రాజ్ తరుణ్, హాసినీ సుధీర్ జంటగా రామ్ భీమన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పురుషోత్తముడు’. డా. రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్ భీమన మాట్లాడుతూ– ‘‘మా సినిమాను ‘శ్రీ మంతుడు’ సినిమా కథతో పోల్చవద్దు. కోటీశ్వరుడైన యువకుడు ఇంటి నుంచి బయటకు రావడం అనే పాయింట్‌తో చాలా కథలు వచ్చాయి. కానీ కథను ఏం విధంగా చెప్పాం? ఎలా చెప్పాం అనేది ముఖ్యం’’ అన్నారు.
‘‘14 ఏళ్ల వయసులోనే ఆంధ్రా నుంచి ముంబై వెళ్లి, ఇప్పుడు బిజినెస్‌లో రాణిస్తున్నాను. తెలుగు సినిమా నిర్మించాలన్న నా ఆశ ఈ సినిమాతో నెరవేరింది. ఎక్కడా వల్గారిటీ ఉండదు. ఈ సినిమా కోసం చిత్రీకరించిన స్పెషల్ సాంగ్‌ను కూడా తీసేశాం. కుటుంబం అంతా కలిసి మా సినిమాను చూడొచ్చు’’ అన్నారు చిత్రనిర్మాత రమేశ్.
Comments
Please login to add a commentAdd a comment