ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘పురుషోత్తముడు’ | Purushothamudu Movie Pre-Release Event Highlights | Sakshi
Sakshi News home page

‘పురుషోత్తముడు’ మంచి క్లీన్‌ ఎంటర్‌టైనర్‌ అని గర్వంగా చెప్పగలను: రామ్‌ భీమన

Published Wed, Jul 24 2024 11:35 AM | Last Updated on Wed, Jul 24 2024 11:45 AM

Purushothamudu Movie Pre-Release Event Highlights

రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పురుషోత్తముడు’. హాసినీ సుధీర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, మురళీ శర్మ, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ముఖేష్‌ ఖన్నా ఇతర కీలక పాత్రల్లో నటించారు. రామ్‌ భీమన దర్శకత్వంలో డా. రమేశ్‌ తేజావత్, ప్రకాశ్‌ తేజావత్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. 

ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రామ్‌ భీమన మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా నేను ‘ఆకతాయి, హమ్‌ తుమ్‌’ అనే రెండు సినిమాలు చేశాను. ఆ తర్వాత ఆరేళ్లకు నాకు ‘పురుషోత్తముడు’ చాన్స్‌  వచ్చింది. విజయం సాధించాలనే పట్టుదలతో ఈ సినిమా చేశాను’’ అన్నారు. ‘‘మంచి క్లీన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ తీశామని గర్వంగా చెప్పగలం’’ అన్నారు రమేశ్‌ తేజావత్‌. 

‘‘పురుషోత్తముడు’లో మంచి పోలీసాఫీసర్‌ రోల్‌ చేశాను. ఈ సినిమా సక్సెస్‌ కావాలి’’ అన్నారు బ్రహ్మానందం.‘‘ఈ సినిమాలో నటించడాన్ని ఆస్వాదించా. రాజ్‌ తరుణ్‌ ఈ ప్రెస్‌మీట్‌కు రాలేదు. త్వరలోనే ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడతారు’’ అన్నారు రాజా రవీంద్ర. ‘‘నాది మహా రాష్ట్ర. నన్ను తెలుగు అమ్మాయిలా ఆదరించాలని కోరుకుంటున్నాను. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని అందరూ థియేటర్స్‌లో చూస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు హాసినీ సుధీర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement