Ram Bheemana
-
‘పురుషోత్తముడు’ శ్రీమంతుడు కాదు: రామ్ భీమన
రాజ్ తరుణ్, హాసినీ సుధీర్ జంటగా రామ్ భీమన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పురుషోత్తముడు’. డా. రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్ భీమన మాట్లాడుతూ– ‘‘మా సినిమాను ‘శ్రీ మంతుడు’ సినిమా కథతో పోల్చవద్దు. కోటీశ్వరుడైన యువకుడు ఇంటి నుంచి బయటకు రావడం అనే పాయింట్‌తో చాలా కథలు వచ్చాయి. కానీ కథను ఏం విధంగా చెప్పాం? ఎలా చెప్పాం అనేది ముఖ్యం’’ అన్నారు. ‘‘14 ఏళ్ల వయసులోనే ఆంధ్రా నుంచి ముంబై వెళ్లి, ఇప్పుడు బిజినెస్‌లో రాణిస్తున్నాను. తెలుగు సినిమా నిర్మించాలన్న నా ఆశ ఈ సినిమాతో నెరవేరింది. ఎక్కడా వల్గారిటీ ఉండదు. ఈ సినిమా కోసం చిత్రీకరించిన స్పెషల్ సాంగ్‌ను కూడా తీసేశాం. కుటుంబం అంతా కలిసి మా సినిమాను చూడొచ్చు’’ అన్నారు చిత్రనిర్మాత రమేశ్. -
పురుషోత్తముడు షురూ
రాజ్ తరుణ్ హీరోగా ‘పురుషోత్తముడు’ చిత్రం షురూ అయింది. రామ్ భీమన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హాసినీ సుధీర్ కథానాయిక. రమేష్ తెజావత్, ప్రకాష్ తెజావత్ నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత సి. కళ్యాణ్ క్లాప్ కొట్టారు. దర్శకుడు వీరశంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. రామ్ భీమన మాట్లాడుతూ– ‘‘ఆకతాయి’ చిత్రం తర్వాత నేను చేస్తున్న సినిమా ‘పురుషోత్తముడు’. హైదరాబాద్, రాజమండ్రి, కేరళలో ఈ చిత్రం షూటింగ్‌ని ప్లాన్ చేశాం’’ అన్నారు. ‘‘ఎంటర్టైన్మెంట్తో పాటు చక్కటి ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ ఉన్న చిత్రం ఇది’’ అన్నారు రాజ్ తరుణ్. ‘‘అమలాపురంలో పుట్టి కాకినాడలో పెరిగి ముంబైలో సెటిల్ అయ్యాం. రామ్‌గారు చెప్పిన కథ ఆకట్టుకోవడంతో ఈ సినిమా తీస్తున్నాం’’ అన్నారు రమేష్ తెజావత్, ప్రకాష్ తెజావత్. సినిమాటో గ్రాఫర్ పీజీ విందా, సంగీత దర్శకుడు గోపీసుందర్, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, నిర్మాతలు దామోదర్ ప్రసాద్, దాసరి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: వెంగళరావు. -
ఆకతాయి... ఎంగేజింగ్ యాక్షన్ ఎంటర్టైనర్
షార్ట్ ఫిలింస్‌తో గుర్తింపు తెచ్చుకున్న రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కిన రెండో సినిమా ఆకతాయి. ఓ కొత్త హీరోతో యాక్షన్, ఎమోషన్స్, కామెడీ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్న పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మంచి విజయం సాధించాడు. ముఖ్యంగా మేకింగ్ విషయంలో రామ్, తీసుకున్న జాగ్రత్తలు క్వాలిటీ పరంగా సినిమాను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే హీరో హీరోయిన్ల లవ్ సీన్స్, ఫ్యామిలీ డ్రామా, ఇంటర్వెల్ ట్విస్ట్ లతో సినిమాను ఎంటర్టైనింగ్గా నడిపించిన దర్శకుడు, ద్వితియార్థంలో మాస్ కమర్షియల్ సినిమాకు కావల్సిన ట్విస్ట్‌లు. మైండ్ గేమ్, యాక్షన్ సీన్స్ తో ఆడియన్స్‌ను కథతో ప్రయాణించేలా చేయగలిగాడు. హీరో హీరోయిన్లు కొత్తవారైనప్పటికీ వారి నుంచి కథకు తగ్గ స్థాయి నటనను రాబట్టడంలో యూనిట్ విజయం సాధించింది. నటనతో పాటు యాక్షన్ సీన్స్‌తో హీరో ఆశిష్ రాజ్ ఆకట్టుకోగా.. హీరోయిన్ రుక్సార్ మీర్ తెరపై గ్లామరస్ లుక్స్‌తో మెప్పించింది. సుమన్, నాగబాబు, రాశీ, రాంకీ, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణమురళి లాంటి సీనియర్ యాక్టర్లతో పాటు మణిశర్మ లాంటి టాప్ టెక్నీషియన్స్ నుంచి మంచి వర్క్ రాబట్టుకున్నాడు. అక్కడక్కడ కొంత సాగతీత అనిపించినా కామెడీ సీన్స్‌తో బోర్ కొట్టకుండా జాగ్రత్త పడ్డారు. తన రెండో సినిమాకే వైవిధ్యమైన కథతో.. కమర్షియల్ ఎలెమెంట్స్ కూడా ఎక్కడా మిస్ కాకుండా తీసిన రామ్ భీమన, టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. -
మార్చి 10న వస్తున్న 'ఆకతాయి'
ఆశిష్ రాజ్, రుక్సార్ మీర్ జంటగా తెరకెక్కుతున్న యాక్షన్ ప్యాక్డ్ లవ్ ఎంటర్టైనర్ 'ఆకతాయి'. వి కె ఎ ఫిలిమ్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు రామ్ భీమన దర్శకుడు. 'రివేంజ్ ఈజ్ స్వీట్' అనేది ట్యాగ్ లైన్. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కె.ఆర్.విజయ్ కుమార్, కె.ఆర్.కౌశల్ కరణ్, కె.ఆర్.అనిల్ కరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల "యు/ఎ" సర్టిఫికెట్తో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఆకతాయి మార్చి 10న విడదలవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌కు మంచి స్పందన రావటంతో సినిమా సక్సెస్‌పై యూనిట్ సభ్యులు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.