రాజ్‌ తరుణ్‌- లావణ్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. | Twist In Raj Tarun Lavanya Case | Sakshi
Sakshi News home page

రాజ్‌ తరుణ్‌- లావణ్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌..

Published Tue, Feb 4 2025 1:38 PM | Last Updated on Tue, Feb 4 2025 3:49 PM

Twist In Raj Tarun Lavanya Case

సాక్షి, హైదరాబాద్‌: మస్తాన్‌ సాయి కేసులో సంచలన విషయాలు  ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమ, పెళ్లి,  పేరుతో అమ్మాయిలను ట్రాప్‌ చేసిన మాస్తాన్‌ సాయికి ఉచ్చు బిగ్గుస్తోంది. మరోసారి మస్తాన్ సాయిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడానికి నార్సింగ్ పీఎస్‌కి  లావణ్య వచ్చింది. మస్తాన్ సాయి కేసులో మరోసారి డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్ ఫేం ఆర్‌జే శేఖర్ బాషాపై లావణ్య ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి, శేఖర్ బాషా ఇద్దరు కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని లావణ్య అంటోంది. ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మస్తాన్ సాయి, శేఖర్ బాషా మాట్లాడుకున్న ఆడియోలను పోలీసులకు అందజేసింది. తనతో పాటు మరో యువతిని కూడా ఇరికించే ప్లాన్ చేశారని లావణ్య అంటోంది. 150 గ్రాముల ఎండీఎంఏ తెస్తానని శేఖర్ బాషాతో మస్తాన్ సాయి చెప్పాడు. ‘‘లావణ్య ఇంట్లో పార్టీ ఏర్పాటు చేయమని, పార్టీలో డ్రగ్స్ పెట్టి లావణ్యను, మరో యువతిని ఇరికిద్దామని మస్తాన్ సాయి, శేఖర్ బాషా సంభాషణల’’ ఆడియో క్లిప్‌ను పోలీసులకు లావణ్య అందజేసింది.

కాగా, సినీ హీరో రాజ్‌ తరుణ్‌ భార్య లావణ్యపై హత్యాయత్నం జరిగింది. గతంలో ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న, గుంటూరులో నమోదైన ఆ కేసులో నిందితుడిగా ఉన్న రావి బావాజీ మస్తాన్‌ సాయి ఈ దారుణానికి తెగపడ్డాడు. లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు సోమవారం మస్తాన్‌ను అరెస్టు చేశారు. అతడికి సహకరించిన గుంటూరు వాసి షేక్‌ ఖాజా మొయినుద్దీన్‌కు నోటీసులు జారీ చేశారు. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం... లావణ్యకు మస్తాన్‌ సాయితో 2022లో పరిచయమైంది.

ఆమెతో పలు సందర్భాల్లో వీడియో కాల్స్‌ మాట్లాడిన మస్తాన్‌ దాదాపు 40 కాల్స్‌ రికార్డు చేశాడు. 2023లో గుంటూరులో జరిగిన మస్తాన్‌ సోదరి వివాహానికి అతడు ఆహ్వానించడంతో లావణ్య వెళ్లింది. ఆ సందర్భంలో ఆమె తన వీడియోల విషయం ప్రశ్నించగా... తీవ్రంగా దాడి చేసిన మస్తాన్‌ ఆమెపై లైంగిక దాడికీ పాల్పడ్డాడు. వెంటనే ఆమె ఈ విషయాన్ని రాజ్‌తరుణ్‌కు ఫోన్‌ ద్వారా చెప్పారు. తాను హీరోగా ఉన్నానని, తన పేరు బయటకు రాకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని అతడు అనడంతో లావణ్య అక్కడి పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మస్తాన్‌పై కేసు నమోదైంది.

	ప్రేమ, పెళ్లి పేరుతో అమ్మాలయిను ట్రాప్ చేసిన మస్తాన్సాయి

ఆడవాళ్ల జీవితాలతో...
ఇదిలా ఉండగా... మస్తాన్‌ సాయి అనేక మంది ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నాడని, స్నేహం, ప్రేమ, పెళ్లి పేరుతో వారికి వల వేస్తున్నాడని లావణ్యకు తెలిసింది. మరికొందరి ఫోన్లు హ్యాక్‌ చేసి వారి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడినట్లు ఆమె దృష్టికి వచ్చింది. అలా సంగ్రహించిన, రికార్డు చేసిన వందలాది నగ్న వీడియోలు, కాల్‌ రికార్డులను 4 టీబీ సామర్థ్యం కలిగిన హార్డ్‌డిస్క్‌లో మస్తాన్‌ దాచినట్లు గమనించింది. ఇటీవల మస్తాన్‌ సాయి ఇంటికి వెళ్లిన ఆమె.. ఆ హార్డ్‌డిస్క్‌ను తన అధీనంలోకి తీసుకుని ఇంటికి తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఆ హార్డ్‌డిస్క్‌ కోసం మస్తాన్‌ అనేక రకాలుగా లావణ్యపై ఒత్తిడి చేస్తున్నాడు. గత నెల 31న మరికొందరితో కలిసి లావణ్య ఇంటికి వచ్చిన మస్తాన్‌ ఆమెపై దాడికి యత్నించాడు.

మస్తాన్, ఖాజా సహా ముగ్గురిపై పోలీసులు కేసు 
టీవీ, సీసీ కెమెరాలు సహా అనేక వస్తువులు ధ్వంసం చేశాడు. తీవ్ర భయాందోళనలకు గురైన ఆమె ఆ రోజు తన స్నేహితురాలి దగ్గర ఆశ్రయం పొంది అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆపై ఆదివారం రాత్రి మరోసారి డ్రగ్స్‌ మత్తులో లావణ్య ఇంటికి వచ్చిన మస్తాన్‌ ఆమెతో పాటు ఆమె సోదరుడినీ నిర్బంధించాడు. లావణ్య గొంతు నులిమి హత్యాయత్నం చేసి, ల్యాప్‌టాప్, హార్డ్‌డిస్క్‌ తదితరాలను బలవంతంగా లాక్కున్నాడు. ఆ సమయంలో అతడి వెంట ఖాజా, మరొకరు కూడా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మస్తాన్, ఖాజా సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మరో ప్రముఖ హీరో పేరు..
సోమవారం మస్తాన్‌ను అరెస్టు చేసి జ్యుడీషి యల్‌ రిమాండ్‌కు తరలించిన పోలీసులు ఖాజాకు నోటీసులు జారీ చేశారు. మస్తాన్‌ వద్ద ఉన్న బ్యాగ్‌ నుంచి హార్డ్‌డిస్‌్క, ల్యాప్‌టాప్‌ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. నార్సింగి పోలీసులకు లావణ్య ఇచ్చిన ఫిర్యాదులో మరో ప్రముఖ హీరో పేరునూ ప్రస్తావించారు. మస్తాన్‌సాయి ఇంట్లో నుంచి తెచ్చిన హార్డ్‌ డిస్క్‌ కోసం తనను చంపేందుకు ప్రయత్నించారని, తనకు ప్రాణహాని ఉందని లావణ్య అన్నారు.

సోమవారం ఆమె నార్సింగి పోలీస్‌స్టేషన్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ, మస్తాన్‌సాయితో పాటు అతని తండ్రి తనను చంపేందుకు చూస్తున్నారని, ఇప్పటికే తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని చెప్పారు. ఇన్ని రోజులు తన వద్ద సరైన సాక్ష్యాధారాలు లేక మిన్నకున్నానని, ఇప్పుడు పూర్తి వివరాలతో మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఇప్పుడు కూడా కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను మస్తాన్‌సాయిపై ఆదివారం ఇచ్చిన ఫిర్యాదుపై స్టేట్‌మెంట్‌ రికార్డు చేసేందుకు పోలీసులు పిలిపించారని, వారు అడిగిన వివరాలను ఇచ్చానని ఆమె వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement