
రాజ్ తరుణ్- లావణ్య వివాదం పలు మలుపులు తిరుగుతూనే ఉంది. తాజాగా లావణ్యపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బసవరాజు, రాజ్యలక్ష్మి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లావణ్య తమ ఇంటి వద్దకు వచ్చి గొడవ చేస్తున్నట్లు వారు తెలిపారు. తమ ఇంటి వద్దకు వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించిందని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు.
మాదాపూర్‌లోని కాకతీయ హిల్స్ లో నివాసం ఉంటుంన్న రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లిన లావణ్య గొడవ చేసిందని సమాచారం. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న తమను లావణ్య ఇబ్బందులకు గురి చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి తలుపులు బలంగా కొడతూ తమను ఆందోళనకు గురిచేసినట్లు వారు చెబుతున్నారు.
ఆపై ఇంటి ముందు బూతులు తిడుతూ గట్టిగా కేకలు వేసి ఇబ్బందులుకు గురిచేసిందని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ కృష్ణమోహన్ వెల్లడించారు. అయితే, రాజ్ తరణ్ తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య ఆరోపిస్తుంది. తనను పెళ్లి చేసుకుని మాల్వీ మల్హోత్రతో ఎఫైర్ పెట్టుకున్నాడని ఆమె చెబుతుంది.
Comments
Please login to add a commentAdd a comment