శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న 'ఇగో' | Ego Third Schedule about to start soon | Sakshi
Sakshi News home page

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న 'ఇగో'

Published Mon, Aug 28 2017 4:04 PM | Last Updated on Sun, Sep 17 2017 6:03 PM

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న 'ఇగో'

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న 'ఇగో'

'ఆకతాయి' సినిమా తరువాత  'వికెఎ ఫిలిమ్స్' నిర్మాణ సంస్థ తన ద్వితీయ చిత్రంగా నిర్మిస్తున్న చిత్రం 'ఇగో'. విజయ్ కరణ్, కౌసల్ కరణ్, అనిల్ కరణ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో ఆశిష్ రాజ్, సిమ్రాన్ లు జంటగా నటిస్తున్నారు. నవతరం ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా తో సుబ్రమణ్యం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ ను గోదారి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ రొమాంటిక్ సస్పెన్స్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న 'ఇగో' రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథానాయకుడి క్యారెక్టరైజేషన్ సరికొత్తగా ఉంటుంది. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. అనుకొన్నదానికంటే ముందుగానే షూటింగ్ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎక్కడా రాజీపడకుండా ప్రేక్షకులకు క్వాలిటీ ఔట్ పుట్ ఇచ్చేందుకు సర్వ సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేయనున్నాం' అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement