
ఆడియో వేడుకలో ఓ దృశ్యం
‘ఆకతాయి’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరి యమైన ఆశిష్ రాజ్ నటించిన తాజా చిత్రం ‘ఇగో’ (ఇందు–గోపి). విజయ్ కరణ్, కౌషల్ కరణ్, అనిల్ కరణ్ నిర్మించిన ఈ చిత్రానికి సుబ్రమణ్యం దర్శకుడు. సాయికార్తీక్ స్వరకర్త. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆడియో సీడీని ఆవిష్కరించి, దర్శకుడు నక్కిన త్రినాథరావుకు అందించారు. ‘‘ఈ మధ్యకాలంలో క్యారక్టరైజేషన్‌ను బేస్ చేసుకుని వస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఆశిష్‌రాజ్ మొదటి సినిమాతో పోల్చితే చాలా ఇంప్రూవ్ అయ్యాడు’’ అన్నారు త్రినాథరావు. సుబ్రమణ్యం తమకు మంచి రోల్స్ ఇవ్వటంతో పాటు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని ఆశిష్‌రాజ్, సిమ్రాన్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ జి.కె.
Comments
Please login to add a commentAdd a comment