పురుషోత్తముడు షురూ | 𝖱𝖺𝗃 Tharun Purushothamudu Movie Shooting Launch | Sakshi
Sakshi News home page

పురుషోత్తముడు షురూ

Published Tue, May 2 2023 4:43 AM | Last Updated on Tue, May 2 2023 4:58 AM

𝖱𝖺𝗃 Tharun Purushothamudu Movie Shooting Launch - Sakshi

రాజ్‌ తరుణ్, హాసినీ సుధీర్‌

రాజ్‌ తరుణ్‌ హీరోగా ‘పురుషోత్తముడు’ చిత్రం షురూ అయింది. రామ్‌ భీమన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హాసినీ సుధీర్‌ కథానాయిక. రమేష్‌ తెజావత్, ప్రకాష్‌ తెజావత్‌ నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి డైరెక్టర్‌ ఇంద్రగంటి మోహనకృష్ణ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత సి. కళ్యాణ్‌ క్లాప్‌ కొట్టారు. దర్శకుడు వీరశంకర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. రామ్‌ భీమన మాట్లాడుతూ– ‘‘ఆకతాయి’ చిత్రం తర్వాత నేను చేస్తున్న సినిమా ‘పురుషోత్తముడు’. హైదరాబాద్, రాజమండ్రి, కేరళలో ఈ చిత్రం షూటింగ్‌ని ప్లాన్‌ చేశాం’’ అన్నారు.

‘‘ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు చక్కటి ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్‌ ఉన్న చిత్రం ఇది’’ అన్నారు రాజ్‌ తరుణ్‌. ‘‘అమలాపురంలో పుట్టి కాకినాడలో పెరిగి ముంబైలో సెటిల్‌ అయ్యాం. రామ్‌గారు చెప్పిన కథ ఆకట్టుకోవడంతో ఈ సినిమా తీస్తున్నాం’’ అన్నారు రమేష్‌ తెజావత్, ప్రకాష్‌ తెజావత్‌. సినిమాటో గ్రాఫర్‌ పీజీ విందా, సంగీత దర్శకుడు గోపీసుందర్, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, నిర్మాతలు దామోదర్‌ ప్రసాద్, దాసరి కిరణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్‌: వెంగళరావు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement