రాజ్‌ తరుణ్‌ స్నేహితుడిని చెప్పుతో కొట్టిన లావణ్య | Raj Tarun Friend RJ Shekar Basha Fight With Lavanya | Sakshi
Sakshi News home page

రాజ్‌ తరుణ్‌ స్నేహితుడిని చెప్పుతో కొట్టిన లావణ్య

Published Thu, Aug 1 2024 7:41 PM | Last Updated on Thu, Aug 1 2024 8:29 PM

Raj Tarun Friend RJ Shekar Basha Fight With Lavanya

టాలీవుడ్‌లో రాజ్‌ తరుణ్‌- లావణ్య వ్యవహారంలో రచ్చ కొనసాగుతుంది. కొద్దిరోజుల క్రితం రాజ్‌ తరుణ్‌పై లావణ్య సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనను పెళ్లి చేసుకున్న రాజ్‌ తరుణ్‌ హీరోయిన్‌  మాల్వీ మల్హోత్రతో ఎఫైర్‌ పెట్టుకుని మోసం చేశాడని తెలిపింది. అయితే తాజాగా ఒక మీడియా ఛానల్‌లో లావణ్య, శేఖర్‌ భాష మధ్య పెద్ద గొడవే జరిగింది.

లావణ్య వివాదంలో రాజ్‌ తరుణ్‌ తరపున తన స్నేహితుడు శేఖర్‌ భాష పలు ఆధారాలతో మీడియా ముందుకు వచ్చాడు. లావణ్య డ్రగ్స్‌ తీసుకుంటుందని ఆయన తెలిపాడు. చిన్నపిల్లలకు కూడా లావణ్య డ్రగ్స్‌ అమ్మినట్లు మీడియా డిబెట్లో శేఖర్‌ బాష కామెంట్‌ చేశాడు. దీంతో ఆగ్రహించిన లావణ్య దాడికి దిగింది. లైవ్‌ రన్‌ అవుతుండగానే శేఖర్‌ బాషను లావణ్య చెప్పుతో కొట్టింది. దీంతో ఇద్దరూ ఆగ్రహంతో రెచ్చిపోయారు. 

అయితే, డ్రగ్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని లావణ్య తెలిపింది. కావాలని తనని ఇందులోకి లాగుతున్నారని ఆమె వారించింది. కానీ, ఆమె డ్రగ్స్‌ విక్రయించినట్లు ఆధారాలు ఉన్నాయని అందుకు సంబంధించిన లింక్‌ ఉన్న వ్యక్తి ఇక్కడికి వస్తున్నట్లు ఆయన చెప్పడంతో లావణ్య డిబెట్‌ మధ్యలో నుంచి వెళ్లిపోయింది. ఇలా రోజుకో కొత్త గొడవలతో వీరిద్దరి వ్యవహారం నడుస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement