ జంటగా రామ్ భీమన దర్శకత్వంలో విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్ నిర్మిస్తున్న సినిమా ‘ఆకతాయి’. శుక్రవారం సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌లను విడుదల చేశారు.
‘‘రెండు పాటల మినహా చిత్రీక రణ పూర్తయింది. వారం రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసి నిర్మాణానంతర కార్యక్రమాలు ప్రారంభిస్తాం. మణిశర్మ సంగీతం, అమీషా పటేల్ ప్రత్యేక గీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. జనవరి నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అని కౌశల్ కరణ్ చెప్పారు. సుమన్, నాగబాబు, బ్రహ్మా నందం, అలీ, ప్రదీప్ రావత్, పోసాని, పృథ్వీ ఇతర తారాగణం.