విలేజ్‌ టు సిటీ | aakathai film is released as Dasara gift. | Sakshi
Sakshi News home page

విలేజ్‌ టు సిటీ

Published Sun, Jun 18 2017 11:49 PM | Last Updated on Tue, Sep 5 2017 1:56 PM

విలేజ్‌ టు సిటీ

విలేజ్‌ టు సిటీ

‘ఆకతాయి’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన ఆశిష్‌ రాజ్‌ రెండో చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ‘ఆకతాయి’ చిత్రం నిర్మించిన వికెఏ ఫిల్మ్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ముంబై భామ సిమ్రన్‌ కథానాయిక.

నిర్మాతలు విజయ్, కౌశల్, అనిల్‌ మాట్లాడుతూ– ‘‘ఆశిష్‌ రాజ్‌ కోసం చాలా కథలు విన్నాం. సుబ్రహ్మణ్యం చెప్పిన కథ బాగా నచ్చింది. గ్రామీణ, పట్టణ నేపథ్యంలో జరిగే ప్రేమ కథ ఇది. వినోదం, యాక్షన్, థ్రిల్‌.. ఇలా అన్ని అంశాలూ ఉంటాయి. జూలైలో షూటింగ్‌ ప్రారంభించి, దసరా కానుకగా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: ప్రసాద్‌ జీకే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement