ఆకతాయి... ఎంగేజింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ | Aakatayi engaging action entertainer | Sakshi
Sakshi News home page

ఆకతాయి... ఎంగేజింగ్ యాక్షన్ ఎంటర్టైనర్

Published Thu, Mar 16 2017 3:22 PM | Last Updated on Tue, Sep 5 2017 6:16 AM

ఆకతాయి... ఎంగేజింగ్ యాక్షన్ ఎంటర్టైనర్

ఆకతాయి... ఎంగేజింగ్ యాక్షన్ ఎంటర్టైనర్

షార్ట్ ఫిలింస్తో గుర్తింపు తెచ్చుకున్న రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కిన రెండో సినిమా ఆకతాయి. ఓ కొత్త హీరోతో యాక్షన్, ఎమోషన్స్, కామెడీ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్న పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మంచి విజయం సాధించాడు. ముఖ్యంగా మేకింగ్ విషయంలో రామ్, తీసుకున్న జాగ్రత్తలు క్వాలిటీ పరంగా సినిమాను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. ఫస్ట్ హాఫ్లో వచ్చే హీరో హీరోయిన్ల లవ్ సీన్స్, ఫ్యామిలీ డ్రామా, ఇంటర్వెల్ ట్విస్ట్ లతో సినిమాను ఎంటర్టైనింగ్గా నడిపించిన దర్శకుడు, ద్వితియార్థంలో మాస్ కమర్షియల్ సినిమాకు కావల్సిన ట్విస్ట్లు. మైండ్ గేమ్, యాక్షన్ సీన్స్ తో ఆడియన్స్ను కథతో ప్రయాణించేలా చేయగలిగాడు.

హీరో హీరోయిన్లు కొత్తవారైనప్పటికీ వారి నుంచి కథకు తగ్గ స్థాయి నటనను రాబట్టడంలో యూనిట్ విజయం సాధించింది. నటనతో పాటు యాక్షన్ సీన్స్తో హీరో ఆశిష్ రాజ్ ఆకట్టుకోగా.. హీరోయిన్ రుక్సార్ మీర్ తెరపై గ్లామరస్ లుక్స్తో మెప్పించింది. సుమన్, నాగబాబు, రాశీ, రాంకీ, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణమురళి లాంటి సీనియర్ యాక్టర్లతో పాటు మణిశర్మ లాంటి టాప్ టెక్నీషియన్స్ నుంచి మంచి వర్క్ రాబట్టుకున్నాడు. అక్కడక్కడ కొంత సాగతీత అనిపించినా కామెడీ సీన్స్తో బోర్ కొట్టకుండా జాగ్రత్త పడ్డారు. తన రెండో సినిమాకే వైవిధ్యమైన కథతో.. కమర్షియల్ ఎలెమెంట్స్ కూడా ఎక్కడా మిస్ కాకుండా తీసిన   రామ్ భీమన, టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement