
‘ఆకతాయి’ సినిమా ఫేమ్ ఆశిష్ రాజ్, సిమ్రాన్ జంటగా రూపొందుతోన్న సినిమా ‘ఇగో’. సుబ్రమణ్యం దర్శకత్వంలో ‘ఆకతాయి’ నిర్మాతలు విజయ్ కరణ్–కౌసల్ కరణ్–అనిల్ కరణ్ నిర్మిస్తున్న ‘ఇగో’ మోషన్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ రొమాంటిక్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్ ఇది.
మూడు షెడ్యూల్స్‌లో దాదాపు 80% చిత్రీకరణ పూర్తి చేశాం. లాస్ట్ షెడ్యూల్ త్వరలో మొదలవుతుంది. భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హీరో పాత్ర సరికొత్తగా ఉంటుంది. క్వాలిటీ ఔట్‌పుట్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. దీక్షాపంత్, రావు రమేశ్, పోసాని, పృధ్వి, గౌతంరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ప్రసాద్ జి.కె.