అలా రెండో సినిమా | akathaee hero new movie started | Sakshi
Sakshi News home page

అలా రెండో సినిమా

Published Sat, Apr 22 2017 12:23 AM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM

అలా రెండో సినిమా

అలా రెండో సినిమా

‘ఆకతాయి’తో హీరోగా పరిచయమైన ఆశిష్‌ రాజ్‌కు మరో ఛాన్స్‌ వచ్చింది. ‘ఆకతాయి’ను నిర్మించిన వీకేఏ ఫిల్మ్స్‌ సంస్థే ఈ సినిమానూ నిర్మించనుంది. మే నెలలో ఈ సినిమా ప్రారంభం కానుంది. నిర్మాతలు కేఆర్‌ విజయ్‌ కరణ్, కేఆర్‌ కౌశల్‌ కరణ్, కేఆర్‌ అనిల్‌ కరణ్‌ మాట్లాడుతూ– ‘‘యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన మా ‘ఆకతాయి’ను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.

ఆ సినిమాకు వచ్చిన ప్రేక్షకుల స్పందన చూసి రెండో సినిమాకు శ్రీకారం చుడుతున్నాం. యువ ప్రతిభాశాలి దర్శకుడిగా పరిచయం కానున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఆగస్టులో మొదలు పెడతాం. ఆశిష్‌ సరసన ప్రముఖ హీరోయిన్‌ నటిస్తారు. పూర్తి వివరాలు త్వరలోనే చెబుతాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement